Telangana

News September 3, 2024

MHBD: CM షెడ్యూల్లో స్వల్ప మార్పులు

image

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తిరుమలాయపాలెం బ్రిడ్జి, కుదురు మండలం రావిరాలలో సీఎం పర్యటించాల్సి ఉండగా.. షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఆయన ఖమ్మం నుంచి నేరుగా సీతారాంనాయక్ తండాకు చేరుకోనున్నారు. గ్రామాన్ని వరద నీరు ముంచెత్తడంతో సుమారు 100 మందిని పోలీసులు కాపాడారు. విషయం తెలుసుకున్న సీఎం ముందుగా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

News September 3, 2024

KNR: భారీ వర్షం.. విద్యుత్‌ శాఖకు రూ.18.63 లక్షల నష్టం

image

కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు విద్యుత్‌ శాఖకు రూ.18.63 లక్షల నష్టం వాటిల్లిందని ఎస్‌ఈ వడ్లకొండ గంగాధర్‌ తెలిపారు. 31 విద్యుత్‌ స్తంభాలు, మూడు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు పడిపోయాయన్నారు. వినియోగదారుల కోసం హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి 9440811444, 1912, 18004250028 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.

News September 3, 2024

ధర్మపురి క్షేత్రంలో రెండు రోజులుగా కొనసాగుతున్న గోదావరి వరద

image

జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి పెరుగుతోంది. కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో గోదావరికి వరద పోటెత్తింది. దీంతో పుష్కర స్నాన ఘట్టాలు నీట మునిగాయి. సంతోషిమాత ఆలయంలోకి వరద నీరు చేరింది. వరద పరిస్థితిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు, జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

News September 3, 2024

HYD: అధికారులు ప్రతినెలా పాఠశాలలకు

image

ప్రత్యేక అధికారులు ప్రతినెలా 10 పాఠశాలలను సందర్శించి రిజిస్టర్లను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్లో డీఈవో, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలలను సందర్శించి నివేదికలు సమర్పించడానికి నియమించబడిన ప్రత్యేక అధికారులు వారానికి 2, నెలలో 10 పాఠశాలలను పరిశీలించాలని అన్నారు.

News September 3, 2024

HYD: సర్పంచుల పరిస్థితి దారుణం

image

కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచులకు బిల్లులు చెల్లించకపోవడంతో వారి పరిస్థితి దారుణంగా మారిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మాట్లాడారు. ‘రూ.1300 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని గవర్నర్‌ను కలిసి సర్పంచులు మొర పెట్టుకున్నారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.600 కోట్లు ఎక్కడికి పోయాయి? గ్రామ పంచాయితీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది’ అని ప్రభుత్వంపై మండిపడ్డారు.

News September 3, 2024

HYD: ఇకనుంచి గల్లీల్లోనే ఆధార్ సేవలు

image

ఆధార్ సేవలను సులభతరం చేసేందుకు అబిడ్స్ జీపీవో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి వీధుల్లోనే ఆధార్ సేవలు అందించనున్నారు. అబిడ్స్‌లోని జీపీవోకి వచ్చి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా కావాల్సిన తేదీల్లో శిబిరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఇప్పుటికే ధూల్ పేట, కొండాపూర్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో సేవలందించామని, ఇందుకు నామమాత్రపు రుసుం చెల్లించాలని చీఫ్ పోస్ట్ మాస్టర్ ప్రసాద్ తెలిపారు.

News September 3, 2024

నవీపేట: ఆరేళ్ల బాలికపై అత్యాచారం

image

ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని నవీపేట‌లో సోమవారం వెలుగుచూసింది. బాలిక(6)పై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆదివారం అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News September 3, 2024

శ్రీశైలం UPDATE

image

శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. 10 గేట్ల ద్వారా 4,71,730 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుత్తు కేంద్రాల 67,785 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగరుకు వదులుతున్నారు. జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 884.10 అడుగుల (210.5133 TMCలు)గా ఉంది. జూరాల నుంచి 3,20,805 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 4,479 క్యూసెక్కుల వరద శ్రీశైలంలోకి చేరుతుందని అధికారులు తెలిపారు.

News September 3, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,789 ఆత్మహత్యలు

image

ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. చిన్న విషయాలకు సైతం మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. 2023, 2024 సంవత్సరాల్లో 1,789 మంది ఆత్మహ్యత చేసుకున్నారు. ఆదిలాబాద్-453, నిర్మల్-452, మంచిర్యాల-611, కొమురం భీం-273 మంది సూసైడ్ చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

News September 3, 2024

కాజీపేట: రైళ్ల రద్దు కొనసాగింపు

image

మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె-కేసముద్రం సెక్షన్ ట్రాక్ ఘటనతో సోమవారం రెండో రోజు కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రూట్లలో నడిచే రైళ్లను రద్దు చేశారు. రద్దయిన రైళ్ల వివరాలు.. 5న డోర్నకల్-విజయవాడ(07755), ప్యాసింజర్, డోర్నకల్- కాజీపేట(07754) ప్యాసింజర్‌ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కాజీపేట జంక్షన్, నాగపూర్, నడికుడ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు.