Telangana

News September 3, 2024

తెలంగాణ పాఠశాల విద్యపై మంత్రికి రిపోర్టు

image

తెలంగాణలో పాఠశాల విద్యపై తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(TDF) రూపొందించిన రిపోర్టును రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, MP కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, అనిల్ కుమార్ రెడ్డిలకు చైర్మన్ గోనారెడ్డి సమర్పించారు. అలాగే ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం, నర్సిరెడ్డి మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంలకు కూడా రిపోర్టును అందజేశారు.

News September 3, 2024

బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

image

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ ఆలయంలో మంగళవారం భక్తులు పోటెత్తారు. మంగళవారం సందర్భంగా బద్ది పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించేందుకు వేకువ జామున భక్తులు బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

News September 3, 2024

గణేశ్ విగ్రహాలకు అనుమతి తప్పనిసరి: ఎస్పీ

image

జిల్లాలో ప్రతిష్ఠించే గణేశ్ విగ్రహాలకు అనుమతి తీసుకోవాలని, మండపాల నిర్వహకులు https://policeportal.tspolice.gov.in/index.htm పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని SP జానకి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్‌‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవ సమితి నాయకులు, నిర్వహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్ని విగ్రాహాలు ప్రతిస్ఠిస్తారో తెలియజేస్తే అందుకు అనుగునంగా బందోబస్తు నిర్వహిస్తామన్నారు.

News September 3, 2024

HYD: ‘ఆ రెండు శరీరాన్ని నిత్యం ఆరోగ్యంగా ఉంచుతాయి’

image

సంపూర్ణ పోషకాహారం, వ్యాయామం శరీరాన్ని నిత్యం ఆరోగ్యంగా ఉంచుతాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. HYD కోఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన ‘అందరికీ పోషకాహారం’ప్రోగ్రాంలో పాల్గొన్నారు. 5 రోజులపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని సూచించారు.

News September 3, 2024

గచ్చిబౌలి: ప్రజలకు విజ్ఞప్తి.. ఈ రూట్లో వెళ్లండి

image

✓గచ్చిబౌలి జంక్షన్- GPRA క్వార్టర్స్ వద్ద లెఫ్ట్ టర్న్-రైట్ టర్న్ గోపీచంద్ అకాడమీ-లెఫ్ట్ టర్న్ ఇన్ఫోసిస్ విప్రో జంక్షన్-రైట్ టర్న్ గోపనపల్లి- HC యూనివర్సిటీ బ్యాక్ సైడ్ నుంచి లింగంపల్లి
✓లింగంపల్లి నుంచి HCU డిపో వద్ద లెఫ్ట్ టర్న్-మజీద్ బండ-బొటానికల్ గార్డెన్-రైట్ టర్న్ గచ్చిబౌలి
✓సెప్టెంబర్ 3,6,9న సా.4 నుంచి రా.9 వరకు ఈ రూట్లలో వెళ్లాలని పోలీసులు సూచించారు.

News September 3, 2024

HYD: హోటళ్లలో మహిళా భద్రతపై DGP సూచనలు

image

HYD నగరంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ DGP షికా గోయల్ హోటల్ అగ్రిగెటర్ల మీటింగ్లో ఈ సూచనలు చేశారు.
✓రెంటుకు ఇచ్చేటప్పుడు సరైన భద్రత చర్యలు పాటించాలి
✓ఐడి వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాలి
✓హోటళ్లలో CCTV బ్యాకప్ ఉండాలి ఎమర్జెన్సీ పోలీస్ కాంటాక్ట్ నెంబర్ అందించాలి ✓హోటళ్లలో మహిళా భద్రతపై కఠినంగా వ్యవహరించాలి.

News September 3, 2024

చేతబడి నెపంతో వ్యక్తిపై దాడి.. మృతి

image

మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో దారుణం జరిగింది. గొల్లగూడెం గ్రామాలో చేతబడి నెపంతో రాములు అనే వ్యక్తిపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడిలో రాములుకు తీవ్రగాయాలై మృతి చెందాడు. ఈ దాడిలో మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా, వారిని జోగిపేట ఆస్పత్రికి తరలించారు. ఈఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

News September 3, 2024

HYD: GHMC పరిధిలో నిత్యావసరాల పంపిణీ: సీఎం

image

జీహెచ్ఎంసీ పరిధిలో వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో సమీక్షించారు. ‘హైదరాబాద్‌లో ఎక్కడా చిన్న ఆవాంఛనీయ ఘటన జరగడానికి వీల్లేదు. విద్యుత్, ట్రాఫిక్, తాగునీరు, పారిశుద్ధ్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలి. కూలీలు పనులు దొరక్క ఇంటి దగ్గరే ఉండిపోతారు. వారిని గుర్తించి బియ్యం, పప్పులు, నిత్యావసర సరకులు పంపిణీ చేయాలి’ అని సీఎం ఆదేశించారు.

News September 3, 2024

HYD: హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనం.. విచారణ వాయిదా

image

HYD హుస్సేన్ సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జన వ్యవహారంపై ఏటా చివరి క్షణంలో కోర్టును ఆశ్రయిస్తే ఎలా అంటూ పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. వినాయక చవితికి ముందు పిటిషన్లు వేసి కోర్టుపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం సరికాదంది. ఇప్పటికే ఇందులో ఉత్తర్వులు ఉన్నాయని, వాటిని పరిశీలిస్తామని పేర్కొంటూ విచారణను ఈనెల9వ తేదీకి వాయిదా వేసింది. కాగా హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనంపై ఏటా చర్చ జరుగుతోంది.

News September 3, 2024

HYD: హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనం.. విచారణ వాయిదా

image

HYD హుస్సేన్ సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జన వ్యవహారంపై ఏటా చివరి క్షణంలో కోర్టును ఆశ్రయిస్తే ఎలా అంటూ పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. వినాయక చవితికి ముందు పిటిషన్లు వేసి కోర్టుపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం సరికాదంది. ఇప్పటికే ఇందులో ఉత్తర్వులు ఉన్నాయని, వాటిని పరిశీలిస్తామని పేర్కొంటూ విచారణను ఈనెల9వ తేదీకి వాయిదా వేసింది. కాగా హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనంపై ఏటా చర్చ జరుగుతోంది.