Telangana

News March 28, 2024

వేడెక్కిన మెదక్‌ లోక్‌సభ రాజకీయం

image

లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం షురువైంది. ఇరు పార్టీలనేతలు పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఉమ్మడి మెదక్‌ జిల్లా రాజకీయం వేడెక్కింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పి.వెంకట్రాంరెడ్డికి రూ. వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అంటే ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ BRS నేతలు సెటైర్లు వేశారు.

News March 28, 2024

కాటారం: చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

image

కాటారం మండలంలోని సుందర్ రాజ్ పేటకు చెందిన విద్యార్థిని అక్షయ(15) చికిత్స పొందుతూ మృతి చెందింది. SI అభినవ్ వివరాల ప్రకారం.. ఈనెల 19న అక్షయ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాసేందుకు ఆమె తండ్రి ప్రవీణ్‌తో కలిసి, బైక్ పై వెళ్తోంది. ఈ క్రమంలో మద్దులపల్లి సమీపంలో బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. అక్షయ తలకు తీవ్ర గాయాలు కాగా.. ఎంజీఎంలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

News March 28, 2024

NZB: రైళ్లలో సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరికి జైలు శిక్ష

image

రైళ్లలో సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరికి 8 నెలల జైలుశిక్ష విధిస్తూ రైల్వే మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు చెప్పారని నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లాకు చెందిన జూలు శ్రీకాంత్, నిజామాబాద్ జిల్లాకు చెందిన గజం సత్యం కలిసి కామారెడ్డి, నిజామాబాద్ మధ్య నడిచే రైళ్లలో 9 సెల్‌ఫోన్లు దొంగలించారని సాయిరెడ్డి వివరించారు.

News March 28, 2024

కథలాపూర్: వరకట్న వేధింపు.. కేసు నమోదు

image

అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన బంటు లావణ్యను మెట్ల చిట్టాపూర్ గ్రామానికి చెందిన బంటు నారాయణతో వివాహం జరిగింది. అయితే భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని భార్య లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ తెలిపారు.

News March 28, 2024

MBNR: చిన్నారులకు బాల ఆధార్ సేవలు ఉచితం

image

ఐదేళ్ల లోపు చిన్నారులకు బాల ఆధార్ అవసరమైన వారికి తపాలా శాఖ ద్వారా ఉచితంగా ఇంటి వద్దకే వచ్చి ఆధార్ నమోదు సేవలను అందిస్తున్నట్లు తపాల శాఖ డివిజన్ పర్యవేక్షకుడు రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 9553062368 నంబర్‌కు సంప్రదించాలన్నారు. ఎందుకు మున్సిపల్, పంచాయతీ లేదా ఆస్పత్రిలో పొందిన జనన ధ్రువీకరణ పత్రాన్ని తపాల సిబ్బందికి చూపించాలన్నారు. దీని ద్వారా పోర్టల్‌లో వివరాలను నమోదు చేయనున్నట్లు తెలిపారు

News March 28, 2024

ఆదిలాబాద్: ప్రజలను హడలెత్తిస్తున్న సూర్యుడి భగభగలు

image

వేసవి ప్రారంభంలోనే సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 10 ప్రాంతాల్లో ఆరు ప్రాంతాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్ మండలంలో 42.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదయింది. అదేవిధంగా సత్నాలలో 42.3, చాప్రాలలో 42.1, ఆసిఫాబాద్లో 42.0 , అర్లి(టి)లో 42.0, దస్తురాబాద్ మండలంలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 28, 2024

భువనగిరి: ఎంపీ అభ్యర్థి చామల రాజకీయ నేపథ్యం ఇదే

image

భువనగిరి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వగ్రామం శాలిగౌరారం. యూత్ కాంగ్రెస్ రాజకీయాలతో రాజకీయ అరంగ్రేటం చేశారు. 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 2007లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ కోటరీలో కీలకంగా వ్యవహరించారు. తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు.

News March 28, 2024

పాల్వంచ: ఆడపిల్ల పుట్టిందని వేధింపులు.. కేసు నమోదు

image

భార్యను వేధిస్తున్న భర్త, అతని కుటుంబ సభ్యులపై పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు ప్రకారం.. కేశవాపురం గ్రామానికి చెందిన రమ్యకు శివకృష్ణతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడో సంతానం ఆడపిల్ల పుట్టిందని భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ రమ్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ కేసు నమోదు చేశారు.

News March 28, 2024

HYD: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు!

image

HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మెయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లిలో 41.2 డిగ్రీలు, రెడ్డిపల్లిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే ఆస్కారం ఉందని వాతవారణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలని సూచించింది.

News March 28, 2024

MBNR: అడుగంటిన రామన్ పాడ్ జలాశయం

image

ఉమ్మడి పాలమూరు జిల్లా త్రాగు, సాగునీటి అవసరాలు తీర్చడంలో పేరుపొందిన రామన్ పాడ్ జలాశయం అడుగంటి పోతుంది. గత సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురువకపోవడంతో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో సాగు త్రాగునీటికి ఇబ్బందికరంగా మారింది. వర్షాలు లేక ప్రాజెక్టులో నీరు లేక రామన్ పాడ్ జలాశయంపై ఆధారపడిన గ్రామాలు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు.