Telangana

News March 28, 2024

HYD: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు!

image

HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మెయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లిలో 41.2 డిగ్రీలు, రెడ్డిపల్లిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే ఆస్కారం ఉందని వాతవారణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలని సూచించింది. 

News March 28, 2024

మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు.. నేపథ్యమిదే!

image

2006లో పటాన్‌చెరు మండలం చిట్కుల్ జీపీ ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2014లో ఉపసర్పంచ్‌గా, 2014లో ZPTC ఎన్నికలలో TRS పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. 2019 సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానం చిట్కుల్ గ్రామానికి ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2023 పటాన్‌చెరు అసెంబ్లీకి BSP పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ సాధించాడు.

News March 28, 2024

KNR: మీ ఇంటి నుంచే వాతావరణ సమాచారం తెలుసుకోండి!

image

ప్రతి చోటా వాతావరణంం.. ఇంటింటికీ వాతావరణం పేరుతో భారత వాతావరణ విభాగం(IMD) ‘పంచాయత్ సేవా మౌసం యాప్‌’ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా నేరుగా ఇంటి నుంచే వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సేవలు 12 భాషల్లో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఎండల తీవ్రత, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాల్పులు పెరగనుండటంతో దీని ద్వారా ముందస్తుగా సమాచారం తెలుసుకోవచ్చు. కాగా, ఈ యాప్‌ను ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

News March 28, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు..!

image

✔ఏర్పాట్లు పూర్తి..నేడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
✔అలంపూర్:పలు గ్రామాలలో కరెంటు కట్
✔ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఇఫ్తార్ విందు
✔MBNR:PUలో నేడు వర్క్ షాప్
✔పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు
✔MLC ఉప ఎన్నిక.. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
✔రంజాన్ వేళలు:
ఇఫ్తార్(గురు):6-36,సహార్( శుక్ర):4-53
✔ఎమ్మెల్సీ ఉప ఎన్నిక..ఓట్ల లెక్కింపుపై సమీక్ష
✔ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు
✔ఎండిపోతున్న పంటలపై అధికారుల ఫోకస్

News March 28, 2024

నిర్మల్: మద్యం మత్తులో ఆత్మహత్య

image

మద్యం మత్తులో నీటి ట్యాంకులో దూకి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన బైంసా మండలంలో చోటుచేసుకుంది. టాక్లీ గ్రామానికి చెందిన తలుపుల రాజు(32)అనే వ్యక్తి గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఇదే విషయమై తరుచూ భార్యాభర్తల మద్య గొడవలు జరుగుతుండడంతో రాజు భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మద్యం మత్తులో గ్రామంలోని వాటర్ ట్యాంకులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భైంసా రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

News March 28, 2024

నిజామాబాదీలు జర జాగ్రత్త..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రత 40 సెల్సియస్ డిగ్రీలు దాటుతోంది. నిన్న బుధవారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోని ముగ్పాల్ మండలం మంచిప్పలో 42.2, నిజామాబాద్ లో 41.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా కామారెడ్డి జిల్లాలోని బిచ్కుందలో 40.9, తాడ్వాయిలో 39.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మున్ముందు ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది.

News March 28, 2024

MBNR: ఉప ఎన్నికలకు ఏర్పాటు పూర్తి.. బరిలో ఉన్నది వీరే!

image

MBNR స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉప ఎన్నిక కోసం మన్నె జీవన్‌రెడ్డి(కాంగ్రెస్‌), నవీన్‌కుమార్‌రెడ్డి(బీఆర్ఎస్), సుదర్శన్‌గౌడ్‌(స్వతంత్ర అభ్యర్థి) బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలకు చెందిన ఓటర్లు గోవా క్యాంపులో ఉన్నారు. వీరు నిన్న కర్ణాటకకు చేరుకున్నారు. పోలింగ్‌ టైంకి కేంద్రాలకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

News March 28, 2024

మణుగూరు: రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి మృతి

image

మణుగూరు మండలం సమితిసింగారం రహదారిపై పాత సమ్మయ్య ఆసుపత్రి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాంబమూర్తి(55) అనే సింగరేణి ఉద్యోగి మృతి చెందాడు. మణుగూరు నుంచి పీవీ కాలనీకి బైక్‌పై వెళ్తున్న క్రమంలో వాహనం అదుపు తప్పింది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సాంబమూర్తి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 28, 2024

చౌటుప్పల్: లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి రిమాండ్

image

చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శివ దండు మల్కాపురంలోని ఓ కంపెనీలో పని చేస్తుంటారు. ఈనెల 25న రెండున్నరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బుధవారం కోర్టులో హాజరు పరచగా రిమాండ్ నిమిత్తం నల్గొండ జైలుకు తరలించారు.

News March 28, 2024

MBNR: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వేళాయె!

image

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు జరగనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో సెక్టార్, రూట్ అధికారులు, పీవో, ఏపీవోలు కలిపి మొత్తం 450 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఉప ఎన్నికకు ఎన్నికల పరిశీలకురాలిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ శాస్త్ర, సాంకేతికశాఖ ముఖ్యకార్యదర్శి వాణి ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.