India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ సీఎం KCR ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయ వేడి సెగ పుట్టిస్తోంది. BRS అధికారంలో ఉన్న దశాబ్దకాలంగా స్తబ్దుగా ఉన్న నేతలు ఇప్పుడు ఆ పార్టీ పీఠం కదలడంతో చోటుచేసుకున్న పరిణామాలతో వారిలో వేగంగా మార్పులు వచ్చాయి. గజ్వేల్ మాజీ MLA, కాంగ్రెస్ నేత తూంకుంట నర్సారెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ ఛైర్మన్, BRS నేత ప్రతాప్‌రెడ్డి నువ్వా నేనా అన్నట్లు ఉండడంపై స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది.
ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెంలోని మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులను పాఠశాల యజమాన్యం తమ ఇళ్లకు పంపించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏడుగురు సోమవారం అర్ధరాత్రి విద్యాలయలోని సీసీ కెమెరాల ధ్వంసానికి పాల్పడ్డారు. బయటి వారు చేశారని తొలుత పోలీసులను ఆశ్రయించామని, విద్యార్థులే అని తేలడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామన్నారు.
డోర్నకల్ నుంచి గద్వాల్ వరకు కొత్త రైల్వే మార్గానికి సూర్యాపేట జిల్లా మోతే మండలంలో సర్వే జరుగుతోంది. మండలంలోని కొత్తగూడెం, తుమ్మలపల్లిలో సర్వే బృందం మార్కింగ్ చేస్తున్నారు. సుమారు 296 కిలోమీటర్ల ఈ రైలు మార్గం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మోతే, చివ్వెంల, సూర్యాపేట, కేతేపల్లి, తిప్పర్తి, నల్గొండ, కనగల్, చండూరు, నాంపల్లి, చింతపల్లి మండలాల్లోని గ్రామాల నుంచి వెళ్లనుంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప పోరు రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నువ్వా.. నేనా.. అంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటాపోటీగా ఓటర్లను క్యాంప్‌లుగా తరలించడంతో రాజకీయాలు హీటెక్కాయి. BRS సిట్టింగ్ స్థానం కావడంతో ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా కాగా.. కాంగ్రెస్ సైతం పట్టు వదలకుండా పావులు కదుపుతోంది.
TB కేసులు గ్రేటర్ HYDలో పెరుగుతూనే ఉన్నాయి. 2023లో TGలో 73,212 మంది వ్యాధిగ్రస్థులను గుర్తించారు. ఇందులో 20 శాతం కేసులు HYDలోనే నమోదు కావడం ఆందోళనకరం. తర్వాతి స్థానంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కేసులు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాధితుల్లో 15 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్నవారే ఎక్కువని వెల్లడించారు. దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, రక్తంతో కూడిన దగ్గు వీటి లక్షణాలు. SHARE IT

HYD నగరంలోని అత్తాపూర్ సహా పలుకాలనీల్లో కిలో భారత్ అట్టా(గోధుమపిండి) రూ.27.5, కిలో భారత్ దాల్ (శనగపప్పు) రూ.60ను మొబైల్ వ్యాన్ల ద్వారా విక్రయిస్తున్నట్లు కేంద్రీయ బండార్ సమితి తెలిపింది. కోఠిలోని భారత్ బండార్‌లో సైతం విక్రయిస్తున్నట్లు తెలిపారు. FCI నుంచి 2000 టన్నుల బియ్యం కేటాయింపులు జరిగాయని, నగరంలో ఏప్రిల్ నుంచి కిలో భారత్ రైస్ రూ.29 విక్రయాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

HYD నగరంలోని BHEL సంస్థలో ఇంజనీరింగ్ పోస్టుల రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 31 వరకు edn.bhel.com వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. సీనియర్ ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం 33 ఖాళీలు ఉండగా.. పవర్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ సిస్టం, పవర్ మాడ్యూల్ నావెల్ బ్యాటరీ ప్యాకింగ్ విభాగాల్లో అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
GDWL: ఈనెల 26 నుంచి ఎస్సీ నిరుద్యోగులకు 3నెలల పాటు గ్రూప్స్ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించనున్నట్లు జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి శ్వేతా ప్రియదర్శిని తెలిపారు.30 బ్యాక్ లాగ్ అడ్మిషన్ల భర్తీకి ఆసక్తి గల అభ్యర్థులు గద్వాలలోని రెండో రైల్వేగేట్ సమీపంలోని టీటీఎన్ భవనం బీసీ స్టడీ సర్కిల్లో ఈనెల 28వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.