Telangana

News September 3, 2024

HYD: GHMC పరిధిలో నిత్యావసరాల పంపిణీ: సీఎం

image

జీహెచ్ఎంసీ పరిధిలో వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో సమీక్షించారు. ‘హైదరాబాద్‌లో ఎక్కడా చిన్న ఆవాంఛనీయ ఘటన జరగడానికి వీల్లేదు. విద్యుత్, ట్రాఫిక్, తాగునీరు, పారిశుద్ధ్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలి. కూలీలు పనులు దొరక్క ఇంటి దగ్గరే ఉండిపోతారు. వారిని గుర్తించి బియ్యం, పప్పులు, నిత్యావసర సరకులు పంపిణీ చేయాలి’ అని సీఎం ఆదేశించారు.

News September 3, 2024

NLG: ఉమ్మడి జిల్లాలో భారీగానే నష్టం

image

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాల కారణంగా భారీగా నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో రోడ్లు దెబ్బతిన్నాయి. 15 చెరువులకు గండ్లు పడ్డాయి. 22,344 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, వరి పొలాల్లో ఇసుక మేటలు వేసినట్లు అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో 7 ఇండ్లు పూర్తిగా.. 44 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు మూడో రోజు నెమ్మదించాయి.

News September 3, 2024

భారీ వర్షాలు.. 10 పూర్తిగా, 524 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 30,950 ఇళ్లు కూలడానికి సిద్ధంగా ఉన్నట్లు గతంలో అధికారులు గుర్తించారు. అందులో 20 వేల ఇళ్లను పాక్షికంగా నేల మట్టం చేశారు. ఇటీవల వర్షాలకు ఉమ్మడి జిల్లాలో 10 ఇళ్లు పూర్తిగా, 524 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరో 11 వేల ఇళ్లకు నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారుల నుంచి మొత్తం 2.14 లక్షల దరఖాస్తులొచ్చాయి.

News September 3, 2024

జూబ్లీహిల్స్: పబ్బుల్లో పట్టుబుడుతోంది డీజేలే!

image

హుషారైన సంగీతంతో ఉర్రూతలూగించే డీజేలతో యువత మత్తు ఊబిలో చిక్కుకుంటున్నారు. పబ్బుల్లో పోలీసులు, ఆబ్కారీ శాఖ అధికారులు ఎప్పుడు డ్రగ్స్ తనిఖీలు చేపట్టినా డీజేలు దొరికిపోతున్నారు. కేవలం వినియోగం మాత్రమే కాదు.. ఏకంగా గోవా, బెంగళూరు, ముంబయి నగరాల్లోని డ్రగ్ డీలర్లతోనూ డీజేలకు లింకులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. కాగా జూన్ మూడో వారం నుంచి డ్రగ్స్ కేసుల్లో ఆరుగురు డీజేలు దొరికిపోయారు.

News September 3, 2024

HYD: కంట్రోల్ రూమ్‌లు 24 గంటలు పనిచేయాలి: CS

image

మంగళవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..’జిల్లాల కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కంట్రోల్ రూమ్‌లు 24 గంటలు పనిచే సేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News September 3, 2024

HYD: స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై పిటిషన్ కొట్టివేత

image

దివ్యాంగులకు రిజర్వేషన్లపై వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌పై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రాథమిక దశలోనే హైకోర్టు కొట్టివేసింది. స్మితా సభర్వాల్ వ్యాఖ్యల వల్ల ఎవరి హక్కులకూ భంగం కలగలేదని, ఎవరూ నష్టపోలేదని, వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేసే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఆమెకు ఉందని వ్యాఖ్యానించింది. దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది.

News September 3, 2024

HYD: స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై పిటిషన్ కొట్టివేత

image

దివ్యాంగులకు రిజర్వేషన్లపై వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌పై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రాథమిక దశలోనే హైకోర్టు కొట్టివేసింది. స్మితా సభర్వాల్ వ్యాఖ్యల వల్ల ఎవరి హక్కులకూ భంగం కలగలేదని, ఎవరూ నష్టపోలేదని, వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేసే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఆమెకు ఉందని వ్యాఖ్యానించింది. దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది.

News September 3, 2024

ప్రతీనెల 10న పాఠశాలలను సందర్శించాలి: కలెక్టర్

image

ప్రత్యేక అధికారులు ప్రతినెలా 10 పాఠశాలలను సందర్శించి రిజిస్టర్లను పరిశీలించాలని HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్లో డీఈవో, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలలను సందర్శించి నివేదికలు సమర్పించడానికి నియమించబడిన ప్రత్యేక అధికారులు వారానికి 2, నెలలో 10 పాఠశాలలను పరిశీలించాలని అన్నారు.

News September 3, 2024

MHBD: CM షెడ్యూల్లో స్వల్ప మార్పులు

image

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తిరుమలాయపాలెం బ్రిడ్జి, కుదురు మండలం రావిరాలలో సీఎం పర్యటించాల్సి ఉండగా.. షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఆయన ఖమ్మం నుంచి నేరుగా సీతారాంనాయక్ తండాకు చేరుకోనున్నారు. గ్రామాన్ని వరద నీరు ముంచెత్తడంతో సుమారు 100 మందిని పోలీసులు కాపాడారు. విషయం తెలుసుకున్న సీఎం ముందుగా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

News September 3, 2024

KNR: భారీ వర్షం.. విద్యుత్‌ శాఖకు రూ.18.63 లక్షల నష్టం

image

కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు విద్యుత్‌ శాఖకు రూ.18.63 లక్షల నష్టం వాటిల్లిందని ఎస్‌ఈ వడ్లకొండ గంగాధర్‌ తెలిపారు. 31 విద్యుత్‌ స్తంభాలు, మూడు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు పడిపోయాయన్నారు. వినియోగదారుల కోసం హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి 9440811444, 1912, 18004250028 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.