India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో శుక్రవారం ఆలయం కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి, స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అనుబంధ ఆలయాలలో పూజలు నిర్వహించారు. భక్తుల గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారు మోగింది.
జనగామ నూతన ఏసీపీగా పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు పార్టీల ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆయనకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. నూతన ఏసీపీ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.
నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ద్వారానే దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని నాగర్ కర్నూల్ ఎంపీ రాములు అన్నారు. కొల్లాపూర్ పట్టణంలో శుక్రవారం జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు. రాబోయే ఎన్నికలలో నాగర్ కర్నూల్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయాలని కోరారు. సమావేశంలో ఎంపీ అభ్యర్థి భరత్ పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలో 38 వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. గడిచిన సంవత్సరం 60 వేల ఎకరాల్లో పంటను సాగు చేయగా.. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా 38 వేల ఎకరాలకే పరిమితమైంది. ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల యవత బెట్టింగులకు అలవాటు పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం IPL సీజన్ కావడంతో కాటారం సహా.. పలు చోట్ల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో భారీగా బెట్టింగ్ పెడుతున్నారు. వచ్చిన లాభాలను సైతం బెట్టింగ్‌కు మళ్లిస్తున్నారు. ఇటీవల కాటారం మండలంలో ఓ వ్యక్తి బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడి రూ.లక్షల్లో నష్టపోయాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. నల్గొండలో బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. బీజేపీ కాంగ్రెస్‌కు ఎప్పుడూ బీ-టీమ్ కాదని స్పష్టం చేశారు. బీజేపీలో అందరినీ కలుపుకొని పోయి పనిచేస్తా తప్పకుండా జిల్లాలో బీజేపీ జెండా ఎగరేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయి. నేడు మరికల్ మండలం లాల్ కోట చౌరస్తాలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదు పట్టుకున్నట్లు సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. దేవరకద్ర మండలం గురకొండకి చెందిన బిరప్ప రూ.8 లక్షల 40 వేలు కారులో తీసుకెళ్తుండగా సీజ్ చేసి ఎలక్షన్ గ్రీవెన్స్ కమిటీకి అప్పగించామన్నారు. రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్తే సంబంధిత పత్రాలు వెంట ఉండాలన్నారు.
నిజామాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్ జరిగింది. యెండల టవర్స్ రోడ్డులో ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. మోపాల్ మండలానికి చెందిన దంపతులు శుక్రవారం ఓ పని నిమిత్తం నిజామాబాద్‌కు వచ్చారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆ మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
మెదక్ ఎంపీ సీటు గెలిచి సోనియా గాంధీకి బహుమతిగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీని నీలం మధు మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిశారు. ఇందిరాగాంధీ లాంటి మహోన్నత నేత ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానాన్ని తనకు కేటాయించడం పట్ల కాంగ్రెస్ అధిష్ఠానానికి రుణపడి ఉంటానని చెప్పారు.
ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నడస్తున్నందుకు చాలా మంది యువత ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారని జిల్లా ఎస్పీ చందనా దీప్తి అన్నారు. అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్ వల్ల ఆర్థికంగా దెబ్బతిని సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. యువత క్రికెట్ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని ఎస్పీ కోరారు.
Sorry, no posts matched your criteria.