Telangana

News March 30, 2024

HYD: సీఎంని కలిసిన నందమూరి సుహాసిని

image

HYD నగరంలో తెలంగాణ టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిశారు. సుహాసినిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా సమాచారం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,  మంత్రి సురేఖ, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News March 30, 2024

పటాన్ చెరు: తల్లికి మాత్రలు తెచ్చేందుకు వెళ్లి విద్యార్థి మృతి

image

తల్లికి మాత్రలు తెచ్చేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన పటాన్ చెరులో జరిగింది. సీతారామపురం కాలనీలో ఉంటున్న సుదీప్ పట్నాయక్(15) పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి బాలుడి తల్లికి మాత్రలు తెచ్చేందుకు బైక్‌పై వెళ్లాడు. పెట్రోల్ బంకు వెళ్లి పెట్రోల్ పోయించుకుని తిరిగి వస్తుండగా ముందు వెళ్తున్న వాహనాన్ని బైక్ ఢీకొన్నాడు దీంతో బాలుడు మృతి చెందాడు.

News March 30, 2024

ఉద్యాన నర్సరీలోని పండ్ల తోటల వేలం: పీవో

image

ఉట్నూర్ ఉద్యాన నర్సరీ లోని పండ్ల తోటల ఫల సాయాన్ని వేలం వేయనున్నట్లు పీవో ఖుష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. మామిడి మరియు జామ తోటల ఫల సాయాన్ని వేలం పాట ఉంటుందని తెలిపారు ఆసక్తి గల వ్యాపారస్తులు, సంస్థలు ఏప్రిల్ 6న మధ్యాహ్నం 3 గంటలకు ఉట్నూర్ ఐటీడీఏ నర్సరీలో జరిగే వేలంపాటలో పాల్గొనాలని కోరారు. ఇతర వివరాల కొరకు ఐటీడీఏ ఉద్యాన అధికారి శ్రీ సుధీర్ కుమార్ (9032313933) లను సంప్రదించాలని సూచించారు.

News March 30, 2024

WOW.. వెయ్యి గంటల్లో రామప్ప ఆలయాన్ని నిర్మించారు

image

WGL కిట్స్ కళాశాలలోని ఇంజినీరింగ్ విద్యార్థులు ఓ అద్భుతం సృష్టించారు. వెయ్యి గంటల్లో సరికొత్త 3డీ సాంకేతికతతో ఆలయాన్ని అచ్చు గుద్దినట్లు నిర్మించారు. మెకానికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న రూపేశ్‌కుమార్, అభినయ్, గౌస్‌లు ఈ దీన్ని తయారు చేయగా.. రాజనరేందర్‌రెడ్డి, శ్రీకాంత్, సమీర్‌లు మెంటార్లుగా వ్యవహరించారు. ఐఐటీ HYD వారు నిర్వహించిన ఓ పోటీలో పాల్గొనేందుకు దీన్ని యంత్రంతో ముద్రించారు.

News March 30, 2024

దౌల్తాబాద్: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం దౌల్తాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన యాదగిరి(28) ఈరోజు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీశైలం యాదవ్ ఘటనా స్థలానికి చేరుకొని పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 30, 2024

ఖమ్మం-బెంగళూరుకు లహరి ఏసీ బస్సులు

image

ఖమ్మం నుంచి బెంగళూరుకి లహరి ఏసి స్లీపర్ కమ్ సీటర్ బస్సులను నడుపుతున్నట్లు DM శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మం నుంచి సాయంత్రం 3 గంటలకు, 4.30 గంటలకు లహరీ బస్సు బయలుదేరుతుందన్నారు. బెంగళూరు నుంచి రాత్రి 6.30 గంటలకు, 7:45 గంటలకు బయలుదేరుతుందన్నారు. చార్జీల వివరాలు సీటుకు రూ. 1580, బెర్త్ కు రూ .2010 ఉందని తెలిపారు

News March 30, 2024

హైదరాబాద్: నేడు, రేపు LIC ఆఫీసులు పని చేస్తాయి

image

2023-24 ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం శని, ఆదివారాలు (ఈనెల 30, 31 తేదీల్లో) తమ కార్యాలయాలు పని చేస్తాయని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వెల్లడించింది. ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా సంబంధిత బ్యాంకు శాఖలు పనిచేసేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే బ్యాంకులకు సూచించింది.

News March 30, 2024

NSPT బస్టాండ్‌లోనే కన్నుమూసిన క్యాన్సర్ బాధితుడు

image

నర్సంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లోనే ఒకరు మృతి చెందారు. వరంగల్‌కు చెందిన మహ్మద్ అప్జల్(35) నర్సంపేటలో ఓ పండ్ల వ్యాపారి వద్ద కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న అప్జల్ వరంగల్‌కు వెళ్లి వస్తూ నర్సంపేటలో బస్సు దిగాడు. స్పృహ తప్పి బస్టాండులోనే నిద్రపోయాడు. ఆర్టీసి సిబ్బంది వచ్చి అతనిని నిద్రలేపడానికి ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు.

News March 30, 2024

ఐలాండ్‌ను తలపించే వైజాగ్ కాలనీ

image

నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణపట్టి తీరాన్ని ఆవరించి ఉన్న వైజాగ్‌కాలనీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్‌కాలనీ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. సాయంత్రం వేళ.. ఆకర్షణీయంగా ద్వీపకల్పంలా కనువిందు చేస్తున్నాయి. మూడు దిక్కుల నీరుండి మధ్యలో వైజాగ్‌కాలనీ గ్రామం ఉండడంతో ద్వీపకల్పాన్ని తలపిస్తుంది.

News March 30, 2024

సుల్తానాబాద్: ఆర్థిక ఇబ్బందులతో యువకుడి సూసైడ్

image

పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసకున్నాడు. వివరాళ్లోకి వెళ్తే.. సుల్తానాబాద్ శాస్త్రీనగర్‌కు చెందిన పల్స శివసాయి(22) కారు నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు. కారు నిర్వహణ కోసం 3 నెలల క్రితం ఓ వ్యక్తి వద్ద రూ.70వేలు అప్పు చేశాడు. ఈనెల 27న అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చి అప్పు తీర్చాలంటూ కారు తీసుకెళ్లాడు. మనస్తాపం చెందిన తను పురుగు మందు తాగాడు. MGMకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు.