India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ పదవులు ఇచ్చిందని తెలంగాణ అమరుడు శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తనకు భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిన అమరుల కుటుంబాలకు 10 ఏళ్లుగా న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. నియోజకవర్గాల వ్యాప్తంగా ఎన్నికల కోడ్ తక్షణం అమలులోకి వచ్చిందని ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైక్ అనుమతులు, వాహన అనుమతులను ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి పొందాలని స్పష్టం చేశారు. ఎవరైనా ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలో 18 లక్షల 12 వేల 858 మంది ఉన్నారు. ఇందులో 8,95,777 పురుషులు, 9,16,876 మహిళలు, 205 ఇతరులున్నారు. సెగ్మెంట్‌లో సిద్దిపేటలో 2,36,474, మెదక్‌లో 2,16,748, నర్సాపూర్‌లో 2,26,154, సంగారెడ్డిలో 2,47,338, పటాన్‌చెరులో 4,07,419, దుబ్బాకలో 19,9,236, గజ్వేల్‌లో 2,79,489 మంది ఓటర్లున్నారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం 764 పోలింగ్ కేంద్రాలున్నాయి.
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక పార్టీకి కత్తి మీద సాము లాగా మారనుంది. మెదక్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేదా అతని భార్య నిర్మలను పోటీలో నిలపాలని అనుకుంటున్నారు. ఇదే స్థానంపై మల్కాజిగిరి మాజీ MLA మైనంపల్లి హనుమంతరావు, నీలం మధు ముదిరాజ్ సైతం పోటీ చేయాలని చూస్తున్నారు. సీటు కోసం అధిష్ఠానం వద్ద గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్.
రూ.30 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉందని పక్కనే ఉన్న యజమాని తన స్థలంతో పాటు కలిపేసుకుని గదులు క్రీడా మైదానం ఏర్పాటు చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ ఫేజ్-1లో చోటుచేసుకుంది. పలువురు ఫిర్యాదుల మేరకు షేక్‌పేట రెవెన్యూ అధికారులు పరిశీలించేందుకు వెళ్తే వారెంట్ లేకుండా అనుమతి లేదని అధికారులతో వాదించారు. 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించామన్నారు.
రూ.30 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉందని పక్కనే ఉన్న యజమాని తన స్థలంతో పాటు కలిపేసుకుని గదులు క్రీడా మైదానం ఏర్పాటు చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ ఫేజ్-1లో చోటుచేసుకుంది. పలువురు ఫిర్యాదుల మేరకు షేక్‌పేట రెవెన్యూ అధికారులు పరిశీలించేందుకు వెళ్తే వారెంట్ లేకుండా అనుమతి లేదని అధికారులతో వాదించారు. 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించామన్నారు.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 21, 22 వార్డులలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. నయీముద్దీన్ ఇంట్లో నుంచి దాదాపు రూ.2 లక్షల నగదు, 10 తులాల బంగారం ఎత్తుకెళ్లారని బాధితులు వాపోయారు. షబానా బేగం ఇంట్లో నుంచి రూ.80వేలు, తులం బంగారం ఎత్తుకెళ్లారు. గంగుబాయి ఇంటి తాళం పగలగొట్టి చోరీకి యత్నించగా అలికిడి రావడంతో దుండగులు పరారయ్యారని బాధితులు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గుగులోతు తండాలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన గుగులోతు వెంకన్న(28) తన ఇంటి ముందు బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్‌కి గురయ్యాడు. ఈ క్రమంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. వెంకన్నకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ వెంకన్న తెలిపారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్‌లో విషాదం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మొంగల లక్ష్మయ్య(55) శనివారం తన వ్యవసాయ పొలం వద్ద బోరు మోటారు వేసేందుకు వెళ్లాడు. స్టార్టర్ నడవకపోవడంతో దానిని రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఎమ్మెల్సీ కవిత ఈడీ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నా హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా నిరసనలు కనిపించడం లేదు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు స్తబ్ధుగా ఉండటంతో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Sorry, no posts matched your criteria.