India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహాలక్ష్మి స్కీం సందర్భంగా ప్రస్తుతం ఉన్న డిమాండ్ మేరకు ఖమ్మం రీజియన్‌లో అదనంగా 195 బస్సులు, 1000 మంది సిబ్బంది అవసరముందని.. ఇందుకోసం యాజమాన్యానికి ప్రతిపాదనలను పంపించామని రీజినల్ మేనేజర్ వెంకన్న అన్నారు. ఇటీవల రీజియన్‌కు 20 ఏసీ, నాన్ ఏసీ బస్సులు వచ్చాయి. వీటిని వివిధ డిపోలకు కేటాయించి అవసరమైన రూట్లలో తిప్పుతున్నామని చెప్పారు.
బెజ్జుర్ మండలంలోని లంబడిగూడ శివారులోని ప్రాణహిత నదిలో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. మృతదేహానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
భర్త వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల ప్రకారం.. KNRకి చెందిన మౌనికరెడ్డిని, హుజూరాబాద్‌కి చెందిన రాకేశ్‌రెడ్డితో 2016లో పెళ్లైంది. రాకేశ్‌కెడ్డి తండ్రి తన ఆస్తిలో కొంతస్థలాన్ని మనవడి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో ఇద్దరికి గొడవలు జరుతున్నాయి. ఆదివారం మౌనిక తండ్రికి ఫోన్ చేసి భర్త వేధిస్తున్నాడని, తెలిపి ఉరేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
HYD శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో కొలువుదీరిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన వేళలను మార్చినట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శించవచ్చన్నారు. శని, ఆదివారాల్లో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు భక్తులు రావచ్చన్నారు. SHARE IT

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) సెకండరీ(పదో తరగతి), సీనియర్ సెకండరీ(12వ తరగతి) పబ్లిక్ పరీక్షలు ఈనెల 6 నుంచి మే 22వరకు నిర్వహించనున్నట్లు NIOS HYD ప్రాంతీయ సంచాలకులు పి.సుబ్రమణ్యం తెలిపారు. విద్యార్థులు పరీక్ష తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌తో పాటు హాల్టికెట్లను NIOS వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం 040-24752859, 24750712నంబర్లను సంప్రదించాలని సూచించారు.

రీజినల్ రింగ్ రోడ్డు(RRR) అలైన్‌మెంట్‌లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోడ్డు నిర్మాణంలో సాగు భూములు కోల్పోకుండా, రైతులకు నష్టం వాటిల్లకుండా రూట్ మ్యాప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. RRR ఉత్తర భాగంలోని యాదాద్రి జిల్లా పరిధిలో అలైన్‌మెంట్‌లో ఈ మార్పులు జరగనున్నట్టు సమాచారం. అధికారులు ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. అలైన్‌మెంట్ మార్పుతో DPRలోనూ మార్పులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్ పూర్ శివారులోని పాండవుల గుట్టపై సుమారు పదివేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు గీసిన చిత్రాలు ఉన్నట్లు హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేపీ రావు పేర్కొన్నారు. పాండవుల గుట్టపై ఉన్న చిత్రాలను పరిశోధక విద్యార్థి ప్రవీణ్ రాజ్‌తో కలిసి ఆదివారం పరిశీలించారు. బృహత్ శిలా యుగంలో చిత్రాలను గీసినట్లు ఆయన వివరించారు.
Sorry, no posts matched your criteria.