Telangana

News March 25, 2024

ఒకప్పటి నిజామాబాద్ కలెక్టర్..ఇప్పుడు MLA అభ్యర్థి

image

ఒకప్పుడు నిజామాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన దేవ వరప్రసాద్‌ ఈసారి ఏపీలో MLA అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దేవ వరప్రసాద్‌కు టికెట్ ఖరారు చేశారు. 2021లో జనసేన జనవాణి విభాగం కన్వీనర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. గతంలో పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరక్టర్, అబ్కారీ శాఖ డైరక్టర్‌గా ఆయన సేవలందించారు.

News March 25, 2024

NGKL: ఉపాధి కోసం వెళ్లి కొడుకును పొగొట్టుకున్నారు !

image

ఒంటిపై వేడినూనె పడి <<12918373>>చిన్నారి జయదేవ్‌<<>>(3) మృతి వెల్దండ మండలం బండోనిపల్లిలో విషాదం నింపింది. అర్జున్‌, శారదమ్మ దంపతులు జాతరల్లో స్వీట్లు, తినుబండారాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమనగల్లు వేంకటేశ్వరస్వామి జాతరలో స్వీట్లు విక్రయించేందుకు పిల్లలతో సహా వెళ్లారు. స్వీట్లు చేస్తుండగా జయదేవ్‌ ఒంటిపై నూనెపడి తీవ్ర గాయాలతో మృతిచెందాడు. కళ్లముందే చిన్నారి మృతితో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. 

News March 25, 2024

HYD: మల్లారెడ్డి మార్క్ చూయిస్తారా?

image

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా కాంగ్రెస్ గెలవదని, అన్నీ BRSయే గెలిచి చూపిస్తామని గతంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి అన్నారు. అన్నట్టుగానే మొత్తం 7 స్థానాల్లో BRSని గెలిపించి చూయించారు. మల్కాజిగిరి గడ్డ BRS అడ్డా అని చెబుతున్న ఆయన.. మరి పార్లమెంట్ ఎన్నికల్లో BRS అభ్యర్థిని గెలిపించి తన మార్క్ చూయిస్తారా లేదా చూడాలి. మీ కామెంట్?

మహబూబ్‌నగర్: రేపు పీయూలో ప్రపంచ సాహిత్యంపై కార్యశాల

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈనెల 26న ‘నాల్గో ప్రపంచ సాహిత్యం’ అనే అంశంపై అంతర్జాతీయ స్థాయిలో ఒకరోజు కార్యశాల నిర్వహిస్తున్నట్లు పీయూ ఆంగ్ల విభాగాధిపతి డా. మాళవి తెలిపారు. మంగళవారం అకాడమిక్ బ్లాక్ ఆడిటోరియంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి పీయూ పరిధిలోని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న స్కాలర్స్, అధ్యాప కులు, వివిధ విభాగాధిపతులు హాజరుకావాలని కోరారు.

News March 25, 2024

బూర్గంపాడు: గంజాయి మత్తులో స్థానికులపై వలస కూలీల దాడి

image

సారపాక సుందరయ్యనగర్‌ వాసులపై బిహార్‌ నుంచి వలస వచ్చిన కూలీలు గంజాయి మత్తులో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకోగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బిహార్‌‌కు చెందిన ఐదుగురు కూలీలు గంజాయి మత్తులో స్థానికులతో గొడవకు దిగారు. గొడవ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించడంతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మల్లికార్జున్‌, సాయితో పాటు కాటమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 25, 2024

నేటి నుంచి కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. జిల్లా నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించామని ఆలయ ఈఓ శేషగిరి తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 60 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ 250 మంది పోలీసులతో కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

News March 25, 2024

HYD: శ్వేత అంత్యక్రియలు పూర్తి

image

ఇటీవల ఆస్ట్రేలియాలో హత్యకు గురైన హైదరాబాద్ మహిళ శ్వేత అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. ఆస్ట్రేలియా నుంచి నగరానికి చేరుకున్న శ్వేత మృతదేహాన్ని ఏఎస్‌రావు నగర్ డివిజన్ బృందావన్ కాలనీలోని ఆమె తల్లిదండ్రులను నివాసానికి తరలించారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మల్లాపూర్‌లోని వైకుంఠధామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.

HYD: ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: సజ్జనార్

image

డ్రగ్స్ పార్శిళ్లు వచ్చాయని సైబర్ నేరగాళ్లు పోలీసుల తరహాలో మాట్లాడుతూ మోసగిస్తున్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు సూచిస్తూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ X వేదికగా పలు సూచనలు చేశారు. డ్రగ్స్ పార్శిళ్లు వచ్చాయని ఫోన్ కాల్స్, ఐవీఆర్ కాల్స్ వస్తే స్పందించొద్దని సజ్జనార్ సూచించారు. ఒకవేళ ఇలాంటి ఉదంతాల్లో మోసపోతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. కాగా HYDలో ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి.