India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అత్తగారింట్లో వేధింపులు భరించలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. అమీన్పూర్ సీఐ నాగరాజు తెలిపిన వివరాలు.. జంగంపేటకు చెందిన నసీమాబేగం(29)కు అమీన్పూర్ వాసి పాషాతో 2017లో వివాహమైంది. ఇటీవల అత్తారింటిలో మానసికంగా వేధింపులు ఎక్కువయ్యాయి. పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయినా ఫలితం లేకపోవడంతో నసీమా శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. తల్లి కరీంబి ఫిర్యాదుతో ఆరుగురిపై కేసునమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
హనుమకొండలోని రెడ్డి కుంట చెరువులో పింగిలి ఇంజినీరింగ్ విద్యార్థి నాగరాజు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో మునిగి చనిపోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని నాగరాజు డెడ్ బాడీని వెతికి తీశామని అగ్నిమాపక ఫైర్ ఆఫీసర్ తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం మృతదేహాన్ని పోలీసు వారికి అప్పగించామన్నారు.
మూడు నెలల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని గత ప్రభుత్వం ఎప్పుడైనా ఇచ్చిందా అని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. కేటీఆర్ అధికారం కోల్పోయిన బాధతో ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. కరువు యాత్రల పేరుతో కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు.
ఉట్నూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. అక్క పెళ్లి రోజే తమ్ముడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం లక్షటిపేటకి చెందిన అర్కవినోద్(25) ఉట్నూర్‌లో డిగ్రీ చదువుతున్నాడు. శుక్రవారం అక్క అర్క అనసూయ పెళ్లికి కుటుంబ సభ్యులు, బంధువులు అంతా నార్నూర్ వెళ్లారు. వినోద్ ఇంటి వద్దే ఉండి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడూ ఒంటరితనంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు.
ఓ రైస్ మిల్లులో చోరీకి వచ్చిన వ్యక్తిని స్థానికులు చితక బాధడంతో మృతి చెందిన ఘటన నిజామాబాద్‌లోని పాల్దా గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామ పరిధిలోని మూసివేతకు గురైన శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్‌లో ఓ తండాకు చెందిన 8 మంది చోరీకి యత్నించారు. గ్రామస్థులు ప్రతిఘటించడంతో ఏడుగురు పారిపోగా.. బానోతు సునీల్ వారికి దొరికాడు. దీంతో వారు అతడిని తీవ్రంగా కొట్టడంతో సునీల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఉండవల్లి: ఓటీపీ చెప్పడంతో బ్యాంకు ఖాతాలో నగదు పోయిన ఘటనపై ఉండవల్లి PSలో శనివారం కేసు నమోదైంది. SI శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు రమాదేవి ఆన్లైన్‌లో వాచ్ బుక్ చేసింది. వెంటనే వద్దనుకుని రద్దు చేసేందుకు వివరాల కోసం వెతికింది. ఆర్డర్ రద్దు చేయాలంటే ఫోన్‌కి వచ్చిన ఓటీపీ చెప్పాలని కోరడంతో అలాగే చేసింది. కొద్దిసేపట్లో ఆమె ఖాతాలో రూ.83,286 డ్రా అయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. జిల్లాలో 6 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను తనిఖీ చేస్తున్నామన్నారు. అక్రమంగా నగదు, మద్యాన్ని తీసుకెళ్తున్న వారి నుంచి వాటిని స్వాధీనం చేసుకుంటున్నామని వెల్లడించారు. చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.
ఓ వివాహ విందులో చోటుచేసుకున్న ఘర్షణ కారణంగా బాల్య వివాహ వ్యవహారం శనివారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు ఈనెల 27వ తేదీన యువకుడితో పెళ్లి జరిగింది. శుక్రవారం రిసెప్షన్ జరుగుతుండగా విందుకు హాజరైన ఓ యువకుడు మాంసం వేయలేదని గొడవకు దిగాడు. ఈ గొడవలో పెళ్లి కుమార్తె మైనర్ అని తేలడంతో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఫిర్యాదుతో ఏఎస్సై రెహమాన్ కేసు నమోదు చేశారు.
నిరుద్యోగ, యువతీ యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణలో మూడు నెలల పాటు శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ తెలిపారు. బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్,జర్దోసి, ఎలక్ట్రిషియన్, మొబైల్ సర్వీసింగ్,రిఫ్రిజిరేటర్, ఏసీ మరమ్మతుల్లో శిక్షణకు యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
ఇందుర్తిలో శనివారం 41.7℃ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మికుంట 40.6, గంగాధర 40.5, రేణికుంట 39.7, కొత్తపల్లి 39.7, బూర్గుపల్లి 39.3, కరీంనగర్ 39.2, వెంకేపల్లి 39.2, కొత్తగట్టు 39.1, ఆసిఫ్‌నగర్ 38.9, తనుగుల 38.8, వీణవంక 38.8, మల్యాల 38.6, గుండి 38.6, చిగురుమామిడి 38.5, ఏదులగట్టేపల్లి 38.4, ఆర్నకొండ 38.4, చింతకుంట 37.8, బోర్నపల్లి 37.7, వెదురుగట్టు 37.6, దుర్శేడ్ 37.1, గట్టుదుద్దెనపల్లిలో 37.1℃.
Sorry, no posts matched your criteria.