Telangana

News March 31, 2024

‘ఏడాదిలోపు నిజాం ఫ్యాక్టరీని తెరిపించనున్న ప్రభుత్వం’

image

ఏడాది లోపు బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ (NSF) ని ప్రభుత్వం తెరిపించబోతుందని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ఎన్నో ఖాయిలా ఫ్యాక్టరీలు తెరిపించారని ప్రగల్బాలు పలుకుతున్న అర్వింద్ NSFను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.

News March 31, 2024

ASF: భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య

image

భార్య కాపురానికి రావడం లేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వాంకిడి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలం సోనాపూర్ గ్రామానికి చెందిన రాము(25) కు సోనాపూర్ గ్రామానికి చెందిన రాంబాయితో వివాహం జరిగింది. రాము మద్యానికి బానిస కావడంతో భార్య ఇటీవల పుట్టింటికి వెళ్ళింది. దీంతో మద్యానికి బానిసైన రాము ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News March 31, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలివే..

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేటి ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా ధరూర్ లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూలు జిల్లా ఐనోల్లో 42.7, వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 42.2, NGKL జిల్లా కిష్టంపల్లిలో 41.8, MBNR జిల్లా సల్కర్పేటలో 41.7, నారాయణపేట జిల్లా మరికల్లో 40.1, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 31, 2024

వనపర్తి: మూడో అంతస్తు నుంచి పడి వాచ్‌మెన్‌ మృతి

image

నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్తు నుంచి పడి వాచ్‌మెన్‌ మృతి చెందాడు. అల్వాల్‌ పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్‌పేటకు చెందిన జి.కోటయ్య(55) నాలుగు నెలల క్రితం HYDకి వలస వచ్చారు. ఓల్డ్‌ అల్వాల్‌ పరిధి సూర్య నగర్‌‌లోని శ్రీబాలాజీ ఎన్‌క్లేవ్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. మూడో అంతస్తులో నిర్మించిన గోడలకు నీరు చల్లుతుండగా కాలు జారి రెండో అంతస్తులో పడి మృతి చెందాడు.

News March 31, 2024

చర్లపల్లికి రవాణా సదుపాయాలు ఎలా?

image

చర్లపల్లిలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా రూ.430 కోట్లు వెచ్చించి రైల్వే టర్మినల్ నిర్మిస్తోంది. చర్లపల్లికి మెట్రో లేకపోవడం, రోడ్లు సైతం సరిగా లేకపోవడం, రాత్రి వేళల్లో చర్లపల్లికి రవాణా సదుపాయం లేకపోవడంతో అటువైపు చూసే వారి సంఖ్య తగ్గొచ్చని ప్రజలు చెబుతున్నారు. టర్మినల్ ఏర్పాటుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

News March 31, 2024

చర్లపల్లికి రవాణా సదుపాయాలు ఎలా?

image

చర్లపల్లిలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా రూ.430 కోట్లు వెచ్చించి రైల్వే టర్మినల్ నిర్మిస్తోంది. చర్లపల్లికి మెట్రో లేకపోవడం, రోడ్లు సైతం సరిగా లేకపోవడం, రాత్రి వేళల్లో చర్లపల్లికి రవాణా సదుపాయం లేకపోవడంతో అటువైపు చూసే వారి సంఖ్య తగ్గొచ్చని ప్రజలు చెబుతున్నారు. టర్మినల్ ఏర్పాటుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

News March 31, 2024

రేపటి నుంచి వరి ధాన్యం కొనుగోలు.. కీలక ఆదేశాలు జారీ !

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు కీలక ఆదేశాలు జారీ చేశారు.
↪కేంద్రాల వద్ద టెంట్, తాగునీరు ఏర్పాటు చేయాలి
↪టార్పాలిన్లు,ఎలక్ట్రానిక్ కాంటా, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడి క్లీనర్లు అందుబాటులో ఉండాలి
↪ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఏపీఎంలు చర్యలు తీసుకోవాలి
↪ఎన్నికల కోడ్.. ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవాలు చేయరాదు.

News March 31, 2024

MBNR: బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం..!

image

మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో దాగి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ రెడ్డి ఈ ఎన్నికలో హోరాహోరీగా తలపడ్డారు. ప్రశాంతంగా ఎన్నికలు ముగియగా.. విజయంపై ఇరు పార్టీల నాయకులు ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 2న వెలువడే ఫలితాల కోసం నాయకులు ఎదురుచూస్తున్నారు.

News March 31, 2024

భద్రాచలం ఆలయంలో మూలవిరాట్ చిత్రాలు వైరల్

image

భద్రాచలం రాములవారి దేవస్థానంలో ఫొటోలపై నిషేధం ఉండగా భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఓ వ్యక్తి ఫొటోలు తీసి వైరల్ చేయడంపై కేసు నమోదైంది. రాములవారిని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాంనాయక్ కార్యకర్తలతో కలిసి దర్శించుకున్నారు. ఓ వ్యక్తి తన ఫోన్లో ఫొటోలు తీశారు. అనంతరం వీటిని షేర్ చేశారు. రామాలయం వాట్సప్ గ్రూప్‌తో పాటు పలు గ్రూపుల్లో అవి షేర్ అయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

News March 31, 2024

NZB: ఎన్నికల కోడ్.. నగదు పట్టివేత

image

నిజామాబాద్ నగరంలో ఒకటో టౌన్ పోలీసులు రూ.4.8 లక్షల నగదును పట్టుకున్నారు. శనివారం వీక్లీ మార్కెట్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. శివప్రసాద్ అనే ఫైనాన్స్ వ్యాపారి ఎలాంటి పత్రాలూ లేకుండా రూ.4.8 లక్షల నగదును తరలిస్తుండగా సీజ్ చేసినట్లు వన్‌టౌన్ SHO విజయబాబు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బును తరలించేవారు నగదుకు సంబంధించిన పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలన్నారు.