Telangana

News March 31, 2024

 మణుగూరు: ఇంటి దూలం కూలి బాలుడు మృతి

image

మణుగూరు మండలంలోని ఖమ్మంతోగూ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బండ్ల చంద్రయ్య, లక్ష్మీకాంత దంపతుల బాలుడు ప్రమాదవశాత్తు ఇంటి దూలం కూలి గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News March 31, 2024

MDK: BRS, కాంగ్రెస్‌ని నమ్మకండి: రఘునందన్‌రావు

image

BRS, కాంగ్రెస్‌ని ప్రజలు నమ్మొద్దని, వాటికి ఓటేసి మోసపోవద్దని BJP మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. BRS, కాంగ్రెస్ పార్టీలు ఒకటే అని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని తెలిపారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

News March 31, 2024

మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు

image

మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ తోపాటు ఆయన అనుచరులపై భద్రాచల పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శనివారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన సీతారాం నాయక్ నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలోని గర్భగుడిలో ఫోటోలు దిగారు. అప్పటితో ఆగకుండా సోషల్ మీడియాలో గర్భగుడి ఫొటోలతో ప్రచురించటం పట్ల భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు.

News March 31, 2024

వనపర్తి: కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు

image

శనివారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన 8మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని 50వేల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

News March 31, 2024

MBNR: చెల్లుబాటు ఓట్లను బట్టి గెలుపు నిర్దారణ: జిల్లా కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో ముందుగా ప్రాదాన్యత ఓట్లను లెక్కించాక వాటిలో చెల్లుబాటు అయ్యే ఓట్లను బట్టి అభ్యర్థుల గెలుపు నిర్దారణ ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ రవినాయక్ ప్రకటించారు. ఆదివారం కలెక్టరేట్‌లో చేపట్టిన శిక్షణ నందు సిబ్బందికి వివరించారు. గెలుపు నిర్దారణ ప్రకటించాక కౌంటింగ్‌లో అభ్యర్థులకు కోటా వచ్చే వరకు కౌంటింగ్‌ను చివరి వరకు చేపట్టి గెలుపును ప్రకటిస్తామన్నారు.

News March 31, 2024

BREAKING: HYD: ఫ్రెండ్‌ ఛాతిలో కత్తితో పొడిచారు..!

image

HYD అత్తాపూర్‌లో స్నేహితుల మధ్య వివాదం చెలరేగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సయ్యద్ ముస్తఫా అలీ అనే యువకుడిపై అతడి ఫ్రెండ్స్ అమాన్, అఫాన్ కలిసి దాడి చేశారు. బీర్ బాటిల్‌తో తల పగలగొట్టి, అంతటితో ఆగకుండా కత్తితో ఛాతిలో పొడిచి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 31, 2024

BREAKING: HYD: ఫ్రెండ్‌ ఛాతిలో కత్తితో పొడిచారు..!

image

HYD అత్తాపూర్‌లో స్నేహితుల మధ్య వివాదం చెలరేగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సయ్యద్ ముస్తఫా అలీ అనే యువకుడిపై అతడి ఫ్రెండ్స్ అమాన్, అఫాన్ కలిసి దాడి చేశారు. బీర్ బాటిల్‌తో తల పగలగొట్టి, అంతటితో ఆగకుండా కత్తితో ఛాతిలో పొడిచి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 31, 2024

MDK: ‘ఒక్క అవకాశం ఇవ్వండి.. ప్లీజ్’

image

ప్రజలు దయచేసి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, సేవ చేస్తానని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామారెడ్డి అన్నారు. ఈరోజు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్‌గా సేవ చేసి, మంచి పేరు తెచ్చుకున్నానని, ప్రజా సేవలో ఒక అవకాశం కల్పించాలని కోరారు. 11 ఏళ్లు మెదక్ జిల్లా గడ్డ మీదనే పనిచేశానని, ఇది తన అదృష్టమన్నారు. ఉమ్మడి జిల్లా పీడీగా, జాయింట్ కలెక్టర్‌గా పనిచేశానని తెలిపారు.

News March 31, 2024

బెల్లంపల్లి: 14 మంది విద్యార్థులకు ప్రీమియర్ COEలో సీట్లు

image

బెల్లంపల్లి COE విద్యార్థులు 14 మంది ప్రతిష్ఠాత్మకమైన COEలో సీట్లు సాధించినట్లు ప్రిన్సిపల్ సైదులు తెలిపారు. ప్రీమియర్(స్టేట్) COEలైన గౌలిదొడ్డి, చిలుకూరు, షేక్‌పేట్, అల్గనూర్, ఇబ్రహీం పట్నం COEల్లో 14మంది విద్యార్థులు సీట్లు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో మిగిలిన COEల్లో మరిన్ని సీట్లు సాధిస్తామన్నారు.

News March 31, 2024

HYD: భారీగా నగదు కట్టలు పట్టివేత

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా హైదరాబాద్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.25,66,380 నగదు, రూ.56,39,223 విలువ గల ఇతర వస్తువులను వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు పట్టుకుని సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. ఫ్లయింగ్, ఎస్ఎస్‌టీ బృందాలతో పాటు పోలీస్ శాఖ ముమ్మర తనిఖీలతో పెద్ద మొత్తంలో నగదు, ఇతర వస్తువులు పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.