Telangana

News September 3, 2024

సిర్పూర్ (టి)లో విషాదం.. డెంగ్యూతో బాలిక మృతి

image

సిర్పూర్ (టి)మండలంలోని వెంకట్రావు పేట్ గ్రామానికి చెందిన గంగోత్రి (16) డెంగ్యూతో మృతి చెందింది. సోమవారం బాలికను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. డెంగ్యూ జ్వరాలపై వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

News September 3, 2024

జూబ్లీహిల్స్: బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు

image

ప్రపంచ నగరాలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్న మహానగరం ప్రజా రవాణాలో వెనకబడిపోతోంది. బస్సుల కొరతతో వందలాది మార్గాలను ఆర్టీసీ వదిలేసింది. ప్రస్తుతం నగరంలో 2,850 సిటీ బస్సులు 795 మార్గాలలో 25వేల ట్రిప్పులు నడుస్తున్నాయి. గతంలో కంటే ప్రస్తుతం 1,000 బస్సులు తక్కువగా నడుస్తున్నందున ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో తరచూ బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి.

News September 3, 2024

HYD: నాలాలను పూర్వ స్థితికి తేవడానికి రూ.650 కోట్లు

image

నగరంలో నాలాలను పూర్తిగా సంస్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలాలపై ఆక్రమణలను తొలగించి పూర్వ రూపు తేవడానికి ప్రణాళికను రూపొందించింది. నాలాలపై అక్రమణలను తొలగించడానికి హైడ్రా రంగంలోకి దిగనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. నాలాలను పూర్వస్థితికి తీసుకురావడానికి రూ.650కోట్లు ఖర్చు అవుతుందని సెక్రటరీ దాన కిషోర్ తెలిపారు. ప్రభుత్వం నిధులు సమకూర్చితే వచ్చే వర్షాకాలంలో వరద సమస్యలు ఉండవన్నారు.

News September 3, 2024

పోయిన సర్టిఫికెట్లు అందిస్తాం: కలెక్టర్

image

ఖమ్మం మున్నేరు వరద ముంపు ప్రాంతాలను మంగళవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ట్రైని కలెక్టర్‌లతో కలిసి జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సందర్శించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు బాధితులు ఇంట్లో సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయని చెప్పగా, అధైర్య పడవద్దని, సర్టిఫికెట్లు అందిస్తామని చెప్పారు. డివిజన్ వారీగా ఎక్కువ వర్కర్లను పెట్టి త్వరగా శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు.

News September 3, 2024

HYD: సర్కారు నిర్లక్ష్యానికి 20 మంది బలి: కేటీఆర్

image

రాష్ట్రంలో వరద సహాయక చర్యలు చేపట్టడంలో రేవంత్ సర్కారు విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ఈ నిర్లక్ష్యం ఖరీదు 20 మంది ప్రాణాలు కోల్పోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనుల వల్లే హైదరాబాద్‌కు వరద ముప్పు తప్పిందని అన్నారు.

News September 3, 2024

HYD: సర్కారు నిర్లక్ష్యానికి 20 మంది బలి: కేటీఆర్

image

రాష్ట్రంలో వరద సహాయక చర్యలు చేపట్టడంలో రేవంత్ సర్కారు విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ఈ నిర్లక్ష్యం ఖరీదు 20 మంది ప్రాణాలు కోల్పోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనుల వల్లే హైదరాబాద్‌కు వరద ముప్పు తప్పిందని అన్నారు.

News September 3, 2024

వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ తక్షణ చర్యలు: మంత్రి

image

వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రూ.4 నుంచి 5లక్షలు పెంచిందన్నారు. పూర్తిగా దెబ్బతిన్న పంట పొలాలకు ఎకరానికి రూ.10వేల నష్టపరిహారం ఇస్తుందన్నారు. కంటింజెన్సీ ఫండ్ కింద వరద బాధిత ఒక్కో జిల్లాకు రూ.5కోట్లు అని, జిల్లాలో 24/7 పనిచేసేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

News September 3, 2024

HYD: FIR నుంచి మంత్రుల పేర్ల తొలగింపు.. కోర్టులో పిటిషన్

image

కేంద్ర మంత్రులు అమిత్, కిషన్ రెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించడంపై పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ నాంపల్లి కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ వేశారు. 2024 మే 1న ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ శాలిబండలో కేసు నమోదైందని, విచారణలో వారు కోడ్ ఉల్లంఘించలేదని పేర్లు తొలగించారు. ఈ నేపథ్యంలో కోడ్ ఉల్లంఘనకు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నెల 14కు వాయిదా వేసింది.

News September 3, 2024

నిజామాబాద్ నగరంలో భారీ చోరీ

image

నిజామాబాద్ నగరంలోని ఐదో పోలీస్ స్టేషన్ పరిధిలో గల బ్యాంక్ కాలనీలో భారీ చోరీ జరిగింది. కాలనీకి చెందిన శ్రీనివాస్ కుటుంబంతో హైదరాబాద్ వెళ్లాడు. సోమవారం రాత్రి దొంగలు వారి ఇంట్లో చోరీకి పాల్పడి పది తులాల బంగారం, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లినట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఘటన స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News September 3, 2024

HYD: ఉస్మానియా ఆసుపత్రి పై సీఎం ఆదేశాలు

image

✓HYD గోషామహల్లో 32 ఎకరాల్లో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం
✓రానున్న 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆసుపత్రి భవనాల డిజైన్లు ఉండాలి
✓అకడమిక్ బ్లాక్‌తో పాటు, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు నిర్మించాలి
✓కాంక్రీట్ భవంతులే కాక, ఆహ్లాదాన్ని పంచేలా విశాలమైన ఖాళీ ప్రాంగణం ఉండాలి
✓గోషామహల్ పోలీస్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ భూములను వైద్యారోగ్య శాఖకు అప్పగించండి