India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ రాజకీయాల్లో నల్లగొండ పార్లమెంటుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
కామారెడ్డి జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. శుక్రవారం జిల్లాలోని బిచ్కుందలో అత్యధికంగా 41.9 ఉష్ణోగ్రత నమోదు కాగా, దోమకొండలో 40.5, రామారెడ్డి, గాంధారిలో 40.4, నస్రుల్లాబాద్‌లో 40.2, పాల్వంచలో 40.1 ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అత్యల్పంగా బీర్కూర్ మండలంలో 36.4 ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి నేడు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. బంజారాహిల్స్‌లోని మేయర్ క్యాంప్ ఆఫీస్‌లో సాయంత్రం 6 గంటలకు CM రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం కండువా కప్పుకోనున్నారు. ఇదిలా ఉంటే ఆమెతోపాటు మరికొందరు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు సైతం పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ పార్టీ మారే నేతలు ఎవరనేది గ్రేటర్ రాజకీయల్లో సర్వత్రా ఉత్కంఠగా మారింది.

తెలంగాణలో 2023-24 యాసంగికి సంబంధించి ఈరోజు వరకు 64,75,819 మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటికే 92.68 శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ అయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క ఏడాది రైతుబంధు నిధులు 3 నెలల కంటే తక్కువ రోజులలోనే జమ చేయడం జరగలేదన్నారు. వ్యవసాయ పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
*సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలు చెల్లించాలని సీఎంకు బండి సంజయ్ లేఖ.
*ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ.
*రాయికల్‌లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని యువకుడి ఆత్మహత్య.
*జగిత్యాల ఎమ్మెల్యేకు పితృవియోగం.
*సోషల్ మీడియాపై పోలీస్ నజర్: ఎస్పి అఖిల్ మహాజన్.
*జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం.
*మల్లాపూర్ మండలంలోని చెక్ పోస్ట్ వద్ద గంజాయి పట్టివేత.
ఈనెల 30న నల్గొండ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం విజయవంతం చేయాలని మఠంపల్లి మండల నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మఠంపల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలోని మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో జరుగు నల్గొండ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎయిర్‌గన్ తలకు పెట్టి బెదిరించిన ఇద్దరిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం ACP వెంకటేశ్వరరావు కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 27న మీర్‌చౌక్ PS పరిధి ఎతేబర్ చౌక్‌లోని పెట్రోల్ బంకులో భక్షి అలీ, జాహి అనే ఇద్దరు సిబ్బందితో గొడవపడ్డారు. ఈ క్రమంలోనే తమ వద్ద ఉన్న ఎయిర్‌గన్ తీసి చంపేస్తామని బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు ACP తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక వ్యక్తులు, రౌడీషీటర్లు, ట్రబుల్ మంగ్లర్స్ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు నల్గొండ ఎస్పీ చందన దీప్తి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అటు అక్రమ మద్యం, నగదు సరఫరా కాకుండా పటిష్ఠ నిఘాతో తనిఖీలు నిర్వహించాలని సూచించారు
Sorry, no posts matched your criteria.