Telangana

News March 30, 2024

MDK: భార్య మందలింపు.. భర్త సూసైడ్

image

చిలిపిచేడ్ మం. బండపోతుగల్‌లో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన సయ్యద్ ఇస్మాయిల్ మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానేసి ఏదైనా పని చేసుకోవాలని భార్య నదియా బేగం మందలించింది. ఈ మనస్థాపంతో‌ ఇస్మాయిల్ ఈ నెల 29న పురుగుల మందు తాగాడు. తీవ్ర అస్వస్థకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 30, 2024

బీర్కూరులో బైక్ దొంగల అరెస్ట్.. 26 బైకుల స్వాధీనం

image

ఇద్దరు బైక్ దొంగలను పట్టుకున్నట్లు బీర్కూర్ SI రాజశేఖర్ తెలిపారు. మండలంలోని ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా తమను చూసి భయపడి పారిపోతున్న ఇద్దరిని వెంబడించి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారిని బోధన్‌కి చెందిన అబ్దుల్ ఐయాజ్ ఖాన్(36), సమీర్ ఉద్దీన్(18)లుగా గుర్తించారు. అనంతరం విచారణ చేయగా వారు బైక్ దొంగలని తేలింది. దీంతో వారి వద్ద ఉన్న 26 బైక్‌లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

News March 30, 2024

MBNR: ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యేలు

image

మహబూబ్ నగర్ పట్టణంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ పి వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పండ్లు అందించి ఉపవాస దీక్షను విరమించారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.

News March 30, 2024

కామారెడ్డి: ఏప్రిల్ 4న ప్రొఫెసర్ పోస్టులకు ఇంటర్వ్యూలు

image

కామారెడ్డి మెడికల్ కాలేజీలో 4 ప్రొఫెసర్, 13 అసిస్టెంట్ ప్రొఫెసర్, 5 సీనియర్ రెసిడెంట్ హానర్ ఓరియన్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు ఏప్రిల్ 4న ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.

News March 30, 2024

ADB: శిక్షణ కానిస్టేబుళ్లకు పోలీసు విధులపై అవగాహన

image

ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన 257 మంది కానిస్టేబుళ్లు బేసిక్ ట్రైనింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా వన్ టౌన్, టూ టౌన్, మావల, ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లలో వారికి పోలీసుల విధివిధానాలపై శనివారం అవగాహన కల్పించారు. దీని కోసం 257 మంది శిక్షణ కానిస్టేబుళ్లలను ఆయా పోలీస్ స్టేషన్‌లకు కేటాయించారు.

News March 30, 2024

HYD: విద్యుత్ వినియోగం‌లో రికార్డ్ బ్రేక్..!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో రోజు రోజుకి విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఈ నెల 28న ఏకంగా 79.48 మిలియన్ యూనిట్ల కరెంట్‌ను వినియోగించినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా మే నెలలో ఈ స్థాయిలో ఉంటుందని, ఈ ఏడాది మార్చిలోనే ‌ఆ పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. గతేడాది అత్యధికంగా మే 19న 79.33 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరిగింది. ఈ ఏడాది మార్చిలోనే‌ ఆ రికార్డు‌ బ్రేక్‌ అవ్వడం గమనార్హం.

News March 30, 2024

HYD: విద్యుత్ వినియోగం‌లో రికార్డ్ బ్రేక్..!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో రోజు రోజుకి విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఈ నెల 28న ఏకంగా 79.48 మిలియన్ యూనిట్ల కరెంట్‌ను వినియోగించినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా మే నెలలో ఈ స్థాయిలో ఉంటుందని, ఈ ఏడాది మార్చిలోనే ‌ఆ పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. గతేడాది అత్యధికంగా మే 19న 79.33 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరిగింది. ఈ ఏడాది మార్చిలోనే‌ ఆ రికార్డు‌ బ్రేక్‌ అవ్వడం గమనార్హం.

News March 30, 2024

పాలమూరు గడ్డ పై బిజెపి జెండా ఎగరవేద్దాం: డీకే అరుణ

image

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు గడ్డపై BJP జెండా ఎగరవేద్దామని మాజీ మంత్రి DK అరుణ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఊట్కూరు మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మోడీని ప్రధానిగా కాకుండా ఆపే శక్తి దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడికి లేదని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిల పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు.

News March 30, 2024

ఎన్నికల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు, పోలింగ్ రోజు అత్యవసర సేవల విధులు నిర్వహించే అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పన పై ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

News March 30, 2024

బంగారం కోసం వివాహిత హత్య: డీసీపీ రవీందర్

image

దుగ్గొండి మండలం మైసంపల్లిలో సుప్రియ హత్య ఘటనలో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నర్సంపేటలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ రవీందర్ వెల్లడించారు. ములుగుకు చెందిన శశికాంత్, అజ్మీర శిరీష సహజీవనం చేస్తున్నారు. వీరి విషయం తెలిసిన మృతురాలు సుప్రియతో శిరీష గొడవ పడింది. ఈనెల 23న సుప్రియను కొట్టి హత్యచేసి బంగారం, వెండిని తీసుకొని పరారయ్యారని తెలిపారు.