Telangana

News September 2, 2024

ఖమ్మం జిల్లాలో విద్యాసంస్థలకు రేపు సెలవు 

image

భారీ వర్షాలు, వరదల కారణంగా ఖమ్మం జిల్లాలోని విద్యా సంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు మంగళవారం సెలవు ఇస్తూ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 2, 2024

ప్రధాని మోదీని సాయం కోరాను: సీఎం రేవంత్ రెడ్డి

image

సూర్యాపేట జిల్లా సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాగర్ ఎడమ కాలువ తెగడం వల్ల జరిగిన పంట నష్టంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రభుత్వం నిరంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాం అని తెలిపారు. ఖమ్మం, నల్లగొండ పరిస్థితి పైన ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీకి వివరించి సాయం కోరానన్నారు. 

News September 2, 2024

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాల వల్ల పంటలకు నష్టం

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. వాగులు, చెరువుల ద్వారా చేరిన నీరు పంట పొలాలను ముంచెత్తింది. నీళ్లు ఎక్కువ రోజులు ఉంటే.. వరి పంటకు తెగుళ్లు సోకే అవకాశం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లాలో పెసర పంట దెబ్బతింది.

News September 2, 2024

వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సోమవారం ఆయన మంథని పట్టణంలోని గౌతమేశ్వర ఆలయ పరిసరాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీతో కలిసి పరిశీలించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కూడా నీరు విడుదలయ్యే అవకాశం ఉన్నందున మంథని పరిసర ముంపు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

News September 2, 2024

తుంపల్లి వాగును పరిశీలించిన కలెక్టర్

image

ఆసిఫాబాద్ మండలంలోని తుంపల్లి వాగును సోమవారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సందర్శించారు. అధికారులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ..వరద ప్రభావిత, లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలకు ఎవరు వెళ్లవద్దన్నారు. సమస్యలు ఉంటే కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

News September 2, 2024

NZB: ఆ పథకం అమలుపై షబ్బీర్ అలీ సమీక్ష

image

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో అటల్ మిషన్ ఫర్ రిజువేనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పథకం అమలుపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సోమవారం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్, కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ ఇందుప్రియ తదితరులు పాల్గొన్నారు.

News September 2, 2024

HYD: ప్రొ.నాగేశ్వర్‌పై దాడి చేస్తాననడం అప్రజాస్వామికం: హరీశ్‌రావు

image

మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు నాగేశ్వర్ రావుపై కొంత మంది బీజేపీ నేతలు చేస్తున్న అనుచిత దాడి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని BRS ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. రాజకీయ విమర్శలను జవాబుగా రాజకీయ విమర్శలతోనే ఎదుర్కోవాలిగాని, అందుకు భిన్నంగా భౌతిక దాడులు చేస్తామని, బయట తిరగనివ్వబోమని బెదిరిస్తూ తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా దుర్భాషలాడటం అప్రజాస్వామికం అన్నారు.

News September 2, 2024

HYD: అత్యవసరంగా విజయవాడ, ఖమ్మం వెళ్లాలా?

image

HYD నుంచి విజయవాడ, ఖమ్మం ప్రాంతాలకు అత్యవసరంగా వెళ్లాలంటే ఈ రూట్లలో వెళ్లండి.
✓HYD నుంచి చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ
✓HYD నుంచి చౌటుప్పల్, చిట్యాల, నకిరేకల్, అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల, మరిపెడ బంగ్లా, ఖమ్మం
✓HYD పోలీస్ ట్రాఫిక్ హెల్ప్ లైన్‌కు 9010203626 సంప్రదించాలని తెలిపారు.

News September 2, 2024

WGL, MHBD పోలీసులను అభినందించిన డీజీపీ

image

భారీ వర్షాలకు వరదలతో MHBD, నెక్కొండ, కేసముద్రం రైల్వే స్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వరంగల్, మహబూబాబాద్ పోలీస్ సిబ్బంది చేపట్టిన సహాయక చర్యలను అభినందిస్తూ డీజీపీ జితేందర్ “X”లో పోస్ట్ చేశారు. రైళ్లలో ఉండిపోయిన దాదాపు 5,616 మంది ప్రయాణికులను పోలీసులు వివిధ వాహనాల ద్వారా కాజిపేట రైల్వే స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వరంగల్ సీపీ, మహబూబాబాద్ ఎస్పీ, పోలీస్ సిబ్బందిని అభినందించారు.

News September 2, 2024

నిర్మల ఎగువ మానేరు జలాశయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

image

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం
నర్మాల గ్రామంలోని ఎగువ మానేరు జలాశయం పూర్తిగా నిండి మత్తడి దుంకుతోంది. దీంతో సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి జలకళను సంతరించుకుంది.