Telangana

News March 28, 2024

నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా టీ. జీవన్ రెడ్డి

image

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా టీ.జీవన్ రెడ్డిను ఆపార్టీ అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. ఈయన1983లో TDP నుంచి తొలిసారిగా జగిత్యాల MLAగా ఎన్నికై.. మంత్రివర్గంలో చేరారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ లో చేరి 1989, 1996, 1999, 2004, 2014లలో కాంగ్రెస్ పార్టీ నుంచి MLAగా గెలిచారు. 2019లో కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ MLCగా ఎన్నికయ్యారు.

News March 28, 2024

ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ 

image

ఆదిలాబాద్ పార్లమెంట్ (కాంగ్రెస్ పార్టీ) ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆత్రం సుగుణ మాట్లాడుతూ.. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు, ఎమ్మెల్యే బొజ్జుకు, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

News March 28, 2024

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు

image

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. కొద్ది రోజులుగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలో తాత్సారం జరిగిన విషయం తెలిసిందే. జగ్గారెడ్డి, ఆయన సతీమణి నిర్మలతో పాటు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని ఆలోచన చేసిన విషయం తెలిసిందే. చివరకు నీలం మధు పేరును ప్రకటించారు.

News March 28, 2024

ఖమ్మం: ఫ్రీ బస్ ఎఫెక్ట్.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

image

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లా నుంచి కోదాడ, సూర్యాపేట, ఇల్లందు, కొత్తగూడెం సత్తుపల్లి ప్రయాణించాలంటే గంటల కొద్దీ బస్టాండ్లో వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రయాణికులకు సరిపడా బస్సుల సౌకర్యం కల్పించాలని పలువురు వేడుకుంటున్నారు.

News March 28, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాలు-ఓటర్ల వివరాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది.
✓MBNR ఎంపీడీవో కార్యాలయం 245.
✓ కోడంగల్ MPDO కార్యాలయం 56.
✓పేట MPDO కార్యాలయం 205.
✓వనపర్తి RDO కార్యాలయం 218. ✓గద్వాల ZP కార్యాలయ సమావేశం మందిరం 225.
✓కొల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 67.
✓ నాగర్ కర్నూల్ GOVT బాలుర కళాశాల 101 .
అచ్చంపేట ZPHS బాలికల పాఠశాల 79 ✓కల్వకుర్తి ప్రభుత్వ కళాశాల 72.
షాద్నగర్ ఎంపీడీవో కార్యాలయం 71.

News March 28, 2024

NLG: మాస్టర్ ప్లాన్.. ఎక్కడి వేసిన గొంగడి అక్కడే!

image

NLG మున్సిపాలిటీలో 40 ఏళ్ల కిందటి మాస్టర్ ప్లాన్ అమల్లో ఉంది. పాత మాస్టర్ ప్లాన్ వల్ల మున్సిపాలిటీ ఆదాయాన్ని భారీగా కోల్పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ కోసం చేస్తున్న కసరత్తు ఏళ్లు గడుస్తున్నా కొలిక్కి రావడం లేదు. పాలకవర్గాలు, ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నారే గాని మాస్టర్ ప్లాన్ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

News March 28, 2024

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అఘోరా

image

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మలను అఘోరా  దర్శించుకున్నారు. బుధవారం మేడారం గిరిజన ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మలను తమిళనాడుకు చెందిన అఘోరా.. కాలికా ఉపాసకుడు .. శివ విభూషణరావు దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

News March 28, 2024

నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి

image

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా కొడంగల్ పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు వేసేందుకు గురువారం రానున్నట్లు కాడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. సీఎం రానున్న నేపథ్యంలో రాజేంద్రనగర్, చేవెళ్ల ట్రాఫిక్ ఠాణాల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు జాయింట్ సీపీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు. ఇటు కొడంగల్‌లో కూడా అధికారులు అదనపు బలగాలను రంగంలోకి దింపామన్నారు.

News March 28, 2024

NZB: పోటీ పరీక్షల కోసం ఉచిత కోచింగ్

image

గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు టీఎస్ఎస్సీ స్టీడీ సర్కిల్, షెడ్యూల్డ్ కులాల అభివృది శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శశికళ తెలిపారు. డిగ్రీ అర్హత ఉన్న ఎస్సీ అభ్యర్థుల దీనికి అప్లయ్ చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గలవారు జిల్లా కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News March 28, 2024

సురక్ష సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న ఐజి 

image

హన్మకొండ జిల్లా కాజిపేట్‌లోని ఆర్పీఎఫ్ పోలీస్ కార్యాలయంలో బుధవారం ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బందికి సురక్ష సమ్మేళన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్పీఎఫ్ ఐజి & PCSC, SCR-అరోమా సింగ్ ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఆర్పీఎఫ్ హాస్పిటల్‌ని సందర్శించారు. సమన్యాయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్పిఎఫ్ సిఐ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.