Telangana

News March 27, 2024

6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం: కలెక్టర్

image

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి మంగళవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ కోసం జిల్లాలో చేపడుతున్న చర్యల గురించి సీ.ఎస్ దృష్టికి తెచ్చారు. రబీ సీజన్లో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు.

News March 27, 2024

ఏడుపాయలలో విషాద ఘటన

image

ఏడుపాయల చెక్‌డ్యామ్‌లో మునిగి వ్యక్తి మృతి చెందాడు. పాపన్నపేట ఎస్సై కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండలానికి చెందిన సిద్ధిరాములు(31) వన దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. చెక్ డ్యామ్‌లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు SI వెల్లడించారు. 

News March 27, 2024

జగిత్యాల: ఇనుపరాడ్డుతో తలపై దాడి.. భార్య మృతి

image

జగిత్యాల జిల్లా ఎడపల్లి మండలంలో దారణ ఘటన జరిగింది. మారేడుపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ పున్నంరెడ్డి, భార్య రజిత మంగళవారం గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన పున్నంరెడ్డి ఇనుప రాడుతో తలపై బలంగా కొట్టగా రజిత అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి పెద్దపల్లి సీఐ, బసంత్ నగర్ ఎస్ఐ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 27, 2024

MBNR: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు.. కీలక ఆదేశాలు జారీ!

image

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.రవి నాయక్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
✒పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు
✒స్థానిక ప్రజాప్రతినిధులు తమ గుర్తింపు కార్డు వెంట తీసుకువచ్చి ఓటు వెయ్యాలి
✒సైలెన్స్ పీరియడ్ పకడ్బందీగా అమలు
✒అన్ని రకాల ఎన్నికల ప్రచారాలకు బ్రేక్
✒పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు

News March 27, 2024

ఓయూలో దరఖాస్తుల ఆహ్వానం

image

ఓయూ క్యాంపస్‌లోని ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్‌లో వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ఛైర్‌పర్సన్ డాక్టర్ రమాప్రభ తెలిపారు. ఆరు వారాల న్యూస్ రీడింగ్, వాయిస్ ఓవర్, డబ్బింగ్, యాక్టింగ్ తదితర సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

యాదాద్రి: దారుణం.. రెండున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

image

యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం తెలియని రెండున్నరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లి పక్కన నిద్రిస్తున్న బాలికను తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ శివారులోని రసాయన పరిశ్రమలో ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 27, 2024

ఓయూలో దరఖాస్తుల ఆహ్వానం

image

ఓయూ క్యాంపస్‌లోని ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్‌లో వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ఛైర్‌పర్సన్ డాక్టర్ రమాప్రభ తెలిపారు. ఆరు వారాల న్యూస్ రీడింగ్, వాయిస్ ఓవర్, డబ్బింగ్, యాక్టింగ్ తదితర సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 27, 2024

బోథ్: ఐదేళ్లుగా కడుపులో.. అరుదైన ఆపరేషన్

image

బోథ్‌లోని ఓ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్ జరిగింది. ఉట్నూర్ మండలానికి చెందిన ఓ మహిళ గత 5ఏళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతుంది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ నిర్వహించి మూడు కిలోల కణితిని తొలిగించారు. డా. రవీంద్ర ప్రసాద్, శివ ప్రసాద్, సంతోష్ వైద్య బృందంతో ఆపరేషన్ నిర్వహించి మూడు కేజీల కణతిని తొలిగించినట్లు చెప్పారు. దీంతో వైద్యులు, సిబ్బందికి ఆమె కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.

News March 27, 2024

MBNR: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో గెలుపు ఎవరిది..?

image

ఉమ్మడి MBNR స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి, నవీన్ రెడ్డి ఇద్దరిలో గెలుపు ఎవరిది అనే చర్చ మొదలైంది. సంఖ్యా బలం ప్రకారం బీఆర్ఎస్ మెజార్టీ ఓట్లు ఉన్నప్పటికీ అధికార పార్టీ ఆ ఓట్లకు గండి కొట్టే ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులలో కలవరం మొదలైంది. ఇరు పార్టీల చెందిన ఓటరు గోవా తదితర ప్రాంతాల్లో క్యాంపు ఏర్పాటు చేశారు.