Telangana

News March 27, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఈనెల 29న గుడ్ ఫ్రైడే, శనివారం, ఆదివారం వారాంతరపు సెలవులు సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తిరిగి సోమవారం మార్కెట్ పునఃప్రారంభమై క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోనే రైతులు గమనించాలన్నారు.

News March 27, 2024

HYD: రూ.2,57,05,390 నగదు పట్టివేత

image

HYDలో ఎన్నికల ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా ఇప్పటివరకు రూ.2,57,05,390 నగదు, రూ.37,05,841 విలువైన ఇతర వస్తువులు, 1386.28 లీటర్ల అక్రమ మద్యంను సీజ్ చేసినట్లు GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.16,19,000 నగదు, 1,81,689 విలువ గల ఇతర వస్తువులు, 49.37 లీటర్ల అక్రమ మద్యం పట్టుబడిందని వెల్లడించారు

News March 27, 2024

HYD: రూ.2,57,05,390 నగదు పట్టివేత

image

HYDలో ఎన్నికల ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా ఇప్పటివరకు రూ.2,57,05,390 నగదు, రూ.37,05,841 విలువైన ఇతర వస్తువులు, 1386.28 లీటర్ల అక్రమ మద్యంను సీజ్ చేసినట్లు GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.16,19,000 నగదు, 1,81,689 విలువ గల ఇతర వస్తువులు, 49.37 లీటర్ల అక్రమ మద్యం పట్టుబడిందని వెల్లడించారు.

News March 27, 2024

నారాయణపేట జిల్లాలో ఏసీబీకి పట్టుబడ్డ తహశీల్దార్

image

నారాయణపేట జిల్లా గుండుమాల్ తహశీల్దార్ పాండు నాయక్ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. ఏసీబీ అధికారి శ్రీకృష్ణ గౌడ్ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మల్లేశ్ వద్ద నుంచి తహశీల్దార్ పాండు నాయక్ రూ.3 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో మల్లేశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారి శ్రీకృష్ణ గౌడ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.

News March 27, 2024

రూ.100 కోట్లకు ఎంపీ స్థానాన్ని అమ్ముకున్న బీఆర్ఎస్: రఘునందన్ రావు

image

మెదక్ పార్లమెంటు స్థానాన్ని రూ.100 కోట్లకు బీఆర్ఎస్ అమ్ముకుందని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. కందిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాపై మాజీ మంత్రి హరీశ్ రావు పెత్తనం చేయడం సరికాదని చెప్పారు. దమ్ముంటే సొంత జిల్లా కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.

News March 27, 2024

ముత్తారం: ‘అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు’

image

ముత్తారం మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ హెచ్చరించారు. ఇటీవల (మానేరులో దొంగలు పడ్డారు) అనే కథనంతో స్పందించిన జిల్లా కలెక్టర్ మండలంలో ఎవరికైనా ఇసుక కావల్సిన వారు మన ఇసుక వాహనం అనే వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అక్రమంగా ఇసుక తరలిస్తే అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు.

News March 27, 2024

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బరిలో నిలిచేది ఎవరు..?

image

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రకటనపై నేడు ఉత్కంఠకు తెరపడనుంది. ఈరోజు రాత్రి ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ సీఈసీ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని అధిష్ఠానం ఖరారు చేసి ప్రకటన చేయనుంది. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేసులో ప్రధానంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి, నందిని విక్రమార్క ఉన్నారు. వీరిలో ఒకరిని అధిష్ఠానం ఖరారు చేయనుంది. కాగా వీరిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఎవరు ఉంటారో కామెంట్ చేయండి.

News March 27, 2024

నాగర్ కర్నూల్ లోక్‌సభ పరిధిలోని ఓటర్లు

image

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలిలా..
✓ నాగర్ కర్నూల్ అసెంబ్లీ- 2,38,133
✓ అచ్చంపేట అసెంబ్లీ- 2,47,621
✓ కల్వకుర్తి అసెంబ్లీ- 2,42,962
✓ కొల్లాపూర్ అసెంబ్లీ – 2,38,459
✓ వనపర్తి అసెంబ్లీ – 2,72,653
✓ గద్వాల అసెంబ్లీ- 2,55,866
✓ అలంపూర్ అసెంబ్లీలో- 2,39,079 మంది ఓటర్లు ఉన్నారు. ఇంకా ఓటరుగా నమోదు చేసుకోని వారి కోసం మరోసారి అవకాశం కల్పించారు.

News March 27, 2024

HYD: బండ్లగూడ CI, SI సస్పెన్షన్..!

image

బండ్లగూడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ షకీర్ అలీ, SI వెంకటేశ్వర్, కానిస్టేబుల్ రమేశ్‌ను CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. జనవరిలో CRPF మహిళా కానిస్టేబుల్ కంప్లైంట్ విషయంలో అలసత్వం వహించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపిన ఉన్నతాధికారులు సీపీకి నివేదిక అందించారు. నివేదిక ఆధారంగా సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

News March 27, 2024

లైసెన్సు కలిగిన ఆయుధాలు వెంటనే డిపాజిట్ చేయాలి: ఎస్పీ 

image

పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లాలో లైసెన్సు కలిగిన ఆయుధాలు వెంటనే డిపాజిట్ చేయాలి జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ఎన్నికల కోడ్ విడుదలైన నేపథ్యంలో నల్లగొండ జిల్లా పరిధిలోని మొత్తం 136 ఆయుధాలు లైసెన్స్ లు కలిగి ఉన్నాయని, వాటిని వెంటనే సమీప పోలీసు స్టేషన్‌లో లేదా జిల్లా పోలీసు కార్యాలయంలో డిపాజిట్‌ చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీచేశారు.