Telangana

News March 23, 2024

నల్గొండ: కాంగ్రెస్ ఖాతాలోకి రెండు మున్సిపాలిటీలు

image

కాంగ్రెస్ ఖాతాలో రెండు మున్సిపాలిటీలు చేరాయి. నల్గొండ జిల్లాలోని హాలియా, నందిగొండ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. ఆయా చోట్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్లపై అవిశ్వాసం నెగ్గడంతో శుక్రవారం నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించారు. రెండు చోట్లా కాంగ్రెస్ మద్దతుదారులే పదవులు దక్కించుకున్నారు. హాలియా నూతన ఛైర్ పర్సన్‌గా యడవెల్లి అనుపమా, నందిగొండ ఛైర్ పర్సన్‌గా అన్నపూర్ణ ఎన్నికయ్యారు.

News March 23, 2024

ఉమ్మడి వరంగల్‌లో వరుస ACB దాడులు

image

ACB దాడులతో ఉమ్మడి WGL జిల్లాలోని అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి. లంచం తీసుకుంటుండగా ముగ్గురు అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడగా.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తహశీల్దారును అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు, తొలిసారిగా KUలో ఉద్యోగిని పట్టుకున్నారు. శుక్రవారం MHBD జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ తస్లీమా లంచం తీసుకుంటూ దొరికిన విషయం తెలిసిందే.

News March 23, 2024

కరీంనగర్: ఇంకా 9 రోజులే గడువు

image

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను, ఇతర పన్నుల రాయితీ చెల్లింపు మార్చి 31 వరకు మాత్రమే గడువు మిగిలి ఉంది. ఉమ్మడి KNR జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలలో ఇప్పటివరకు సగం వాటిలో 80% వరకు పన్ను వసూళ్లు జరిగాయి. ప్రభుత్వం ప్రకటించిన 90 వడ్డీ రాయితీతో చాలామంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్నులు చెల్లిస్తున్నారు. KNR నగరంలో ఇటీవల ఓ వ్యక్తి 24 ఏళ్ల పెండింగ్ బకాయిలు చెల్లించారు.

News March 23, 2024

NZB: నిద్రలోనే గుండెపోటుతో భక్తుడు మృతి

image

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట గ్రామానికి చెందిన రటపు నరహరి (55) అనే వ్యక్తి దైవ దర్శనానికి వచ్చి శుక్రవారం రాత్రి స్థానిక మంగళ ఘాట్ వద్ద నిద్రిస్తుండగా, గుండెపోటుతో నిద్రలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ధర్మపురి ఎస్సై తెలిపారు.

News March 23, 2024

HYD: Holi ఆడుతున్నారా.. జాగ్రత్త..!

image

ఈ నెల 25న హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని HYDలోని 3 కమిషనరేట్ల పరిధి పోలీసులు సూచిస్తున్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, వాహనాలపై రంగులు చల్లకూడదని పేర్కొన్నారు. న్యూసెన్స్‌ చేస్తే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వైన్స్, బార్లు, పబ్‌లు, కల్లు కంపౌండ్‌లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. SHARE IT

News March 23, 2024

HYD: Holi ఆడుతున్నారా.. జాగ్రత్త..!

image

ఈ నెల 25న హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని HYDలోని 3 కమిషనరేట్ల పరిధి పోలీసులు సూచిస్తున్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, వాహనాలపై రంగులు చల్లకూడదని పేర్కొన్నారు. న్యూసెన్స్‌ చేస్తే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వైన్స్, బార్లు, పబ్‌లు, కల్లు కంపౌండ్‌లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
SHARE IT

News March 23, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లో కారు ఖాళీ..!

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో BRS ప్రజాప్రతినిధులు, నాయకులు ఒక్కొక్కరు ‘కారు’ దిగుతుండటంతో ఆ ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కొనసాగేలా కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు, ప్రధాన నాయకులు, ఆదిలాబాద్ జడ్పీ, డీసీసీబీ ఛైర్మన్‌లు ఇటీవల కారు దిగారు. ఇక నేడో రేపో మాజీ మంత్రి ఐకె రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరనున్నారు. దింతో ఉమ్మడి జిల్లాలో దాదాపు కారు ఖాళీ అవుతున్నట్లు కనిపిస్తుంది.

News March 23, 2024

ఖమ్మం: ‘ఎన్నికల తర్వాత నోటిఫికేషన్ ఇస్తాం’

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 101 వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని, ఒక్క రోజే గడువు కారణంగా దరఖాస్తులు పూర్తి స్థాయిలో రాలేదని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. కలెక్టర్ సూచన మేరకు 15లోగానే నియామకాలు చేపట్టామని, ఇప్పటికే 38మందిని ఎంపిక చేశామని, ఎన్నికల తర్వాత మరోమారు నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలకు వైద్యులను భర్తీ చేస్తామని తెలిపారు.

News March 23, 2024

నిర్మల్: ఎన్నికల కోడ్.. నగదు పట్టివేత

image

నిర్మల్ పట్టణంలోని వివేక్ చౌక్ వద్ద శుక్రవారం రాత్రి పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నిర్మల్ పట్టణానికి చెందిన వంశీ అనే వ్యక్తి బైక్ తనిఖీ చేయగా అతని వద్ద రూ. 2 లక్షల నగదు లభించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవటంతో నగదును స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ అనిల్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పెద్ద మెుత్తంలో నగదును తరలించరాదని తెలిపారు.

News March 23, 2024

ఖమ్మంలో రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం 

image

ఖమ్మం రైల్వే స్టేషన్ నర్తకి థియేటర్ సమీపంలో రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతుడి వయస్సు 25 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సామాజిక కార్యకర్త అన్నం శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని శరీర భాగాలు ఒకచోట చేర్చి మార్చురీకి తరలించారు. మృతుడి చేతికి రాగి కడియం  ఉంది.