India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అదృశ్యమైన ఓ యువకుడు బావిలో శవమై తేలిన ఘటన KNR జిల్లా తిమ్మాపూర్‌లో జరిగింది. CI స్వామి వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన అభిలాశ్(20) తిమ్మాపూర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లొమా చేస్తున్నాడు. అయితే ఈనెల 1న రాత్రి అభిలాశ్ అదృశ్యమయ్యాడు. బుధవారం సాయంత్రం కుళ్లిన స్థితిలో ఓ వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించగా.. ఫోన్, దుస్తుల ఆధారంగా అభిలాశ్‌గా పోలీసులు గుర్తించారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎట్టకేలకు అభ్యర్థులు ఖరారయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ గతంలోనే తమ అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి పేరు ప్రకటించడంలో ఉత్కంఠ జరుగగా తాజాగా తమ అభ్యర్థి పేరు ప్రకటించేశారు. BJP నుండి గోడం నగేష్, CONG నుంచి సుగుణక్క, BRS నుండి ఆత్రం సక్కు ఎన్నికల బరిలో ఉండనున్నారు. ఇక ప్రచారాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ మూడు పార్టీల నుండి ఈసారి త్రిముఖ పోటీ తప్పేలా లేదు.
రంజాన్ వేళ HYD నగరంలో డ్రై ఫ్రూట్స్‌కు డిమాండ్ పెరిగింది. HYD దేశంలోనే ఖర్జూరాలను అధికంగా అవిక్రయించే నగరంగా పేరుగాంచింది. ఏటా సుమారు 400 ట్రక్కుల ఖర్జురాలను విక్రయిస్తారు. దాదాపు బేగంబజార్లో 40 రకాల ఖర్జూరాలు విక్రయిస్తుండగా.. కిమియా , షికారి, కూద్రి, మజాపాతి, కాల్మీ ప్రసిద్ధిగాంచినవి. మరోవైపు అమెరికా, అరబ్ దేశాల నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి HYD నగరానికి డ్రై ఫ్రూట్స్ దిగుమతి అవుతున్నాయి.

అదృశ్యమైన ఓ యువకుడు బావిలో శవమై తేలిన ఘటన KNR జిల్లా తిమ్మాపూర్‌లో జరిగింది. CI స్వామి వివరాల ప్రకారం.. BHPL జిల్లా కాటారం మండలానికి చెందిన అభిలాశ్(20) తిమ్మాపూర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా చేస్తున్నాడు. అయితే ఈనెల 1న రాత్రి అభిలాశ్ అదృశ్యమయ్యాడు. బుధవారం సాయంత్రం కుళ్లిన స్థితిలో స్థానికంగా ఓ వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించగా.. చరవాణి, దుస్తుల ఆధారంగా అభిలాశ్‌గా పోలీసులు గుర్తించారు.
యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆత్మకూరు మండలంలోని పారుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నాగరాజు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పట్టూరి శివ కొద్ది రోజులుగా ఇంటి వద్ద ఉంటున్నాడు. బుధవారం ఉదయం పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో ఉండటంతో చికిత్స నిమిత్తం HYD కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
మద్యం తాగి విధులకు హాజరైన చర్ల మండలం జీపీ పల్లి పాఠశాల <<12938027>>ప్రధానోపాధ్యాయుడు <<>>బానోత్ కృష్ణను సస్పెండ్ చేస్తూ డీఈఓ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారని ఎంఈఓ తెలిపారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్, మద్యం తాగి పాఠశాలకు రావడమే కాకుండా, విద్యార్థులను కొట్టాడు. దీంతో విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడిని నిర్బంధించిన విషయం తెలిసింది. విచారణ చేపట్టిన డీఈఓ సస్పెండ్ చేశారు.
HYD నగరంలో వేసవి వేళ మామిడి పండ్ల క్రయ విక్రయాలు పెరిగాయి. ఇదే అదునుగా వ్యాపారులు మామిడికాయ త్వరితగతిన పక్వానికి రావడానికి కెమికల్ ప్యాకెట్లను కాయల మధ్య ఉంచుతున్నారు. ఇలా చేసి పండించిన పండ్లను తినడం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటుందని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ శివలీల తెలిపారు. కాగా ఇటీవలే బాటసింగారంలో వేలాది పండ్లను సీజ్ చేశారు. మామిడి పండ్లు కొనేటప్పుడు జర జాగ్రత్త..!

ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ ప్రక్రియను కట్టుదిట్టమైన భద్రత మధ్య చేపట్టిన అధికారులు ప్రశాంతంగా ముగించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు. పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ రవి నాయక్ తన చాంబర్ నుండి పర్యవేక్షిస్తున్నారు. ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ సూచనలిచ్చారు.
Sorry, no posts matched your criteria.