India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జీఆర్పీ, RPF పోలీసులు కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన తనిఖీల్లో రూ.37.50 లక్షల నగదు పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ రామ్ బ్యాగులో నగదు గుర్తించిన పోలీసులు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. ఆదాయ శాఖ అధికారులకు నగదు అప్పజెప్పినట్లు GRP ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.
వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేసవి వడగాల్పులు, వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి సోమవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రానున్న 2 నెలల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని..ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగుజాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గోడప్రతులను ఆవిష్కరించారు.
స్టేషన్ ఘన్‌పూర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన కడియం శ్రీహరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్టీ వీడుతున్న వారిపై మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో కడియం శ్రీహరికి తగిన గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నిరుద్యోగుల నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి పరారైన ఘటన MBNR జిల్లాలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మహమ్మద్ ఇలియాజ్ ESIలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు. నకిలీ ఆర్డర్ కాపీలు ఇచ్చి గండీడ్, పరిగి మండలాలకు చెందిన నిరుద్యోగుల నుంచి రూ.10లక్షలు తీసుకొని పరారయ్యాడు. దీంతో పంజాగుట్ట PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
గ్రేటర్ HYDలో గ్యాస్ సిలిండర్లపై అధిక ధరలు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ DT మాచన రఘునందన్ తెలిపారు. గ్యాస్ డోర్ డెలివరీ ఆలస్యం చేయడంతో వినియోగదారులే డీలర్ల వద్దకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి పలుచోట్ల ఏర్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైల్ ధరకు రూ.1 అధికంగా అడిగినా అక్కడే నిలదీయాలని, వినకుంటే తమకు Xలో ఫిర్యాదు చేసినా స్పందిస్తామన్నారు.

టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డికి కాంగ్రెస్.. కీలక పదవిని అప్పగించింది. కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ వ్యవహారాల ఛైర్మన్‌గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పదవిని అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

HYD అంబర్‌పేట్‌లో మాజీ మంత్రి KTR.. BRS సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంబర్‌పేట్‌లో రోడ్డు పక్కన ఉన్న ఓ మిర్చి బండి మహిళతో KTR ముచ్చటించారు. ఆమెతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో BRSను గెలిపించాలని KTR కోరారు. మన తెలంగాణ గళం పార్లమెంట్‌లో వినిపించాలంటే BRSతోనే సాధ్యమని అన్నారు.
‘A’ సర్టిఫికేట్ పొందిన సినిమాలను చూడటానికి మైనర్‌లను సినిమా థియేటర్లలోకి అనుమతించకూడదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ శింగేనవార్ అన్నారు. వ్యక్తులుగానీ, యాజమాన్యం గాని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు థియేటర్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమాచారం థియేటర్ గేట్ల ముందు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు.
Sorry, no posts matched your criteria.