Telangana

News March 18, 2024

నిరాధార, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

నిరాధార, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ విపి. గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ అభ్యర్థులకు HYD స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్స్ లో 2 నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ పేరా సోషల్ మీడియాలో ట్రోల్ అయిన వార్తలో నిజం లేదన్నారు. నిరాధార, తప్పుడువార్తలు ట్రోల్ చేస్తే ఉపేక్షించేది లేదన్నారు.

News March 18, 2024

రూ.5.73 కోట్ల విలువగల బంగారం పట్టివేత: ఎస్పీ 

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ముమ్మర తనిఖీలు చేపట్టిందని జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ఈరోజు మిర్యాలగూడలోని ఈదులగూడ చౌరస్తా వద్ద డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు వెళ్తున్న  బొలెరో వాహనం ఆపి తనిఖీ చేయగా.. రూ.5.73 కోట్ల బంగారం పట్టుకున్నట్లు తెలిపారు. 

News March 18, 2024

మెదక్: ప్రజావాణిలో 73 వినతులు

image

సమస్యల పరిష్కారానికి నేరుగా ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి చెప్పుకోవాలని అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి 73 ఆర్జీలు వచ్చినట్టు వివరించారు. ప్రతి సోమవారం ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చెప్పుకోవాలన్నారు. కానీ ఇతరుల మీద ఆధారపడరాదని సూచించారు.

News March 18, 2024

మిర్యాలగూడ పోయింది.. భువనగిరి వచ్చింది..

image

గతంలోని ఉమ్మడి జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ లోక్‌సభ స్థానాలు ఉండగా.. 2008పునర్విభజనలో మిర్యాలగూడ రద్దయ్యింది. కొత్తగా భువనగిరి నియోజకవర్గం ఏర్పడింది. ఈలోక్‌సభ స్థానం పరిధిలో మునుగోడు, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్‌, భువనగిరి నియోజకవర్గాలతో పాటు పొరుగు జిల్లాల్లోని జనగామ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలున్నాయి. నల్గొండ పరిధిలో నల్గొండ, దేవరకొండ, సాగర్‌, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ, సూర్యాపేట ఉన్నాయి.

News March 18, 2024

దోమకొండ: ఆరోగ్య శాఖ మంత్రికి షబ్బీర్ అలీ వినతి

image

దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల నుంచి 100 పడకలకు మార్చాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహను కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారని షబ్బీర్ అలీ తెలిపారు. వంద పడకల ఆసుపత్రిగా మార్చితే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని స్థానిక నాయకులు పేర్కొన్నారు.

News March 18, 2024

HYD: ఢీకొట్టిన ట్రైన్.. కాళ్లు తెగి వ్యక్తి మృతి

image

రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు.. HYD అల్వాల్‌లో నివాసం ఉండే కే.దుర్గయ్య(41) డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో సనత్‌నగర్-అమ్ముగూడ రైల్వేస్టేషన్ల మధ్య అతడు పట్టాలు దాటుతుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ప్రమాదంలో అతడి రెండు కాళ్లు తెగి, చికిత్స పొందుతూ మరణించాడు.

డీసీఎం- బైక్ ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

image

కల్లూరు మండల కేంద్రంలోని ఎన్ఎస్పీ డీఈ కార్యాలయం ఎదుట సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను బైక్‌‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 18, 2024

UPDATE.. బెంగళూరు నుంచి కాశీకి వెళ్తుండగా ప్రమాదం

image

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ జాతీయ రహదారిపై MSN పరిశ్రమ ముందు మారుతి ఈకో వ్యాన్ అదుపుతప్పి పక్కన చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా బెంగళూరు నుంచి కాశీకి వెళ్తున్నట్లు సమాచారం.