Telangana

News September 3, 2024

KMR: నేడు కూడా జిల్లాలో విద్యాసంస్థల బంద్: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో అధిక వర్షప్రభావం కొనసాగుతున్నందున విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం కూడా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించారు. ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలు అన్ని ఈ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

News September 3, 2024

HYD: ప్రజలకు హెచ్చరికలు జారీ చేయలేదు: KTR

image

HYD వాతావరణ కేంద్రం ఆగస్టు 27న పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందని MLA KTR తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసినా.. ఈ కుంభకర్ణ కాంగ్రెస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్తలు, ప్రజలకు హెచ్చరికలు జారీ చేయలేదన్నారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఓ యువ శాస్త్రవేత్త, 20 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. KTR వ్యాఖ్యలపై మీ కామెంట్..?

News September 2, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేటి ముఖ్యంశాలు..

image

*ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టులకు భారీగా పొట్టేతిన వరద* ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలో కూలిన ఇండ్లు, నీట మునిగిన పంట పొలాలు* శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 40 గేట్లు ఎత్తివేత* పోచారం ప్రాజెక్ట్ వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ* ఉమ్మడి జిల్లాలో ఘనంగా ఏడ్ల పోలాల అమావాస్య* కామారెడ్డి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు*

News September 2, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

✒Deputy CM పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
✒అత్యవసర పరిస్థితిలో ఫోన్ చేయండి:SPలు
✒భారీ వర్షాలు.. పిల్లల పట్ల జాగ్రత్త:కలెక్టర్లు
✒ఘనంగా వైయస్సార్ వర్ధంతి వేడుకలు
✒పలుచోట్ల పొంగిపోతున్న వాగులు.. రాకపోకలకు అంతరాయం
✒కోయిల్‌సాగర్ ప్రాజెక్టు వద్ద భారీ బందోబస్తు
✒భారీ వర్షం..కూలిన 50కి పైగా మట్టిమిద్దెలు
✒మరో రెండు రోజులు భారీ వర్షాలు.. బయటికి రాకండి: కలెక్టర్లు

News September 2, 2024

మెదక్: ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను సోమవారం కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. కంట్రోల్ రూమ్‌లో ఫిర్యాదుల రిజిస్టర్‌ను పరిశీలించారు. భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 29 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు.

News September 2, 2024

శాసనసభ స్పీకర్‌ను కలిసిన వరంగల్ ఎంపీ

image

హనుమకొండ జిల్లాకు విచ్చేసిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను వరంగల్ ఎంపీ కడియం కావ్య దంపతులు కలిసి సన్మానించారు. అనంతరం వరంగల్ పార్లమెంటుకు సంబంధించిన పలు అంశాలపై స్పీకర్‌తో ఎంపీ చర్చించారు. నిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని ఎంపీకి స్పీకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News September 2, 2024

భారీ వర్షం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిందిదే! 4/4

image

*ఇబ్రహీంపట్నం: వేములకుర్తిలో ఇంటిపై పిడుగు.
*బెజ్జంకి: తోటపల్లిలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు.
*గంగాధర: భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు.
*వెల్గటూర్: భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు
*ధర్మపురి: భారీ వర్షాలకు.. అప్రమత్తమైన పోలీసులు హెచ్చరికలు జారీ.
*పెగడపల్లి: తెగిపడిన రోడ్లు.. బయటకు రావద్దని పోలీసుల హెచ్చరికలు.
*గొల్లపల్లి: భారీ వర్షాలు.. ఆగిన రైతుల పనులు.

News September 2, 2024

భారీ వర్షం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిందిదే! 3/4

image

*కరీంనగర్: కలెక్టరేట్ ఏరియాలో భారీగా చేరిన వరద నీరు.
*శంకరపట్నం: అంబాలాపూర్ ఊరు చెరువుకు గండి.
*శ్రీరాంపూర్: నక్కల చెరువులో వ్యక్తి గల్లంతు.
*శంకరపట్నం: మానేరు డ్యామ్‌లో వ్యక్తి గల్లంతు.
*పెద్దపల్లి: భారీ వర్షాలకు స్తంభించిన జనజీవనం.
*ఎండపల్లి: చర్లపల్లి గ్రామంలో భారీ వర్షానికి కూలిన ఇల్లు.
*వీణవంక: మల్లారెడ్డిపల్లి గ్రామంలో కూలిన ఇల్లు.
*రామడుగు: భారీ వర్షాలకు ధ్వంసమైన వంతెనలు.

News September 2, 2024

భారీ వర్షాలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిందిదే! 2/4

image

*గొల్లపల్లి: భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు.
*వేములవాడ: రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు.
*శంకరపట్నం: నీటిలో కొట్టుకుపోయిన బైకు.
*KNR: భారీ వర్షం.. ప్రజావాణి రద్దు.
*ఓదెల: కొమిర గ్రామంలో భారీ వర్షానికి కూలిన ఇల్లు.
*గంభీరావుపేట: సింగసముద్రం పెద్ద కాలువకు గండి.
*జగిత్యాల: భారీ వర్షం.. ప్రజావాణి రద్దు చేసిన కలెక్టర్.
*రామగుండం: భారీ వర్షం.. నీట మునిగిన రోడ్లు

News September 2, 2024

భారీ వర్షం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిందిదే! 1/4

image

*ధర్మపురి: గోదావరి నదిలో పెరిగిన నీటి వరద.
*జమ్మికుంట: పంట పొలాల్లోకి భారీగా చేరిన వరద నీరు.
*కరీంనగర్: నీట మునిగిన ప్రధాన రహదారులు.
*ఎల్లంపల్లి: ప్రాజెక్టు నుంచి నిలిచిపోయిన రాకపోకలు.
*చిగురుమామిడి: రికార్డు స్థాయి వర్షపాతం నమోదు.
*తంగళ్లపల్లి: మండెపల్లి గ్రామంలో భారీ వర్షానికి కూలిన ఇల్లు.
*మల్యాల: తెగిన రహదారి రాకపోకలు బంద్.
*సిరిసిల్ల: నీట మునిగిన పాత బస్టాండ్ ఏరియా.