India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన జన్నారంలో చోటుచేసుకుంది. మండలంలోని డీర్ పార్క్ వద్ద ప్రధాన రహదారిపై లక్షెట్టిపేట వైపు వెళ్తున్న బొలేరో.. జన్నారం వైపు వస్తున్న బైక్‌ను ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో మందపల్లి గ్రామానికి చెందిన దేవి సుదర్శన్ (45) రక్షిత్ (22) అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ మాజీ ఛైర్మన్ గంగుమళ్ల ఎలక్షన్ రెడ్డి ఏప్రిల్ 5న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం ఇరువురు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మరికొంత మంది BRS నేతలు, అనుచరులతో కలిసి 5న గాంధీభవన్‌లో హస్తం కండువా కప్పుకోనున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ సీఎం రేవంత్ రెడ్డిని శుక్రవారం రాత్రి కలిశారు. ఆయన మొన్నటి వరకు బీజేపీలో కొనసాగి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో నాగర్ కర్నూల్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని సీఎం సూచించారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెం చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న వరంగల్‌కు చెందిన మహేష్ వద్ద రూ.1,20,700/-, జార్పుల అమృ వద్ద రూ.2,75,000/-, దండేపల్లికి చెందిన వెంకటేష్ వద్ద రూ.2,97500/- నగదును స్వాధీనం చేసుకొని SSTటీం ఇన్‌ఛార్జ్‌కి అప్పగించినట్లు ఎస్సై వివరించారు.
బీఆర్ఎస్ నేతలపై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. హైదరబాద్‌లోని ఈసీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రఘునందన్ రావు పై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. పరుష పదజాలంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలిపారు. కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి ఉన్నారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకి పక్షుల రాక మొదలైంది. ప్రతి ఏడాది వేసవిలో విదేశాల నుంచి అరుదైన పక్షులు నీటి కోసం బ్యాక్ వాటర్ ప్రాంతానికి వస్తుంటాయి. దాదాపు మూడు నెలల పాటు అవి ఇక్కడ ఉంటాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తుంటారు. ముఖ్యంగా ఛాయ చిత్రకారులు వాటిని కెమెరాల్లో బంధించేందుకు ఆసక్తి చూపుతారు.
ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును బీఆర్‌ఎస్ అన్ని పార్టీలకంటే ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. నామా పేరును ఖరారు చేసి నెలవుతున్నా ఆయన క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టలేదట. కడియం కావ్య ఎఫెక్ట్‌తో కొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీనుంచి తప్పుకోబోతున్నారనే ప్రచారంతో నామా పేరు తెరపైకి వస్తోంది. ఆయన పోటీలోనే ఉంటారా? లేక పోటీ నుంచి డ్రాప్ అవుతారా అనేది ఖమ్మం బీఆర్ఎస్‌లో చర్చనీయాంశమైనట్లు సమాచారం.
కడియం శ్రీహరి ఒక అవకాశవాదని, ఆనాడు ఎన్టీఆర్‌కు.. ఈనాడు కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కడియం ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో లేడని, కేసీఆర్‌ను నమ్మి ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పార్టీకి నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి 200 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థికి 200 ఓట్ల మెజార్టీ సాధ్యమేనా అనే చర్చ సాగుతుంది. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి దాదాపు 800కు పైగా ఓట్లు ఉంటే కాంగ్రెస్‌కు 400 పైచిలుకు ఓట్లు ఉన్నాయి.
మెదక్ పార్లమెంట్ బరిలో BRS తరఫున వెంకట్రామిరెడ్డి, BJP నుంచి రఘునందన్రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు తలపడనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా కావడంతో గులాబీ శ్రేణులు, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో హస్తం నేతలు, ఈసారైనా దక్కించుకోవాలని బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు. కామెంట్ చేయండి
Sorry, no posts matched your criteria.