India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నగరంలోని BHEL సంస్థలో ఇంజనీరింగ్ పోస్టుల రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 31 వరకు edn.bhel.com వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. సీనియర్ ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం 33 ఖాళీలు ఉండగా.. పవర్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ సిస్టం, పవర్ మాడ్యూల్ నావెల్ బ్యాటరీ ప్యాకింగ్ విభాగాల్లో అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
GDWL: ఈనెల 26 నుంచి ఎస్సీ నిరుద్యోగులకు 3నెలల పాటు గ్రూప్స్ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించనున్నట్లు జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి శ్వేతా ప్రియదర్శిని తెలిపారు.30 బ్యాక్ లాగ్ అడ్మిషన్ల భర్తీకి ఆసక్తి గల అభ్యర్థులు గద్వాలలోని రెండో రైల్వేగేట్ సమీపంలోని టీటీఎన్ భవనం బీసీ స్టడీ సర్కిల్లో ఈనెల 28వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఈ మధ్యకాలంలో అమ్రాబాద్, కవ్వాల్, తాడ్వాయి, ఇల్లందు తదితర ప్రాంతాల్లో అటవీ ప్రమాదాలు జరుగుతున్నట్లు సమాచారం వచ్చిందని మంత్రి తెలిపారు. ఈ అటవీ ప్రమాదాల వల్ల వన్యప్రాణులతో పాటు విలువైన అటవీ సంపదకు ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉన్నందున అటవీశాఖతో పాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వేసవి మొదలైనప్పటి నుంచి వరుసగా జరుగుతున్న ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖను ఆదేశించారు.
HYD నగరంలోని BHEL సంస్థలో ఇంజనీరింగ్ పోస్టుల రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 31 వరకు edn.bhel.com వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. సీనియర్ ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం 33 ఖాళీలు ఉండగా.. పవర్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ సిస్టం, పవర్ మాడ్యూల్ నావెల్ బ్యాటరీ ప్యాకింగ్ విభాగాల్లో అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాల్లో ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగాలు సన్నద్ధమవుతున్నాయి. రైతులు ధాన్యం తీసుకువస్తే రెండు, మూడు రోజులు ముందుగానే కేంద్రాలు తెరవడానికి సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోళ్లపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేసింది.
హైదరాబాద్ ECIL గ్రేడ్-2 పోస్టులకు సంబంధించి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రిషన్, మెకానిస్ట్, ఫిట్టర్ విభాగంలో 30 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్‌లో అధికారులు స్పష్టం చేశారు. టెన్త్, ITI చేసినవారు అర్హులు. మిగతా వివరాలను www.ecil.co.in వెబ్‌సైట్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోండి. ఏప్రిల్ 13 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది.SHARE IT
షెడ్యూల్డ్ కులాల అధ్యయన కేంద్రం, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 100 మంది అభ్యర్థులకు 2నెలలపాటు ఉచిత వసతి భోజనంతో కూడిన DSC శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ జిల్లాశాఖ సంచాలకులు డాక్టర్ కె. జగన్ మోహన్ తెలిపారు. దరఖాస్తులను వెబ్సైట్ tsstudycircle.co.in రేపటి లోగా అప్లై చేసుకోవాలని సూచించారు.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ‘గృహజ్యోతి’కి అర్హులైన వేలాది మందికి ప్రస్తుతం జీరో బిల్లులు రావడం లేదు. ఇలాంటి వారంతా స్థానిక పురపాలక, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఆధార్, రేషన్, విద్యుత్తు బిల్లుకు సంబంధించి పత్రాలు అందజేస్తే పథకం వర్తింపజేస్తామని అధికారులు వెల్లడించారు. భద్రాద్రి జిల్లాలో 4,942, ఖమ్మం జిల్లాలో 3,568 మంది పథకానికి నోచుకోవడం లేదని తెలుస్తోంది.
హైదరాబాద్ ECIL గ్రేడ్-2 పోస్టులకు సంబంధించి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రిషన్, మెకానిస్ట్, ఫిట్టర్ విభాగంలో 30 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్‌లో అధికారులు స్పష్టం చేశారు. టెన్త్, ITI చేసినవారు అర్హులు. మిగతా వివరాలను www.ecil.co.in వెబ్‌సైట్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోండి. ఏప్రిల్ 13 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది.SHARE IT
ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ, తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ అధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులకు ఇస్తున్న 2 నెలల ఉచిత కోచింగ్ దరఖాస్తు గడువు నేటి ముగుస్తుందని ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి. నరేష్ తెలిపారు. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు చెందిన బీ.ఎడ్డీ లేదా డీ.ఎడ్‌తో పాటు టెట్ పాసైన ఎస్సీ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలన్నారు.
Sorry, no posts matched your criteria.