India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. జీడిమెట్ల PS పరిధి సుభాష్‌నగర్ శ్మశానవాటిక వద్ద జైలర్ (24) అనే బిహార్‌కు చెందిన యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. గుల్బర్గాకు చెందిన సలీం ఈ హత్య చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. జైనథ్ మండలం బెల్లూరికి చెందిన అశోక్, బాపురావు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని జందాపూర్ ఎక్స్ రోడ్ వద్ద మంగళవారం మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అశోక్ తలకు తీవ్ర గాయాలు కాగా, బాపురావుకు గాయాలయ్యాయి. వెంటనే వారిని 108 వాహన ఈఎంటీ కిషన్, పైలెట్ వసీంలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 5 లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్ కు రావచ్చని అంచనా వేసినట్లు తెలిపారు.
కారేపల్లి మండలం గిద్ద వారిగూడెం ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం క్షుద్ర పూజల కలకలం రేపింది. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ఆవరణలో ముగ్గులు వేసి కోళ్లతో పూజలు చేసినట్టు గ్రామస్తులు గుర్తించారు. ఉదయం పిల్లలను పాఠశాలకు తీసుకువచ్చిన తల్లిదండ్రులు పరిస్థితిని చూసి భయాందోళనకు గురైయ్యారు. ఇలా ఉంటే పిల్లలను పాఠశాలకు ఎలా పంపించాలి అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఉత్తర తెలంగాణకు కీలకమైన కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనపై శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ BRS, BJP అభ్యర్థులు ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేయలేదు. జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ స్థానాలున్న నిజామాబాద్‌లోనూ ఇదే పరిస్థితి. MP అభ్యర్థిగా ప్రవీణ్‌రెడ్డి, జీవన్‌రెడ్డి పేర్లు ప్రచారంలో ఉండగా వెలిచాల రాజేందర్‌రావు, తీన్మార్ మల్లన్న పేర్లు తెరపైకి రావడంతో కేడర్‌లో ఆయోమయం నెలకొంది.
BRS నాయకులు పంట నష్టం పై పరిశీలనకు వెళ్లడంపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పందించారు. BRS పాలనలో అనావృష్టి వల్ల ఆరుసార్లు పంట నష్టపోతే ఒక్కసారి కూడా పంట నష్టపరిహారం అందించలేదని విమర్శించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రైతుల వద్దకు వెళుతున్నారన్నారు. పంట నష్టం జరిగిన రైతులందరికీ పరిహారం చెల్లించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి ఎంపీడీవో కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్ పనులు పూర్తి చేయడానికి రూ.8 వేలు లంచంగా తీసుకున్న సీనియర్ అసిస్టెంట్ హరిబాబును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీనియర్ అసిస్టెంట్ పై కేసు నమోదు చేసి కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టుకు తరలించారు.
షాంపూ కోసం కన్నతల్లిని ఇటుకతో కొట్టి హత్య చేసిన సంఘటన మెదక్ మండలం రాజ్‌పల్లిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేవమ్మ(58)తో తన కుమరుడు నారాయణ షాంపూ విషయంలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో తల్లిని ఇటుకతో తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మెదక్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ త్వరలో నల్గొండకు రానున్నారు. నీళ్లు లేక ఎండిన పొలాలను పరిశీలించనున్నారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి పంటలను పరిశీలించి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంబంధిత నివేదికను KCRకు అందించారు. ఈ మేరకు జిల్లాలో పర్యటించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పార్టీ నాయకులకు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గోవాకు తరలిన వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్, బీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఈరోజు తిరుగు ముఖం పట్టినట్లు తెలుస్తోంది. వారికి హైదరాబాదుకు తరలిస్తారని సమాచారం. మార్చి 28న ఓటింగ్ సమయానికి వనపర్తికు తెచ్చే అవకాశం ఉంది. ఓటర్లను కాపాడుకునేందుకు ప్రధాన పార్టీలు క్యాంపులు ఏర్పాటు చేసిన సంగతి విధితమే.
Sorry, no posts matched your criteria.