India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు ఉండాలని గతంలో ఎంపీగా రేవంత్‌రెడ్డిని గెలిపిస్తే.. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ప్రతిపక్షాలపై కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారని బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. HYD నాగారంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ఈటల మాట్లాడారు. దేశంలో బీజేపీ గాలి వీస్తుందని, మూడోసారి మోదీ హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి రావడం పక్కా అని అన్నారు.

ఎన్నికల్లో అక్రమాలపై పౌరులు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి చూసించారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన సి-విజిల్ యాప్‌ను అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం, మతపరమైన ప్రసంగాలు తదితరాలపై సి-విజిల్ యాప్ ద్వారా జిల్లా యంత్రాంగానికి తెలపాలన్నారు. ఫిర్యాదుకు ఫొటోలు, వీడియోలు జత చేయాలని, 100 నిమిషాల్లో చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
బాలుర హైస్కూల్లో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని డీఈఓ రామారావు శనివారం తనిఖీ చేశారు. ఆ సమయంలో పరీక్షా కేంద్రంలోని ఓ గదిలో ఉపాధ్యాయురాలు సెల్ ఆపరేట్ చేస్తూ డీఈఓకు కనిపించారు. నిబంధనలకు విరుద్దంగా ముగ్గురు ఇన్విజిలేటర్లు, ఛీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు సెల్ ఫోన్స్ తీసుకురావడాన్ని గమనించి వారిని సస్సెండ్ చేసినట్లు సమాచారం.ఈ విషయాన్ని డీఈఓ కలెక్టర్‌కి తెలియజేశారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిలను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా సుదర్శన్ రెడ్డి, జహీరాబాద్ ఇన్‌ఛార్జిగా దామోదర్ రాజ నర్సింహను నియమించారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు SI నరేశ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. గన్నేరువరం మండలం మాదాపూర్‌లో EGS పథకంలో సీసీ రోడ్డు నిర్మాణం ఆదివారం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ARO కిరణ్ ఆదేశాల మేరకు FST టీమ్ ఇన్‌ఛార్జ్ రాజశేఖర్ పరిశీలించి BJP నాయకులు తిరుపతి, రాజిరెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీకాంత్ ప్రారంభించారని నిర్ధారించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.
కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శనతో సందర్శకులను అలరించారు. HYD మాదాపూర్‌లోని శిల్పారామంలో ఆదివారం శ్రీగురు నాట్యాలయం గురువు శ్రీలక్ష్మీ నల్లమోలు శిష్యబృందం కూచిపూడి నృత్యప్రదర్శనను నిర్వహించారు. ఇందులో గణేశ వందన, గణేశ పంచరత్న, బ్రహ్మంజలి, నటేశకౌతం, హనుమాన్ చాలీసా, స్వరజతి, శివస్తుతి, రామదాసు కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, కళింగనర్తన, తిల్లాన తదితర అంశాలను కళాకారులు ప్రదర్శించారు.

టెక్నాలజీ సాయంతో ఓ ప్రయాణికుడు ఆటోలో పోగొట్టుకున్న బంగారాన్ని పాల్వంచ పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెం ఎంజీ రోడ్ కు చెందిన సూరిబాబు పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో మొక్కులు తీర్చుకోవడానికి వచ్చాడు. తిరిగి ఆటోలో వెళుతున్న క్రమంలో 8 తులాల బంగారు నగలు, సెల్ ఫోన్ ఉన్న బ్యాగును ఆటోలోనే మర్చిపోయాడు. బాధితుడి మొబైల్ లోకేషన్ ఆధారంగా బ్యాగును గుర్తించారు.
మల్కాజిగిరిలో గెలుపే లక్ష్యంగా BRS నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రచారంలో ‘పక్కా లోకల్’ అనే నినాదాన్ని వారు ఎత్తుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డి వికారాబాద్ నుంచి వచ్చారని, BJPఅభ్యర్థి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి వచ్చారని కానీ BRSఅభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ‘పక్కా లోకల్’ అంటూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, BJP సైతం తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.