Telangana

News March 29, 2024

మార్చిలోనే మండుతున్న ఖమ్మం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం మధిర, బోనకల్, ఎర్రుపాలెం, సత్తుపల్లిలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఖమ్మం, కొణిజర్ల, భద్రాచలం, చర్ల, బూర్గంపాడులో 39, పెనుబల్లిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భానుడి ప్రతాపానికి మధ్యాహ్నం రోడ్లని నిర్మానుష్యంగా మారాయి. రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

News March 29, 2024

రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి

image

మెదక్ జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. కేసీఆర్ అత్యంత సన్నిహితుడు, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనతోపాటు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ఫుడ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఎలక్షన్ రెడ్డి ఉన్నారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాజిరెడ్డి, తదితరులు ఉన్నారు.

News March 29, 2024

ఎంపీగా గెలిస్తే మహబూబ్‌నగర్ రూపురేఖలు మారుస్తా: వంశీచంద్ రెడ్డి

image

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే మహబూబ్‌నగర్ లోక్‌సభ రూపురేఖలు మారుస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. నేడు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితం మొత్తం ప్రజలతో ముడిపడి ఉంటుందని, సీఎం రేవంత్ రెడ్డి అండతో మహహబూబ్‌నగర్ అభివృద్ధి చేసి చూపిస్తామని, ఆరు గ్యారంటీలను నూటికి నూరు శాతం అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు.

News March 29, 2024

ఖమ్మం: ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

image

ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌తో కలిసి రూరల్ మండలం పొన్నెకల్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఖమ్మం లోకసభ ఎన్నికల కౌంటింగ్ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఏడు సెగ్మెంట్లకు కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూంలు, కేంద్రీకృత రిసెప్సన్ కేంద్రం ఏర్పాటుపై అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు.

News March 29, 2024

కాసిపేట: అల్యూమినియం దొంగతనం.. ఫిర్యాదు

image

కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ శివారులోని ట్రాన్స్ఫార్మర్ నుంచి 23 కిలోల అల్యూమినియం దొంగతనానికి గురైందని ఏఈ స్వర్ణలత ఫిర్యాదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ.. ట్రాన్స్ఫార్మర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు 23 కిలోల అల్యూమినియం అపహరించారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

News March 29, 2024

దుబ్బాక: గొలుసుతో ఉరేసుకొని వ్యక్తి సూసైడ్

image

దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెర్వాపూర్ పిట్టల వాడకు చెందిన జయరాం(35) ఇంట్లో రాత్రి ఎవరూ లేని సమయంలో వాసానికి గొలుసుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 29, 2024

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు: ఎస్పీ రాహుల్ హెగ్డే

image

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని విద్వేషకర పోస్టులు పెట్టే వారి సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

News March 29, 2024

GOOD NEWS: నిజామాబాద్‌లో IPL బిగ్ స్క్రీన్

image

క్రికెట్ ప్రేమికుల కోసం నిజామాబాద్ నగరంలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వెంకట్రాంరెడ్డి, సత్యపాల్ తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నగరంలోని ఉమెన్స్ కళాశాల మైదానంలో ఈ నెల 30, 31న బిగ్ స్క్రీన్ ద్వారా ఉచితంగా క్రికెట్ మ్యాచ్ చూడవచ్చన్నారు. క్రికెట్ ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

News March 29, 2024

ఖమ్మం: కొబ్బరి చెట్టుపై నుంచి పడి యువకుడి మృతి

image

కొబ్బరి చెట్టుపై నుంచి ఓ యువకుడి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన వేంసూరు మండలం అమ్మపాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన నాగరాజు (34)కొబ్బరికాయలు కోసేందుకు చెట్టు ఎక్కాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వేంసూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 29, 2024

హైదరాబాద్: భయపెడుతున్న‘భువన్’ సర్వే!

image

భువన్ సర్వే పేరుతో ఆస్తిపన్ను మదింపు చేయించిన మున్సిపల్ అధికారులు ఆ సర్వే ప్రకారం ఇళ్ల విస్తీర్ణం ఆధారంగా పన్ను జారీ చేస్తున్నారు. పంచాయతీలుగా ఉన్నప్పటి పన్నుల ప్రకారం లెక్కగట్టి కొంతమేరకు పెంచితే సరిపోతుంది. ఇందుకు విరుద్ధంగా జవహర్‌నగర్, బడంగ్‌పేట, మీర్‌పేట్, నిజాంపేట్, బోడుప్పల్, పీర్జాదీగూడ కార్పొరేషన్లలో ఇంటి పన్నులు పెంచి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.