India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం HYD విద్యానగర్‌లో ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని ఆయన కోరారు. గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, గవ్వల భరత్ పాల్గొన్నారు.

షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద పోలీ దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టారు. RTC బస్సులో ఏలాంటి పత్రాలు లేకుండా ఓ వ్యక్తి రూ.16,50 లక్షల నగదు, వెండి తరలిస్తుండగా సీజ్ చేశారు. వనపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో జయదేవ్ అనే యువకుడు అక్రమంగా తరలిస్తున్న నగదు వెండిని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో యాసంగి సీజన్‌లో ప్రధానంగా వరి, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న తదితర పంటలు సాగు చేశారు. మొత్తం 8,04,641 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా అందులో 5,34,150 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారులు చెబుతున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో నీరందక సుమారు 88,752 ఎకరాల్లో వరి, 2,605 ఎకరాల్లో వేరుశనగ, మొక్కజొన్న, మొత్తం 91,357 ఎకరాల్లో పంటలు ఎండినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అశ్వరావుపేట మండలం రామచంద్రపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నగొలుసుపాటి అంజిమూర్తిని గుర్తుతెలియని వాహనం ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది ఏలూరు జిల్లా తడికలపూడి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పొలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరులో నిన్న, ఈరోజు నిర్వహించిన 8వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాప్ట్ బాల్ బాలుర చాంపియన్షిప్‌లో మెదక్ జిల్లా బాలుర జట్టు రజత పథకం సాధించినట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు కోడిప్యాక నారాయణ గుప్త తెలిపారు. జిల్లా జట్టులో శ్రీరామ్ చాంపియన్షిప్ ఉత్తమ క్యాచర్ అవార్డ్ లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జట్టును అజయ్ కుమార్ గౌడ్, శ్యామ్ సుందర్ శర్మ అభినందించారు.
HYD ఎంపీ పరిధిలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పుర, మలక్‌పేట, కార్వాన్ శాసనసభ నియోజకవర్గాల్లో అధికంగా మైనార్టీ ఓటర్లు ఉంటారు. దీనికి తగ్గట్టే 1984 నుంచి ఎంఐఎం నేత సుల్తాన్ సలాఉద్దీన్ ఒవైసీ గెలవగా ఆ తర్వాత అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధిస్తూ వస్తున్నారు. దీంతో ఇతర పార్టీల అభ్యర్థులు నామమాత్రంగానే మిగిలిపోతున్నారు. ఈసారి కూడా అసదుద్దీన్ గెలుస్తారని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి.

నిజామాబాద్ నగరంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మేరకు ఆదివారం ఇంద్రపూర్ సమీపంలోని ప్రైవేటు ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ మరమ్మతు కేంద్రానికి చుట్టు పక్కల ఇళ్లు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎండ తీవ్రతకు 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతల కారణంగా అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. గత 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా నమోదైన కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అచ్చంపేట మండలం అయినోలులో 40.7 డిగ్రీలు నమోదు కాగా, బిజినేపల్లి మండలంలో 40.5 నమోదయ్యాయి.
Sorry, no posts matched your criteria.