India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MBNR: ప్రస్తుత నిబంధనల ప్రకారం గ్రేడ్-2 ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల బదిలీ, పదోన్నతులు, ఎస్జీటీలు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందేందుకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అని MBNR జిల్లా విద్యాధికారి ఎ.రవీందర్, NGKL జిల్లా విద్యాధికారి గోవిందరాజులు అన్నారు. అర్హత సాధించలేని ఉపాధ్యాయులంతా టెట్‌కు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
100 రోజుల రేవంత్ రెడ్డి పాలనను చూసి ప్రజలు సంతోషిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో HYD ఎల్బీనగర్ పరిధి కర్మన్‌ఘాట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌ను అసెంబ్లీ ఎన్నికలో ఆదరించారని, అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలిపించాలని కోరారు. మూసీ ప్రక్షాళనకు CM రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. BRSను నమ్మొద్దన్నారు.
100 రోజుల రేవంత్ రెడ్డి పాలనను చూసి ప్రజలు సంతోషిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో HYD ఎల్బీనగర్ పరిధి కర్మన్‌ఘాట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌ను అసెంబ్లీ ఎన్నికలో ఆదరించారని, అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలిపించాలని కోరారు. మూసీ ప్రక్షాళనకు CM రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. BRSను నమ్మొద్దన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలనుకుంటున్న అధికార కాంగ్రెస్ దూకుడు పెంచింది. లోకసభ స్థానాల వారీగా ఇన్‌ఛార్జీలను నియమించింది. ఖమ్మం పార్లమెంట్ ఇన్‌ఛార్జీగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జీగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవహరించనున్నారని ఏఐసీసీ కార్యాలయం నుంచి ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు.
హన్వాడ మండలంలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. స్థానికుల వివరాలు.. వేపూరుకు చెందిన శివాణి HYDలో ఉద్యోగం చేస్తుంది. పెళ్లి చూపుల కోసం గురువారం ఇంటికి వచ్చిన శివాణి శుక్రవారం అస్వస్థతకు గురికాగా RMP వద్దకు వెళ్లగా కొంత నయమైంది. శనివారం నీరసంగా ఉందని మళ్లీ వెళ్తే RMP సైలెన్ ఎక్కించడంతో తీవ్ర చలిజ్వరం వచ్చింది. వెంటనే MBNRలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయింది.
వేడి నూనె పడి యువకుడు మృతి చెందిన ఘటన చెన్నూరు మండలంలో చోటుచేసుకుంది. ఏఎస్ఐమాజీద్ తెలిపిన వివరాల ప్రకారం.. సుందర శాలకు చెందిన సురేశ్(30) మద్యం మత్తులో మార్చి నెల 25న చేపలు ఫ్రై చేస్తుండగా ముఖంపై వేడి నూనె పడింది. దీంతో గాయపడిన అతడిని కుటుంబీకులు మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సురేశ్ ఆదివారం మృతి చెందినట్లు ఏఎస్ఐ తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్ఠానం ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌లు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. నల్లగొండ, భువనగిరి పార్లమెంటుకు ఏఐసీసీ తరఫున ఇన్‌ఛార్జిగా రోహిత్ చౌదరిని నియమించారు. నల్గొండకు ఇన్‌ఛార్జ్‌గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా నియమించారు.
వివాహితపై అత్యాచారయత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లబెల్లి మండలంలోని ఓ గ్రామంలో మహిళ తన ఇంటి వెనకాల ఉన్న బాత్‌రూంలోకి వెళ్లారు. ఓ వ్యక్తి ఇదే అదునుగా భావించి మహిళపై అత్యాచారయత్నం చేశాడు. మహిళ కేకలు వేయడంతో అక్కడ నుంచి పారిపోయాడు. మహిళ పరిస్థితి విషమంగా మారడంతో ఎంజీఎంలో చేర్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామారావు తెలిపారు.
సుల్తానాబాద్ మండలం సుద్దాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపిన ప్రకారం… ఓదెల మండలానికి శ్రీనివాస్(46) ఓ వివాహ వేడుకల్లో పాల్గొని తిరిగి ఓదెలకు వెళ్తున్న క్రమంలో సుద్దాల సమీపంలో బైక్ అదుపుతప్పి చెట్టుకి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఓ ఇంటర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఖైరతాబాద్ మార్కెట్ ప్రాంతంలో నివాసం ఉండే విద్యార్థి(16) SRనగర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివి, ఇటీవల పరీక్షలు రాశాడు. ఎంసెట్, IIT పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఆదివారం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఎంసెట్, ఐఐటీల్లో సీటు పొందేలా కష్టపడాలని కుటుంబ సభ్యులు చెబుతుండడంతో ఒత్తిడికి గురై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.