India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈనెల 30 వరకు గడువు పొడిగించినట్లు అధికారి ఫ్లోరెన్స్ రాణి తెలిపారు. ఆసక్తి ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోని ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న ఉదయం 11 గంటలకు నుంచి మ. 1గంట వరకు ఉంటుందని చెప్పారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సోమవారం తన అత్త, కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఝాన్సీ రెడ్డితో కలిసి హోలీ ఆడారు. ఈ సందర్భంగా అత్తా కోడళ్లు రంగులు పూసుకున్నారు. అనంతరం పాలకుర్తి ప్రజలకు ఎమ్మెల్యే హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
నారాయణపేటలో హోలీ పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. నీటి ట్యాంకు కూలి పడి సాయి ప్రణతి(13) అనే చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. స్థానిక గోపాల్‌పేట వీధిలో కామ దహనం చేసిన సందర్భంగా నీటి ట్యాంకు మంటల వేడికి గురి కాగా.. ట్యాంకు వద్ద నీటిని పట్టుకునేందుకు వెళ్లిన చిన్నారులపై ట్యాంకు కూలి పడటంతో ఘటన జరిగింది. చిన్నారి మృతితో పండగపూట విషాదఛాయలు అలుముకున్నాయి.
పెద్ద శంకరంపేట మండలం కొప్పల్ శ్రీ ఉమా సంగమేశ్వర ఆలయ సమీపంలో నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో నీట మునిగి గొర్రెల కాపరి చౌదరిపల్లి రాజు(32) మృతి చెందాడు. నాగల్‌గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామానికి చెందిన రాజు గొర్రెలు మేపడానికి నిన్న నిజాంసాగర్ వైపు వచ్చాడు. బ్యాక్ నీళ్లలో ఈత కోసం వెళ్లి గల్లంతయ్యాడు. ఈరోజు మృతుడి శవాన్ని బయటకు తీయగా.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆహార కల్తీలపై ఫిర్యాదులు సులభతరం చేసేందుకు GHMC అధికారులు టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీతో పాటు కల్తీ విషయమై గ్రేటర్ పరిధిలోని వినియోగదారులు 040-21111111 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ చేసిన తర్వాత రేటింగ్ ఇచ్చే ఆప్షన్ పక్కనే ఫిర్యాదు నంబర్‌తో పాటు ఫీడ్ బ్యాక్ బాక్స్ ఉండేలా కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చారు.

నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా హోళీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రాత్రి శాస్త్రోక్తంగా కామదహనం కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఉదయం నుండి పిల్లలు, పెద్దలు రంగులు చల్లుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ వేడుకలు జరుపుతున్నారు. అలాగే వివిధ సంఘాలు, యూనియన్ల ఆధ్వర్యంలో హోళీ సంబురాలు నిర్వహిస్తున్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని విశ్రాంత ఆర్మీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. HYD కుషాయిగూడ ఠాణా ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాలు.. మేడ్చల్ జిల్లా మేడిపల్లికి చెందిన బద్రి శివకోటయ్య(48) మాజీ సైనికోద్యోగి. ఆదివారం ద్విచక్ర వాహనంపై మౌలాలి పరిధి హెచ్‌బీ కాలనీ వద్దకు రాగానే వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం అతడిని ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. కేసు నమోదైంది.
పోలీసు డ్రెస్ వేసుకొని ఓ వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్న ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కడెం మండలంలోని కొండుకూరు గ్రామంలోని HP పెట్రోల్ బంకులో ఆదివారం రాత్రి కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగతనం చేసి అనంతరం లక్కీ దాబాలో దొంగతనానికి పాల్పడుతుండగా గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని విశ్రాంత ఆర్మీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. HYD కుషాయిగూడ ఠాణా ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాలు.. మేడ్చల్ జిల్లా మేడిపల్లికి చెందిన బద్రి శివకోటయ్య(48) మాజీ సైనికోద్యోగి. ఆదివారం ద్విచక్ర వాహనంపై మౌలాలి పరిధి హెచ్‌బీ కాలనీ వద్దకు రాగానే వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం అతడిని ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.