Telangana

News September 3, 2024

HYD: రోడ్లన్నీ గోతులే.. రోజుకు వేలల్లో ఫిర్యాదులు

image

వర్షానికి నగరంలోని రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. సీసీ రోడ్లు, బీటీ రోడ్లని తేడాలేకుండా గుంతలుపడి నీళ్లు నిలిచాయి. మ్యాన్‌హోళ్ల మరమ్మతులు లేక రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. మహానగంలో ఉమ్మడి జిల్లాను కలుపుతూ 10వేల కి.మీ.ల రోడ్లుంటే అందులో 885 కి.మీ. ప్రధాన రహదారులు నిర్వహణ బాధ్యత ప్రైవేట్ సంస్థలది. వీటిపై అధికారులు పర్యవేక్షణను గాలికొదిలేశారు. బల్దియాకు రోజుకు 1000కిపైగా రహదారులపై కంప్లెంట్స్ వస్తున్నాయి.

News September 3, 2024

తిమ్మాపూర్: ఎల్ఎండీకి భారీగా వరద నీరు

image

వర్షాలకు ఎల్ఎండీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఆదివారం నుంచి మోయతుమ్మెద వాగు ద్వారా జలాశయంలోకి నీరు భారీగా వస్తోంది. దీంతో అధికారులు మధ్యమానేరు జలాశయం నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. మధ్యమానేరు నుంచి ఎల్ఎండీకి సుమారు 8టీఎంసీల నీరు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికి వాగు ద్వారా 7600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో జలాశయంలోకి వస్తుంది. ప్రస్తుతం 15.584 టీఎంసీల నీరున్నట్లు అధికారులు తెలిపారు.

News September 3, 2024

MBNR: వరద బీభత్సం..

image

మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి, జొన్న, మొక్కజొన్న పంటలు నీట మునిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 622, నారాయణపేట జిల్లాలో 3,020, నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,202, గద్వాల జిల్లాలో 170 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వనపర్తి జిల్లాలో 230 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పత్తి, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు నీట మునిగినట్లు గుర్తించారు.

News September 3, 2024

అశ్విని కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం

image

నేడు MHBD జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈక్రమంలో పురుషోత్తమాయగూడెం శివారులోని ఆకేరువాగులో కొట్టుకుపోయిన సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన యువ శాస్త్రవేత్త అశ్విని, మోతిలాల్ కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించనున్నారు. ఉ10గం.కు అశ్విని, మోతిలాల్ చిత్రపటాలకు పూలమాలవేసి సీఎం నివాళులర్పిస్తారు. కాగా వీరు HYD వెళ్తుండగా ఆకేరువాగు వరద ప్రవాహానికి గల్లంతయిన విషయం తెలిసిందే.

News September 3, 2024

గణేశ్ మండపాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: కలెక్టర్ జితేశ్

image

ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, అగ్నిమాపక, విద్యుత్, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. గణేష్ మండపాలను తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు.

News September 3, 2024

SRPT: ‘వరద నష్టం అంచనాలపై పూర్తి వివరాలు అందజేయాలి’

image

భారీ వర్షాలకు జిల్లాలో జరిగిన వరద నష్టంపై అంచనా వివరాలు ఇవ్వాలని తహశీల్దార్‌కు ఎంపీడీవోలకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తం నష్టం వివరాలు తాత్కాలిక పునరుద్ధరణ శాశ్వత పరిష్కారం తదితర వాటిపై అంశాల వారీగా విడివిడిగా నివేదికలను అందజేయాలని అధికారులు ఆదేశించారు.

News September 3, 2024

KNR: ‘పోషణ మాసాన్ని విజయవంతం చేయాలి’

image

కలెక్టరేట్ కార్యాలయం సోమవారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ పమేల సత్పతి మాట్లాడుతూ.. నెల రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలందరిని భాగస్వాములను చేయాలని అన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులు తీసుకోవలసిన పోషకాహారం గురించి వివరించే ప్రదర్శనలు, సమావేశాలు, ర్యాలీలు, మేళా వంటివి ఏర్పాటు చేయాలన్నారు.

News September 3, 2024

రేపు మహబూబాబాద్ జిల్లాలో సీఎం పర్యటన వివరాలివే!

image

మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి రేపు పర్యటించనున్నారు. నెల్లికుదురు మండలం రావిలాల, మర్రిపెడ మండలం పురుషోత్తమగుడం గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించరున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి పోలీస్ శాఖతోపాటు వివిధ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News September 3, 2024

మెదక్: జిల్లాలో 165 ఎకరాల పంట నష్టం

image

భారీ వర్షాల వల్ల జిల్లాలో ఇప్పటివరకు 165 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారి ద్వారా అంచనా వేశామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 223 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News September 3, 2024

ఆదిలాబాద్: నేడు విద్యాసంస్థలకు సెలవు : కలెక్టర్

image

అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు నేడు (ఈనెల 3)న సెలవును ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. అన్ని విద్యాసంస్థలు సెలవు పాటించాలని సూచించారు. భారీ వర్షాలతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఆయన తెలిపారు.