India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలోని వివిధ మెట్రో స్టేషన్లలో టాయిలెట్ల వినియోగానికి ఛార్జీలు వసూలు చేస్తుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. మెట్రో స్టేషన్లలో టాయిలెట్‌ను ఉపయోగించుకునేందుకు డబ్బులు వసూలు చేయడం ఆపి వేయాలని, ఉచితంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పరిశీలించి మెట్రో ప్రయాణికులందరికీ మేలు చేసే నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
HYDలోని వివిధ మెట్రో స్టేషన్లలో టాయిలెట్ల వినియోగానికి ఛార్జీలు వసూలు చేస్తుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. మెట్రో స్టేషన్లలో టాయిలెట్‌ను ఉపయోగించుకునేందుకు డబ్బులు వసూలు చేయడం ఆపి వేయాలని, ఉచితంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పరిశీలించి మెట్రో ప్రయాణికులందరికీ మేలు చేసే నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
పొంగులేటిపై అభిమానాన్ని ఓ వ్యక్తి వినూత్నంగా చాటారు. ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళపాడుకు చెందిన గంధసిరి సత్తయ్య తన కుమారుడి పెళ్లి పత్రికపై పొంగులేటి దంపతుల ఫొటోను ముద్రించారు. దీంతో ఈ వెడ్డింగ్ కార్డు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రజలు రేపు హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, వాహనాలపై రంగులు చల్లకూడదన్నారు. న్యూసెన్స్ చేస్తే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వైన్స్, బార్లు, పబ్ లు, కల్లు కంపౌండ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
జగిత్యాల జిల్లాలో మైనర్ బాలికకు గంజాయి అలవాటు చేసి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. సదరు బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గంజాయి ఇచ్చి ఏడాదిగా అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని, వారిపై పోక్సోతో పాటు NDPS ACT కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
మాగనూర్ మండలం వడ్వాట్ గ్రామ సమీపంలో ని బసవేశ్వర కాటన్ మిల్లులో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. పక్కన ఉన్న రైస్ మిల్లు కార్మికులు గమనించి యజమానికి, పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటలను అర్పివేశారు. షాట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ప్రమాదంలో సుమారు 8 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు మిల్లు యజమాని తెలిపారు.
ఎన్నికల నియమావళి లో భాగంగా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి ధ్రువపత్రాలు లేని రెండు లక్షల నగదును ఆదివారం అధికారులు సీజ్ చేశారు. మహారాష్ట్ర కు చెందిన ఓ కారును ఎన్నికల సిబ్బంది తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో రూరల్ సీఐ ఫణిందర్, తలమడుగు ఎస్ఐ ధనశ్రీ, ఎస్ఎస్‌టీ సభ్యులు తదితరులు ఉన్నారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం రామగిరిలో వింత గుడ్లగూబ ప్రత్యక్షమైంది. దీనిని బార్ను గుడ్లగూబ అంటారని, ఇది ఎడారి ప్రాంతాలు హిమాలయాలకు ఉత్తరాన ఉన్న ఆసియా, ఇండోనేషియాలోని కొన్ని దీపాలలో మాత్రమే కనిపిస్తాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. దాని ముఖం మనిషి పోలిక ఆకారంతో ఉండడంతో దీన్ని చూసేందుకు స్థానిక ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
ఈనెల 28న జరగనున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపుపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఇప్పటికే ఇరు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు MPTCలు, ZPTCలు, మున్సిపల్ కౌన్సిలర్లను క్యాంపులకు తరలించారు. గత పదేళ్ల BRS పాలనపై వ్యతిరేకతతో కాంగ్రెస్‌కే ఓటు వేస్తారని ఆ పార్టీకి చెందిన నాయకులు ధీమాతో ఉన్నారు. BRS నాయకులు సైతం గెలుపు మాదే అని చెబుతున్నారు.
ఖమ్మం రామన్నపేట కాలనీలో దారుణం జరిగింది. గంజాయి, మద్యం మత్తుకు బానిసైన కొడుకు తల్లిని కిరాతకంగా హతమార్చాడు. మృతురాలు గౌరీపెద్ది రామలక్ష్మి(మీరాబి) వికలాంగురాలు. ఆమెకు ఓ కొడుకు, ఓ కూతురు ఉన్నారు. తల్లిని కర్రతో తలపై బాధడంతో మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Sorry, no posts matched your criteria.