Telangana

News April 1, 2024

ఆదిలాబాద్ జిల్లా డిగ్రీ విద్యార్థులకు గమనిక

image

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీని పొడగించినట్లు KU అధికారులు పేర్కొన్నారు. మార్చి 31 తేదీ వరకు ఉన్న గడువును ఏలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు పొడగించారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 16 వరకు చెల్లించవచ్చన్నారు. ఉమ్మడి జిల్లాలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
>>SHARE IT

News April 1, 2024

నేడు వరంగల్ మార్కెట్ పునః ప్రారంభం

image

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు పున:ప్రారంభం కానుంది. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచిధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News April 1, 2024

జిల్లాలో నెల రోజులపాటు పోలీసు యాక్ట్ అమలు: ఎస్పీ చందనా దీప్తి

image

నల్గొండ జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 1నుండి 30 వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సమావేశాలు నిర్వహించరాదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవన్నారు.

News April 1, 2024

KNR: ఏప్రిల్5న ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ పర్యటన: ఎమ్మెల్యే గంగుల

image

ఉమ్మడి జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించి, రైతులకు బాసటగా నిలిచేందుకు ఏప్రిల్ 5న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు రానున్నారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడించారు. ఎంపీ అభ్యర్థి బోయిన్‌పల్లి వినోద్‌కుమార్ నివాసంలో కేసీఆర్ పర్యటన ఏర్పాట్లలో భాగంగా జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, పలువురి నాయకులతో గంగుల సమావేశం నిర్వహించారు.

News April 1, 2024

ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలి: కలెక్టర్

image

సీ విజిల్ యాప్ ద్వారా ప్రజలు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్లను మభ్య పెట్టేందుకు ఎవరైనా అక్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేయడం, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడే వాటిని లైవ్ ఫోటోలు, వీడియోలను సీ విజిల్ యాప్ ద్వారా తీసి పంపాలని కోరారు.

News March 31, 2024

MBNR: రెండు పార్లమెంట్ స్థానాలకు ఇన్చార్జిల నియామకం

image

రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి పాలమూరులోని రెండు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను AICC నియమించింది. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా AICC కార్యదర్శి సంపత్ కుమార్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా మంత్రి జూపల్లి కృష్ణారావులను నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.

News March 31, 2024

ఈతకు వెళ్లే వారి పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి:SP

image

నల్లగొండ: వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో చిన్న పిల్లలు, యువకులు ఈత సరదా కొరకు వెళ్లి ఈత రాకపోవడంతో ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలనీ, బావులు, చెరువులు, కాల్వల వద్ద ఈత చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పాఠశాలలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో యువకులు, పిల్లలు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్తుంటారని తెలిపారు.

News March 31, 2024

MBNR: ఒకే వేదికపై పాలమూరు ఎంపీ అభ్యర్థులు

image

మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థులు ఒకే వేదికపై దర్శనమిచ్చారు. నేడు ఈస్టర్ పండగ సందర్భంగా ఎంబి కల్వరి చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈస్టర్ వేడుకకు పార్లమెంటరీ అభ్యర్థులు డీకే అరుణ(బీజేపీ), చల్లా వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్), మన్నే శ్రీనివాస్ రెడ్డి(బీఆర్ఎస్) హాజరయ్యారు. ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆప్యాయతను కనబరిచారు. అభ్యర్థులను చర్చి కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో చర్చి సభ్యులు పాల్గొన్నారు.

News March 31, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మెట్ పల్లి మండలం పెద్దాపూర్ లో వైభవంగా మల్లన్న బోనాల జాతర. @ గంగాధర మండలంలో బిఆర్ఎస్ నాయకుల ధర్నా. @ చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అరెస్ట్. @ సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కరీంనగర్ లో కాలభైరవ స్వామిని దర్శించుకున్న ఎంపీ బండి సంజయ్. @ ఇబ్రహీంపట్నం మండలంలో పురుగు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి.

News March 31, 2024

HYDలో KTR పాదయాత్ర

image

HYD అంబర్‌పేట్‌లో మాజీ మంత్రి KTR పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నేత, సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. KTR వెంట ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్ ఉన్నారు. BRS పార్టీ తెలంగాణ ప్రజలదని, దానిని గెలిపించి పార్లమెంట్‌లో తెలంగాణ గొంతుక వినిపించేలా చేయాలని పిలుపునిచ్చారు.