India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకుంటూ ఓ కుమారుడు పదవ తరగతి పరీక్ష రాసిన ఘటన కల్లూరులో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరాంపురం గ్రామానికి చెందిన మారబోయిన అఖిల్ పదో తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. సోమవారం పదవ తరగతి పరీక్ష ఉండడంతో కుటుంబ సభ్యులు మనోధైర్యం నింపి పరీక్షకు పంపించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ BJPలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని బీజేపీ నాయకురాలు DK అరుణ స్పష్టం చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. BJPకి ప్రజలలో ఉన్న ఆదరణను ఓర్వలేక ప్రతిపక్ష పార్టీల నాయకులు కావాలని, ప్రజలను తప్పుదోవ పట్టించాలని అసత్యం ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ మమ్మల్ని సంప్రదించలేదని పేర్కొన్నారు.
విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన బీబీనగర్ మండల పరిధిలోని పెద్దపలువు తండాలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బిచ్యా అనే రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన పొలంవద్ద బోర్ మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ గురైయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మంచిర్యాలలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ATMలో ఆదివారం రాత్రి చోరీకి యత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ATMను పగులగొట్టి చోరీకి యత్నిస్తున్న శబ్దాలు విని అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు వచ్చి వివరాలు అడగగా బ్యాగ్ అక్కడే వదిలి పారిపోయినట్లు CI బన్సీలాల్ తెలిపారు. సోమవారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన గౌరవం మిశ్రాను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి మిక్కిలినేని మను చౌదరి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చాయన్నారు. ఎన్నికల ప్రక్రియలో వివిధ అనుమతులను సువిధ యాప్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు.
నిజామాబాద్‌లోని వెంగళరావు నగర్ సమీపంలో ఉన్న బాబన్ షాబ్ చెరువులో సోమవారం రెండు మృత దేహాలు లభ్యమయ్యాయి. భార్యాభర్తల మృతదేహాలను గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అమృతపూర్ గ్రామానికి చెందిన పెద్ద బాబయ్య, పోశమ్మగా గుర్తించారు. వారు స్థానిక దర్గా వద్ద ఉంటూ బిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దూల్మిట్ట మండలంలో జరిగింది. మద్దూరు ఎస్సై షేక్ యూనస్ అహ్మద్ అలీ తెలిపిన వివరిలిలా.. కూటిగల్ గ్రామానికి చెందిన తిగుళ్ల రమేశ్ (21) జీవితంపై విరక్తి చెంది వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానాకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఆయన తెలిపారు.
సిగరెట్ కోసం ఇద్దరు స్నేహితులు గొడవపడి ఒకరు మృతి చెందిన సంఘటన సోమవారం కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ కథనం ప్రకారం బిహార్‌కు చెందిన అంకిత్, రోషన్ గ్రామ సమీపంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. సిగరెట్ కోసం రోషన్ అంకిత్ మధ్య గొడవ జరిగింది. దీంతో రోషన్(21)ను భవనం పైనుంచి కిందకు తోశారని వెల్లడించారు. తీవ్ర గాయాలైన రోషన్ ఆసుపత్రికి తరలించేలోపే మరణించారన్నారు.
హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. లింగంపల్లి, BHEL, చందానగర్, గచ్చిబౌలితో పాటు.. పలు ప్రాంతాల్లో కురిసింది. మీ ప్రాంతంలో కూడా వర్షం ఉంటే కామెంట్‌లో తెలపండి.
హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. లింగంపల్లి, BHEL, చందానగర్, గచ్చిబౌలితో పాటు.. పలు ప్రాంతాల్లో కురిసింది. మీ ప్రాంతంలో కూడా వర్షం ఉంటే కామెంట్‌లో తెలపండి.
Sorry, no posts matched your criteria.