India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ పార్లమెంట్ సీటు పరిధిలో 18.16 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో 8,91,969 మంది పురుషులు, 9,24,250 మంది మహిళలు, థర్డ్ జెండర్లు 395 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందున 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.
రజాకార్ సినిమా యూనిట్ బుధవారం రాత్రి సిద్దిపేటలో సందడి చేసింది. జిల్లా కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి రజాకర్ సినిమాలో చాకలి ఐలమ్మగా కనిపించిన హీరోయిన్ ఇంద్రజ ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇంద్రజ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ వీరనారి అని కీర్తించారు. కార్యక్రమంలో నటీనటులు మకరంద దేశ్పాండే, రాజు, అర్జున్, తేజ్, వేదిక పాల్గొన్నారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.20,100 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,450 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర స్థిరంగా కొనసాగుతుండగా, పత్తి ధర మాత్రం రూ.100 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్‌కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
బీబీనగర్ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు రైల్వే ఎస్సై సత్యనారాయణ తెలిపారు. కిలోమీటర్ నెంబర్ 227/ 3-5 వద్ద ఎగువ లైన్లో 40 ఏళ్ల వయసు గల మహిళ రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. మృతురాలు తెలుపు రంగు చీర, పసుపుపచ్చ జాకెట్ ధరించారని వెల్లడించారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రిలో భద్రపరిచామని తెలిపారు.
ఉమ్మడి జిల్లాలోని మూడు పురపాలికల్లో భూగర్భ మురుగునీటి పైపులైన్లు ఏర్పాటు చేయనున్నారు. నల్లగొండ జిల్లాలో 9, సూర్యాపేట జిల్లాలో 5, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు పురపాలక సంఘాల్లో భూగర్భ మురుగునీటి పైప్ లైన్లు ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఆయా మున్సిపాలిటీల్లో భూగర్భ మురుగునీటి పైపులైన్ల నిర్మాణ పనులను రెండేళ్లలో పూర్తి చేయనున్నారు.
మెదక్-ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాదిన్నర వ్యవధిలో 14 మంది దుర్మరణం చెందారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించాలని రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు ప్యాకేజీలుగా పనులు చేస్తున్నా, పనులు నెమ్మదిగా సాగడంతో పలు సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
అమ్రాబాద్ మండలానికి చెందిన ఎల్కచేను నీలమ్మ, నాగయ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారైన స్వామి బుధవారం ఉదయం వ్యవసాయ పొలంలో టేకు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని గ్రామస్థులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అమ్రాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పెద్దపల్లి కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిని నేడు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌ను ప్రకటించగా.. BJP అభ్యర్థిగా గోమాసే శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఇక్కడ బలమైన నాయకుడిని బరిలో నిలపాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీంతో తమ పార్టీ అభ్యర్థి ఎవరోనని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారో కామెంట్ చేయండి.
హమాలీ గుమస్తాల సంఘం విజ్ఞప్తి మేరకు వరంగల్ ఎనుమాముల మార్కెట్ బుధవారం బంద్ ఉండగా ఈరోజు ప్రారంభమైంది. నేడు మార్కెట్‌కు పత్తి తరలి రాగా.. ధర మొన్నటి కంటే రూ.15 పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,300 పలకగా.. ఈరోజు రూ.7,315 పలికింది. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
పెండింగులో ఉన్న ప్రభుత్వ పాఠశాలల కుట్టు కూలీ బకాయి నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున కుట్టిన దర్జీల ఛార్జీల చెల్లింపు కోసం ఆరు నెలలుగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 2,11,932 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.2.11 కోట్లను విడుదల చేసింది.
Sorry, no posts matched your criteria.