Telangana

News September 2, 2024

భారీ వర్షం.. ఉమ్మడి WGL జిల్లాలో జరిగిందిదే! 1/3

image

> దుగ్గొండి: నీటి వరదకు కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం
> మరిపెడ: ఆకేరు వాగులో కారు కొట్టుకుపోయి అశ్విని అనే యువతి మృతి
> కేసముద్రం: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
> మరిపెడ: కూలిన జాతీయ రహదారి.. రాకపోకలు బంద్
> భూపాలపల్లి: సింగరేణికి రూ.35 లక్షల వరకు నష్టం
> తాడ్వాయి: పశువుల మేత కోసం వెళ్లి ఒకరి మృతి
> WGL: పలు ప్రాంతాల్లో నీట మునిగిన పొలాలు
> MHBD: జిల్లాలో తెగిన పలు చెరువు కట్టలు, రోడ్లు

News September 2, 2024

HYD: నగరవాసులకు ట్రాఫిక్ ALERT

image

HYD నగర ప్రజలకు సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు. ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ కప్-2024 సెప్టెంబర్ 3, 6, 9వ తేదీలలో GMCB గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి, గచ్చిబౌలి నుంచి లింగంపల్లి, IIIT సర్కిల్ నుంచి విప్రో రూట్‌లో ఆయా రోజుల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ రద్దీ ఉంటుందన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

భారీ వర్షం.. ఉమ్మడి WGL జిల్లాలో జరిగిందిదే! 1/1

image

> దుగ్గొండి: నీటి వరదకు కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం
> మరిపెడ: ఆకేరు వాగులో కారు కొట్టుకుపోయి అశ్విని అనే యువతి మృతి
> కేసముద్రం: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
> మరిపెడ: కూలిన జాతీయ రహదారి.. రాకపోకలు బంద్
> భూపాలపల్లి: సింగరేణికి రూ.35 లక్షల వరకు నష్టం
> తాడ్వాయి: పశువుల మేత కోసం వెళ్లి ఒకరి మృతి
> WGL: పలు ప్రాంతాల్లో నీట మునిగిన పొలాలు
> MHBD: జిల్లాలో తెగిన పలు చెరువు కట్టలు, రోడ్లు

News September 2, 2024

సిద్దిపేట: విషాదం.. అన్నాచెల్లెలు సూసైడ్

image

సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్‌లో అన్నాచెల్లెలు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. కాసులాబాద్ కిష్టయ్య భార్య ఏడాది క్రితం మృతిచెందగా ఇద్దరు కొడుకులు, కూతురుతో నివసిస్తున్నాడు. నిన్న కూతురు కళ్యాణి (16) చెరువులో పడి చనిపోగా.. అన్న రాము(20) పురుగు మందు తాగి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు చనిపోయాడు. కళ్యాణి మృతదేహం మసిరెడ్డి కుంటలో ఈరోజు లభ్యమైంది.

News September 2, 2024

ADB ప్రజావాణిలో 35 అర్జీల స్వీకరణ

image

ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశం మందిరం సోమవారం నిర్వహించిన ప్రజాఫిర్యాదుల భాగంగా మండలాల నుండి వచ్చిన దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్వీకరించారు. ఈ సందర్భంగా 35 మంది వద్ద అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. వారి సమస్యను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, అధికారులు ఉన్నారు.

News September 2, 2024

NZB: ఎస్సారెస్పీని సందర్శించిన కలెక్టర్, సీపీ

image

శ్రీరాంసాగర్ రిజర్వాయర్ ను సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సందర్శించారు. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు. రిజర్వాయర్లో నీటిమట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టుకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News September 2, 2024

ఖమ్మం జిల్లాలో విద్యాసంస్థలకు రేపు సెలవు 

image

భారీ వర్షాలు, వరదల కారణంగా ఖమ్మం జిల్లాలోని విద్యా సంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు మంగళవారం సెలవు ఇస్తూ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 2, 2024

ప్రధాని మోదీని సాయం కోరాను: సీఎం రేవంత్ రెడ్డి

image

సూర్యాపేట జిల్లా సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాగర్ ఎడమ కాలువ తెగడం వల్ల జరిగిన పంట నష్టంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రభుత్వం నిరంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాం అని తెలిపారు. ఖమ్మం, నల్లగొండ పరిస్థితి పైన ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీకి వివరించి సాయం కోరానన్నారు. 

News September 2, 2024

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాల వల్ల పంటలకు నష్టం

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. వాగులు, చెరువుల ద్వారా చేరిన నీరు పంట పొలాలను ముంచెత్తింది. నీళ్లు ఎక్కువ రోజులు ఉంటే.. వరి పంటకు తెగుళ్లు సోకే అవకాశం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లాలో పెసర పంట దెబ్బతింది.