Telangana

News March 19, 2024

NLG: తొలిరోజు 151 మంది గైర్హాజరు

image

పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 109 కేంద్రాల్లో తొలిరోజు తెలుగు పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 19, 326 మంది విద్యార్థులకు గాను 19, 175 మంది పరీక్షకు హాజరయ్యారు. 151 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ హరిచందన జిల్లా కేంద్రంలోని డైట్ ప్రభుత్వ పాఠశాలతో పాటు దేవరకొండ రోడ్డులోని సెయింట్ ఆల్ఫోన్సెస్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

News March 19, 2024

ఇంద్రవెల్లి: గొంతు తడవాలంటే 2KM వెళ్లాల్సిందే..!

image

ఇంద్రవెల్లి మండలం సాలెగూడ గ్రామస్థులకు తాగు నీరు లేక అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో గిరిజనులు గ్రామంలో ప్రతీ ఇంటి ముందు డ్రమ్ములతో కూడిన ఎడ్లబండ్లే దర్శనమిస్తున్నాయి. నీళ్లు కావాలంటే బండి కట్టాల్సిందేనని.. రోజూ సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని పంట చేల వద్దకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం పనులు సైతం వదులుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.

News March 19, 2024

నిజామాబాద్‌లో ఈ నంబర్‌కు రూ. లక్ష..!

image

నిజామాబాద్, బోధన్, ఆర్మూర్‌లో రవాణాశాఖ కార్యాలయాల్లో ఫ్యాన్సీ నంబర్లకు ఆన్‌లైన్‌లో బిడ్డింగ్ నిర్వహించారు. దీంతో రూ.9,69,872 ఆదాయం వచ్చింది. NZBకు టీజీ 16 0001, ఆర్మూర్‌కు టీజీ 16 ఏ 0001, బోధన్‌కు టీజీ 16B 0001 నంబర్లను కేటాయించారు. ఇందులో టీజీ 16A 0001 నంబర్ కోసం ఓ వాహనదారుడు రూ.లక్ష చెల్లించాడు. టీజీ 16 0789కు రూ.52,665, టీజీ 16 0001కు రూ.50 వేలు, టీజీ 16B 0333 నంబర్ రూ. 30వేల ధర పలికింది.

News March 19, 2024

మ్యాడంపల్లిలో మహిళ అనుమానాస్పద మృతి

image

జగిత్యాల జిల్లా మాల్యాల మండలం మ్యాడంపల్లి శివారులో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. గ్రామశివారులోని చెట్లపొదల్లో మహిళ చనిపోయి పడి ఉండటంతో అటుగా వెళ్లిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి సీఐ నీలం రవి సిబ్బందితో చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2024

HNK: నా చావుకు వైద్యుడు కారణం.. యువకుడి SUICIDE నోట్

image

వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే తాను చనిపోతున్నానని ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన HNK జిల్లాలో చోటుచేసుకుంది. KU SI రాజ్‌కుమార్ వివరాల ప్రకారం.. పలివేల్పులకు చెందిన దేవేందర్(28) మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఓ వైద్యుడిని గతేడాది సంప్రదించగా.. తానిచ్చిన మందులు 6 నెలలు వాడినా తగ్గలేదు. దీంతో సర్జరీ చేశారు. అయినా తగ్గకపోవడంతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

News March 19, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు!

image

✔నేడు పలు రైతు వేదికల్లో దృశ్య శ్రవణ ప్రసారం
✔పలు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల పర్యటన
✔WNPT:ఎన్నికల కోడ్..246 నియామకాలకు బ్రేక్
✔ELECTION-EFFECT..ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో ఫోకస్
✔ఉమ్మడి జిల్లాలో ఓటు శాతం పెంచేందుకు అధికారుల నజర్
✔పలుచోట్ల కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్
✔ఉపాధి హామీ పనులపై సమీక్ష
✔ రంజాన్ వేళలు:-
ఇఫ్తార్(మంగళ)-6:34,సహార్(బుధ)-5:01
✔NGKL:నేడు కాంగ్రెస్ అభ్యర్థిపై స్పష్టత

News March 19, 2024

పొంగులేటి ప్రధాన అనుచరుడికి చుక్కెదురు..!

image

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడికి చుక్కెదురైంది. ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్ పోస్టుల్లో వైరాకు చెందిన బొర్రా రాజశేఖర్‌కు అవకాశం లభించలేదు. శ్రీనివాసరెడ్డి 2013లో వైసీపీలో చేరినప్పటి నుంచి అతని అనుచరుడుగా కొనసాగుతున్నారు. కార్పొరేషన్ పోస్టుల్లో అవకాశం లభిస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆయనకు కార్పొరేషన్ పదవి లభించపోవడం వైరా కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశనే మిగిల్చింది.

News March 19, 2024

మెదక్‌: విషాదం.. చేపల వేటకు వెళ్లి మృతి

image

మెదక్ జిల్లా నార్సింగి మండలం సంకాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బీరయ్య అనే వ్యక్తి మరికొందరితో కలిసి మైసమ్మ కుంట చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలికి వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

నల్గొండ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి హత్య

image

గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసి వ్యవసాయ బావిలో పడవేశారు. ఈ ఘటన తిప్పర్తి మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లి శివారులో వెలుగు చూసింది. అనిశెట్టి దుప్పలపల్లి శివారులో సక్కుబాయికి చెందిన వ్యవసాయ భూమిని పవన్ కౌలు చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం బోరు బావిలో పరిశీలిస్తుండగా నీటిపై మృతదేహం తెలియాడడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.

News March 19, 2024

పదో తరగతి విద్యార్థులను డిబార్ చేసిన జాయింట్ కలెక్టర్

image

WNPT: పదో తరగతి తొలి పరీక్షలో మాస్ కాపీయింగ్ కు పాల్పడిన ఇద్దరు విద్యార్థినులు డీబార్ కావడం ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. శ్రీరంగాపురం ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని జేడీ వెంకటనర్సమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను తనిఖీచేసే క్రమంలో ఇద్దరి వద్ద చిట్టీలు ఉండటంతో డీబార్ చేయాలని డీఈఓకు  ఆదేశాలు జారీ చేశారు. మాస్ కాపీయింగ్ పై చీఫ్ సూపరింటెండెంట్ వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు.