Telangana

News March 30, 2024

HYD: నకిలీ ఆర్ఎంపీ వైద్యుడి అరెస్ట్

image

తాండూరులో నకిలీ RMP డాక్టర్‌గా చెలామణి అవుతూ, ఓ మహిళను నగ్నంగా వీడియోలు తీసిన కేసులో నిందితుడు అహ్మద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. అహ్మద్‌ను తన క్లినిక్‌కు వచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఈ క్రమంలో ఓ మహిళతోనూ అసభ్యంగా వ్యవహరించి వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశాడన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అహ్మద్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

News March 30, 2024

HYD: నకిలీ ఆర్ఎంపీ వైద్యుడి అరెస్ట్

image

తాండూరులో నకిలీ RMP డాక్టర్‌గా చెలామణి అవుతూ, ఓ మహిళను నగ్నంగా వీడియోలు తీసిన కేసులో నిందితుడు అహ్మద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. అహ్మద్‌ను తన క్లినిక్‌కు వచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఈ క్రమంలో ఓ మహిళతోనూ అసభ్యంగా వ్యవహరించి వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశాడన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అహ్మద్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

News March 30, 2024

KNR: వడదెబ్బతో ఆశా వర్కర్ మృతి

image

వడదెబ్బతో ఓ ఆశా వర్కర్ కరీంగనర్ జిల్లాలో మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామానికి చెందిన రాజేశ్వరి(50) ఆశా కార్యకర్తగా పని చేస్తున్నారు. అయితే ప్రభుత్వం చేపట్టిన సర్వేలో భాగంగా గురువారం ఎండలో ఇంటింటికి తిరుగుతుండగా ఎండకు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ అదేరోజు సాయంత్రం మృతి చెందారు.

News March 30, 2024

NLG: సిబ్బంది నియామకంపై దృష్టి

image

లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు సిబ్బంది నియామకంపై దృష్టి సారించారు. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో సిబ్బంది పాత్రే కీలకం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. వాటికి ఆర్వోలుగా ఆయా జిల్లాల కలెక్టర్లు వ్యవహరించనున్నారు. వారి ఆధ్వర్యంలో సహాయ రిటర్నింగ్ అధికారులు, సెక్టోరియల్ అధికారులు, పోలింగ్ సిబ్బంది ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించనున్నారు.

News March 30, 2024

NLG: వామ్మో సన్న బియ్యం.. కొనలేం తినలేం!

image

ఉమ్మడి జిల్లాలో సన్న బియ్యం ధరలు సామాన్యుడికి దడ పుట్టిస్తున్నాయి. బియ్యం ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నా అధికారులు కట్టడి చేయకపోవడంపై జనం మండిపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం ధర కిలో రూ.70 వరకు విక్రయిస్తున్నారు. క్వింటా ధర రూ .7వేలు పలుకుతుంది. గతంలో దొడ్డు బియ్యం వాడకం ఎక్కువగా ఉండగా.. రాను రాను వినియోగం తగ్గిపోయింది. దీంతో సన్న బియ్యం ధరలు అమాంతం పెరిగాయి.

News March 30, 2024

NLG: రైతులకు రూ.304 కోట్ల నష్టం…!

image

జిల్లాలో రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యాసంగిలో సాగు చేసిన వరిచేలు పొట్ట దశలో ఎండిపోతున్నాయి. యాసంగి సీజన్లో బోరుబావులపై ఆధారపడి జిల్లా వ్యాప్తంగా 4,20,561 ఎకరాల్లో రైతులు వరినాట్లు వేసుకున్నారు. నీటి ఎద్దడి కారణంగా సుమారు 15 శాతం మేర వరిచేలు ( 60 వేల ఎకరాల్లో పొలాలు) ఎండిపోయాయి. దీంతో రైతులకు రూ.304 కోట్ల నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

News March 30, 2024

మెదక్: ‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి ముద్దాయి హరీశ్ రావు’

image

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి ముద్దాయి మాజీ మంత్రి హరీశ్ రావు అని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. శుక్రవారం మెదక్‌లో మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నికల సమయంలో తనతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసి ఇబ్బందుకు గురి చేశారని మండిపడ్డారు. అబద్దాలు ఆడటంలో మామను మించిన వ్యక్తి హరీశ్ రావు అని.. ఆయన నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే సిద్దిపేట ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

News March 30, 2024

బిజినేపల్లి: చిరుతల సంచారం.. జాగ్రత్త

image

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం అటవీ ప్రాంతంలో రెండు నెలలుగా చిరుతల సంచారం అడవికి సమీపంలో ఉన్న గిరిజన తండా వాసులకు అలజడి రేపుతోంది. తాగునీటి కోసం పులులు రాత్రి సమయాల్లో వస్తుంటాయి. కాబట్టి పరిసర ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని FRO తెలిపారు. భీముని తండా సమీపంలో కేఎల్‌ఐ కాలువ వద్ద చిరుత పులి రోడ్డు దాటుకుంటూ వెళ్లిందని చెప్పాడు.

News March 30, 2024

కాకతీయుల కాలం నాటి రాతి కట్టడాలకు సంరక్షణ కరువు

image

ఖిలావరంగల్‌లో కాకతీయుల కాలం నాటి రాతి కట్టడాల సంరక్షణను కేంద్ర పురావస్తు శాఖ అధికారులు గాలి కొదిలేశారని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. పడమరకోట చమన్ కూడలిలోని నివాస గృహాల నడుమ ఉన్న కట్టడంపై ఏపుగా ముళ్ల పొదలు పెరిగాయి. ఫలితంగా రాళ్లు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితిలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చెట్లు తొలగించి పురాతన కట్టడాన్ని భావితరాలు వీక్షించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

News March 30, 2024

HYD నగరంలో హీటెక్కిస్తున్న సూరీడు!

image

గ్రేటర్ HYD, ఉమ్మడి RR జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం మూసాపేటలో గరిష్ఠంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్‌లో 42 డిగ్రీలు, ఖైరతాబాద్ 41.5, హయత్ నగర్ 41.7, చందానగర్ 41.5, శేరిలింగంపల్లి 41.2, యూసుఫ్ గూడలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.