Telangana

News September 26, 2024

గద్వాల: ప్రభుత్వ ఆఫీస్‌లోనే ఉద్యోగి సూసైడ్!

image

గద్వాల జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పట్టణంలోని కేఎల్ఐ క్యాంప్‌లో ఉన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ సబ్ డివిజన్ నెంబర్- 1 కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ అశోక్ తన కార్యాలయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 26, 2024

కూసుమంచి:నూతన విద్యుత్ మీటర్‌కు దరఖాస్తు చేసుకోండి: ADE

image

విద్యుత్ మీటర్ కనెక్షన్ లేని వారికి రూ.938తో నూతన విద్యుత్ మీటర్ కనెక్షన్ ఇస్తునట్టు చెప్పారు. గ్రామపంచాయతీ ధ్రువీకరణ పత్రం, ఇంటి పన్ను, ఆధార్ కార్డు, రేషన్ కార్డు పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కూసుమంచి ADE – 9440811530, కూసుమంచి AE – 9440811544, పాలేరు AE- 7901678189, రాజేశ్వరపురం AE – 9491058653, నేలకొండపల్లి AE – 9440811511, బచ్చోడు AE – 9440814150కు ఫోన్ చేయాలన్నారు.

News September 26, 2024

భూపాలపల్లి: లాడ్జిలో యువకుడి సూసైడ్

image

సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భూపాలపల్లి పట్టణంలోని జవహర్ నగర్‌కు చెందిన అక్షయ్(24) గతేడాది నగరానికి వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దిరోజుల కిందట సొంతూరుకు వెళ్లి తిరిగి మంగళవారం రాత్రి మార్కెట్ PS పరిధి బండిమెట్‌లోని లాడ్జిలో రూం తీసుకున్నాడు. బుధవారం ఉదయం మిత్రులు, కుటుంబసభ్యుల్లో తనకు ఇష్టమైన వాళ్ల ఫొటోలను వాట్సాప్ స్టేటస్ పెట్టి ఉరేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

News September 26, 2024

నల్గొండలో కొనసాగుతున్న మొబైల్ షాపుల బంద్

image

నల్గొండ జిల్లా కేంద్రంలో మొబైల్ షాప్ వ్యాపారుల మీద రాజస్థాన్ మార్వాడి వ్యాపారుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ నల్గొండ మొబైల్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. వరుసగా గురువారం జిల్లా కేంద్రంలోని అన్ని మొబైల్ షాపులు బందు చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మొబైల్ షాప్ యజమానులు పాల్గొన్నారు.

News September 26, 2024

NZB: కూతురిని చంపాడన్న అనుమానంతో హత్య..!

image

తన కూతురిని హత్య చేశాడన్న అనుమానంతో మామను.. వియ్యంకుడు హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్‌లో జరిగింది. కంజర్‌కు చెందిన సత్యనారాయణ తన కూతురిని అదే గ్రామానికి చెందిన నరహరి కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇటీవల సత్యనారాయణ కూతురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందగా తన కూతురుని నరహరే హత్య చేశాడని కోపం పెంచుకున్న సత్యనారాయణ రాత్రి నరహరిని కట్టెలతో కొట్టి హతమార్చాడు.

News September 26, 2024

అమెరికా పర్యటనలో స్టైల్ మార్చిన డిప్యూటీ సీఎం భట్టి

image

అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన స్టైల్ మార్చారు. ఎప్పుడూ తెల్లటి షర్టు, పంచా ధరించి తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే భట్టి.. అమెరికా పర్యటనలో సూట్ ధరించి భిన్నంగా కనిపిస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఆయన జీన్స్ ప్యాంట్, కలర్స్ షర్ట్స్ ధరిస్తున్నారు. విదేశీ పర్యటనలో తమ అభిమాన నేత స్టైలిష్ దుస్తుల్లో కనిపించడంతో వారు ఖుషీ అవుతున్నారు.

News September 26, 2024

కరీంనగర్: బతుకమ్మ పండగ కానుక అందేనా!

image

పేద మహిళలకు బతుకమ్మ పండగ కానుకగా అందించే చీరల పంపిణీపై సందిగ్ధం నెలకొంది. గతేడాది కరీంనగర్ జిల్లాలో 3,53,707 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ పండగకు చీరల పంపిణీపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరో వారం రోజుల్లో బతుకమ్మ ప్రారంభం కానుండగా ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది.

News September 26, 2024

వరంగల్ మార్కెట్‌లో పత్తి ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర నిన్నటి లాగే ఈరోజు తటస్థంగా ఉంది. బుధవారం రూ.7,500 పలికిన క్వింటా పత్తి ధర ఈరోజు సైతం అదే ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే నేడు మార్కెట్‌కు కొత్త పత్తి తరలిరాగా ధర సైతం నిన్న, మొన్నటితో పోలిస్తే కొంత తగ్గింది. నేడు కొత్త పత్తి క్వింటాకు రూ.7,070 పలికినట్లు అధికారులు పేర్కొన్నారు.

News September 26, 2024

BREAKING: HYD: 25 బృందాలతో మూసీలో సర్వే

image

గ్రేటర్ HYD పరిధిలోని మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో అధికారుల సర్వే కొనసాగుతోంది. HYD జిల్లా పరిధిలోని మూసీపై 16 బృందాలు, రంగారెడ్డిలో 4, మేడ్చల్‌లో 5 బృందాలతో కలిపి మొత్తం 25 టీమ్స్‌తో సర్వే చేస్తున్నారు. నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను సర్వే బృందాల సభ్యులు సేకరిస్తున్నారు. బఫర్ జోన్‌లోని నిర్మాణాలకు మార్క్ చేయనున్నట్లు వారు తెలిపారు.

News September 26, 2024

BREAKING: HYD: 25 బృందాలతో మూసీలో సర్వే

image

గ్రేటర్ HYD పరిధిలోని మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో అధికారుల సర్వే కొనసాగుతోంది. HYD జిల్లా పరిధిలోని మూసీపై 16 బృందాలు, రంగారెడ్డిలో 4, మేడ్చల్‌లో 5 బృందాలతో కలిపి మొత్తం 25 టీమ్స్‌తో సర్వే చేస్తున్నారు. నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను సర్వే బృందాల సభ్యులు సేకరిస్తున్నారు. బఫర్ జోన్‌లోని నిర్మాణాలకు మార్క్ చేయనున్నట్లు వారు తెలిపారు.