India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ సీఎం కేసీఆర్ రేపు తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ఎద్దడి కారణంగా ఎండిపోయిన పంటలను పరశీలించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని తుంగతుర్తి , హాలియా ప్రాంతాల్లో పర్యటిస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.
తండ్రినే స్ఫూర్తిగా తీసుకొని ఓ కూతురు బాక్సింగ్‌లో రాణిస్తోంది. హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన తనుశ్రీ 8వ తరగతి చదువుతోంది. ఓ పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్న తండ్రి శ్యామ్.. కుమార్తెకు శిక్షణ ఇప్పించి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించారు. అంతేకాదు, ఈనెల నోయిడాలో జరిగిన జాతీయ స్థాయి 3వ సబ్ జూనియర్స్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్యం గెలుచుకుంది. ఈ ఏడాది మేలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొననుంది.
NGKL MP స్థానంపై BRS, కాంగ్రెస్, BJP స్పెషల్ ఫోకస్ పెట్టాయి. BJP సిటింగ్ MP తనయుడు పోతుగంటి భరత్ బరిలోకి దించగా, కాంగ్రెస్ మల్లు రవిను పోటీలో నిలబెట్టింది. BRS వ్యూహాత్మకంగా లోకల్ క్యాండిడేట్ RS ప్రవీణ్ కుమార్‌ను బరిలోకి దింపింది. ఇప్పటికే NGKLలో PM మోదీ ప్రచారం చేయగా, KCR, రేవంత్ రెడ్డి సైతం ప్రచారం చేస్తారని టాక్. 3 పార్టీలు NGKLలో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీనిపై మీ కామెంట్?
ఖమ్మం జిల్లాలో అడ్డూఅదుపు లేకుండా బ్రూణహత్యలు జరుగుతున్నాయని ఇటీవల ఘటనల ద్వారా తెలుస్తోంది. లింగ నిర్ధారణ పరీక్ష చేయించడం, కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు చిదిమేస్తున్నారు . లింగ నిర్ధారణ నేరమైనా ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లకు అదేమీ పట్టడం లేదు. దీంతో క్రమంగా ఆడశిశువుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు గాను 929 అమ్మాయిలే ఉన్నారు.
✏ MBNR&NRPT జిల్లాలలో నేడు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం
✏ GDWL: పలు గ్రామాలలో నేడు కరెంట్ కట్
✏ నవాబుపేట: నేడు టెంకాయల వేలం& నేటి నుంచి బొడ్రాయి ఉత్సవాలు ప్రారంభం
✏ పన్ను వసూలుపై అధికారుల ఫోకస్
✏ పలుచోట్ల ‘ఇఫ్తార్ విందు’.. పాల్గొననున్న నేతలు
✏ పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న MBNR,NGKL ఎంపీ అభ్యర్థులు
✏ నేటి రంజాన్ వేళలు:- ఇఫ్తార్(SAT)-6:37,సహర్(SUN)-4:51
✏ త్రాగునీటి సమస్యలపై అధికారుల నిఘా
ఈ ఏడాది తీవ్ర వర్షాభావంతో జిల్లాలోని జలాశయాలు వట్టిపోయాయి. ప్రధాన రిజర్వాయర్లైన పాలేరు, వైరా, బేతుపల్లి, లంకాసాగర్లో నీరు అడుగంటింది. మిగతా చిన్నాపెద్ద చెరువుల్లో కూడా నీళ్లు అడుగంటడంతో ఎక్కడ చూసినా పొడి వాతావరణం నెలకొంది. బోర్లు, బావుల్లో నీళ్లు లేక సాగు చేసిన పంటలు పలు ప్రాంతాల్లో ఎండిపోయాయి. మరో మూడు, నాలుగు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పెనుబల్లి మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికులు కథనం ప్రకారం.. కుప్పెనకుంట్లకి చెందిన వల్లవరపు రవి(43) భార్య ప్రమాదవశాత్తు విద్యుత్ తీగను తాకడంతో షాక్‌కు గురైంది. రవి ఆమెను కాపాడే క్రమంలో షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. భార్య డాన్స్ చేయెుద్దన్నందుకు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై వివరాల ప్రకారం.. చిన్నఆరెపల్లికి చెందిన చెన్నబోయిన అనిల్ బంధువుల పెళ్లికి హాజరయ్యాడు. పెళ్లి అనంతరం బారాత్ కార్యక్రమం ఉండగా డాన్స్ చేయెుద్దని భార్య..భర్త అనిల్‌కు చెప్పింది. దీంతో క్షణికావేశంలో ఇంట్లో నుంచి వెళ్లిన అనిల్ చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
వరకట్న వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారంలో జరిగింది. ఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అయోధ్య కుమార్తె చందన(23)కు మిర్యాలగూడకు చెందిన ఆనందం వేణుతో 2021లో వివాహం జరిగింది. భర్త, అత్తమామలు అదనపు కట్నం తేవాలని వేధిస్తుండడంతో చందన సూసైడ్ చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పెళ్లి వేడుకలో డీజే బాక్సులు మీద పడి బాలుడు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే.. బానోత్ మనోజ్ (14) అనే బాలుడు బూర్గుచెట్టు తండా గ్రామపంచాయితీ పరిధిలోని పీక్లా తండాలో ఓ వివాహానికి హాజరయ్యాడు. కాగా ప్రమాదవశాత్తు మనోజ్‌పై డీజే బాక్సులు పడటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో పెళ్లి ఇంట్లో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Sorry, no posts matched your criteria.