Telangana

News March 27, 2024

MBNR: పోలింగ్‌కు ఒక్కరోజు మాత్రమే గడువు

image

మహబూబ్ నగర్ స్థానికసంస్థల MLC ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైంది. పోలింగ్‌కు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో ఓటర్ల జాబితాపై ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. చివరి ప్రయత్నంగా ఓటర్ల సమీకరణాలను సరి చూసుకుంటున్నారు. MLCఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు మన్నె జీవన్ రెడ్డి(కాంగ్రెస్) నవీన్ కుమార్‌రెడ్డి(BRS)ఇప్పుడు తమకున్న ఓటర్ల బలాబలాలపై దృష్టి సారించారు.

News March 27, 2024

ప్రజలు వడదెబ్బ తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: DHMO

image

ప్రస్తుతం ఎండలు విపరీతంగా పెరుగుతున్నందున ఖమ్మం జిల్లాలోని ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాలతి సూచించారు. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తరలించాలని, చల్లని నీటితో శరీరాన్ని తుడవాలని , వ్యక్తికి వీలైనంత గాలి తగిలే విధంగా జాగ్రత్త వహించాలన్నారు. సాధ్యమైనంతవరకు ఎండలో బయటకు వెళ్లడం ఆపివేయాలన్నారు.

News March 27, 2024

వరంగల్ మార్కెట్‌కి మళ్లీ వరుస సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మళ్లీ 3 రోజులు వరుస సెలవులు రానున్నాయి. శుక్రవారం గుడ్ ఫ్రైడే, శని, ఆదివారాలు వారాంతపు సెలవుల నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. నేడు, రేపు మాత్రమే మార్కెట్ ఓపెన్ ఉండనుంది. కావున, రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్లో క్రయ విక్రయాలు కొనసాగించాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 27, 2024

ఖమ్మం: ఉద్యోగ వేట.. గ్రంథాలయ బాట

image

ఇటీవల విడుదలైన ఉద్యోగ ప్రకటనలతో నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రభుత్వ కొలువులు సాధించేందుకు కసరత్తు ప్రారంభించారు. తొలి ప్రయత్నంలోనే సాధించాలని కొందరు, ఈసారైనా కల నెరవేర్చుకోవాలని మరికొందరు పోటీ పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో అభ్యర్థులు ఉదయం నుంచి రాత్రి వరకు గ్రంథాలయాల్లో సాధన చేస్తున్నారు. అక్కడి వసతులను ఉపయోగించుకుని అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు శ్రమిస్తున్నారు.

News March 27, 2024

జగిత్యాలలో మత్తులో మైనర్ల హంగామా!

image

జగిత్యాలలోని మహాలక్ష్మినగర్ బైపాస్ దగ్గర మంగళవారం సాయంత్రం మత్తులో ఉన్న నలుగురు మైనర్లు హంగామా సృష్టించారు. విచిత్రంగా ప్రవర్తిస్తూ ఇళ్ల ముందు నిలిపిన బైకులను తన్ని కింద పడేశారు. కేకలు వేస్తూ రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్థానికులు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వారికి ఫిర్యాదు చేయగా వారిని పట్టుకోవడానికి వచ్చిన సిబ్బందిపై దాడికి యత్నించారు. ఒకరిని పట్టుకోగా ముగ్గురు పారిపోయారు.

News March 27, 2024

నేషనల్ సైక్లింగ్ పోటీలకు ఆదిలాబాద్ బిడ్డ ఎంపిక

image

నేరడిగొండ మండలం మర్లపల్లికి చెందిన జాదవ్ కిరణ్ జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల రామాయంపేటలో జరిగిన రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో అండర్-18 విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రజత పతకాన్ని సాధించారు. ఈనెల 28 నుంచి 31 వరకు హరియాణాలో నిర్వహించే జాతీయస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.

News March 27, 2024

HYD: ఇనుప రాడ్డు మెడకు గుచ్చుకొని వ్యక్తి మృతి

image

ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన HYD KPHB PS పరిధిలో జరిగింది. SI సుమన్ తెలిపిన వివరాలు.. బాలానగర్‌ వాసి పవన్(35) ఫ్యాబ్రికేషన్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. KPHB రోడ్ నం.1లోని ఐరిస్ షోరూమ్ షట్టర్ మరమ్మతులు చేసేందుకు వచ్చాడు. నిచ్చెన వేసుకుని మరమ్మతులు చేస్తుండగా షట్టర్ రాడ్డు హైటెన్షన్ విద్యుత్ తీగకు తగిలింది. దీంతో కరెంట్ షాక్‌కు గురై కింద ఇనుప రాడ్డుపై పడటంతో అది మెడకు గుచ్చుకొని మృతిచెందాడు.

News March 27, 2024

HYD: ఇనుప రాడ్డు మెడకు గుచ్చుకొని వ్యక్తి మృతి

image

ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన HYD KPHB PS పరిధిలో జరిగింది. SI సుమన్ తెలిపిన వివరాలు.. బాలానగర్‌ వాసి పవన్(35) ఫ్యాబ్రికేషన్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. KPHB రోడ్ నం.1లోని ఐరిస్ షోరూమ్ షట్టర్ మరమ్మతులు చేసేందుకు వచ్చాడు. నిచ్చెన వేసుకుని మరమ్మతులు చేస్తుండగా షట్టర్ రాడ్డు హైటెన్షన్ విద్యుత్ తీగకు తగిలింది. దీంతో కరెంట్ షాక్‌కు గురై కింద ఇనుప రాడ్డుపై పడటంతో అది మెడకు గుచ్చుకొని మృతిచెందాడు. 

News March 27, 2024

MBNR: ఈ లక్షణాలు కనిపిస్తే వడదెబ్బే ?

image

మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఏదైనా పని మీద బయటకు వస్తే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. వడదెబ్బ తగిలితే తల తిరగడం, కళ్లు బైర్లు కమ్మడం, నాలుక తడి ఆరిపోతుంది. అలాగే గుండె వేగంగా కొట్టుకోవడం, దాహంగా అనిపిస్తుంది. వాంతులు, విరేచనాలు కూడా అవుతాయి. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. బయటికి వెళ్తే కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. మధ్యాహ్నం పూట లేత రంగు బట్టలు ధరించాలి.

News March 27, 2024

ఉప్పల్: ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో శుభవార్త

image

ఉప్పల్‌లో ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో శుభవార్త తెలిపింది. ఉప్పల్ స్టేడియం, నాగోల్, ఎన్.జీ.ఆర్.ఐ స్టేషన్లలో అర్ధరాత్రి మెట్రో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. రాత్రి 12.15 గంటలకు మెట్రో ట్రైన్ ప్రారంభమై 1.10 గంటలకు చివరి స్టాప్‌కు చేరుకుంటుందని తెలిపారు. ఈ సౌకర్యాన్ని ఐపీఎల్ మ్యాచ్‌కు వచ్చేవారు వినియోగించుకోవాలని సూచించారు.