Telangana

News March 27, 2024

HYD: బండ్లగూడ CI, SI సస్పెన్షన్..!

image

బండ్లగూడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ షకీర్ అలీ, SI వెంకటేశ్వర్, కానిస్టేబుల్ రమేశ్‌ను CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. జనవరిలో CRPF మహిళా కానిస్టేబుల్ కంప్లైంట్ విషయంలో అలసత్వం వహించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపిన ఉన్నతాధికారులు సీపీకి నివేదిక అందించారు. నివేదిక ఆధారంగా సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

News March 27, 2024

కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకోనున్న రేవంత్ రెడ్డి

image

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఎక్స్- అఫీషియో హోదాలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు గురువారం రేవంత్ రెడ్డి కొడంగల్‌కు రానున్నారు. ఇప్పటికే అధికారులు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు.

News March 27, 2024

సర్వం సిద్ధం.. రేపే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక!

image

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రేపు జరగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ZPTC, MPTC సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎక్అఫీషియో మెంబర్ల (14 మంది MLAలు, ఇద్దరు MPలు, ముగ్గురు MLCలు)తో కలిపి మొత్తం 1,439 మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

News March 27, 2024

గంభీరావుపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

image

గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏప్రిల్ 1న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి బుధవారం తెలిపారు. జాబ్ మేళాలో పలు కంపెనీలు హాజరవుతున్నాయని, డిగ్రీ పూర్తయిన విద్యార్థులు, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరుకావాలని కోరారు.

News March 27, 2024

మోత్కూరు ఎంపీడీవో కార్యాలయంపై ఏసీబీ దాడి

image

మోత్కూరు మండలం పొడిచేడు గ్రామ సెక్రటరీ కిరణ్ ఏసీబీ వలలో బుధవారం చిక్కాడు. మోత్కూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేయగా ఇంటి అనుమతి కోసం రూ.3వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇంటి అనుమతి కోసం బాధితుడు ఇదివరకే రూ.5వేలు ఇవ్వగా మళ్లీ అదనంగా డబ్బులు డిమాండ్ చేయడంతో రూ.3వేలు లంచం తీసుకుంటూ దొరికాడు.

News March 27, 2024

కొత్తగూడెం: బైక్ చోరీ.. చలనాతో బయటపడింది..

image

ములుగు జిల్లాలో ఇటీవల చోరీకి గురైన బైక్ మణుగూరులో ప్రత్యక్షమైంది. కాగా స్థానిక పోలీసులు ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించలేదని చలానా కొట్టడంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి నుంచి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 27, 2024

జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు నిజామాబాద్ క్రీడాకారులు

image

జాతీయస్థాయి సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, గంగమోహన్ తెలిపారు. ఇటీవల అదిలాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నీలో అద్భుత ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఈజట్లు ఈనెల 29 నుంచి ఏప్రిల్ 1 వరకు ఔరంగాబాద్‌లో జరిగే జాతీయస్థాయి టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్నారు.

News March 27, 2024

జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఏడేళ్ల బాలుడి మృతి

image

జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పెంబర్తి వద్ద ఆటోను ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు ఈశ్వర్ మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

News March 27, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాకు గుడ్ న్యూస్.. ప్రత్యేక నిధులు వచ్చాయ్!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటి ఎద్దడి నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. NLG జిల్లాకు రూ. 4.5 కోట్లు, SRPTకు రూ. 2.70 కోట్లు, యాదాద్రి జిల్లాకు రూ.1.82 కోట్లు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక అభివృద్ధి నిధులు నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున 12 నియోజకవర్గాలకు రూ.120 కోట్లు గత నెలలో మంజూరు చేశారు. వాటిలో నియోజకవర్గానికి రూ. కోటి చొప్పున తాగు నీటికి ఖర్చు చేయనున్నారు.

News March 27, 2024

MBNR: సోషల్ మీడియాపై పోలీసుల సూచనలు

image

✓వాట్సప్, ఫేస్‌బుక్‌లోని ప్రతి పోస్టింగ్‌కు అడ్మిన్ బాధ్యత తీసుకోవడంతో పాటు గ్రూపులోని ప్రతి సభ్యుని పేరు, చిరునామా తెలిసి ఉండాలి.
✓ సభ్యులను గ్రూపులో చేర్చుకునే ముందు వారి అనుమతి తీసుకోవాలి.
✓నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టే సభ్యులను తొలగించి స్థానిక పోలీసులకు తెలియజేయాలి.
✓అడ్మినే వివాదాస్పద, అభ్యంతరకర, రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే IT చట్టం IPC సెక్షన్ 153(ఎ) కింద కేసు నమోదు.