Telangana

News March 19, 2024

MBNR: బలవంతంగా వ్యభిచారంలోకి..

image

యువతితో బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఘటన HNKజిల్లాలో జరిగింది. పోలీసుల ప్రకారం.. గద్వాల జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం ఈనెల 10న HYDవచ్చి MGBS బస్టాండ్‌లో వేచి చూస్తోంది. కాగా ఇద్దరు యువకులు ఆమెకు మాయమాటలు చెప్పి తమ ఇంటికి తీసుకెళ్లారు. తిరిగి వరంగల్ జిల్లా వంగపహాడ్‌కు తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేయాలంటూ దాడికి పాల్పడ్డారు. ఆమె చాకచక్యంగా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

News March 19, 2024

KMM:రైలు కింద పడి యువకుడి బలవన్మరణం

image

చింతకాని మండలం అనంతసాగర్ సమీపంలో మల్లెల కుటుంబరావు (30) అనే వ్యక్తి సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంకు చెందిన కుటుంబరావు కొంతకాలంగా అత్తగారి ఊరైన అనంతసాగర్లో నివసిస్తున్నాడు. సోమవారం ఓ ఎక్స్ ప్రెస్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్సై పారుపల్లి భాస్కర్ రావు తెలిపారు.

News March 19, 2024

NLG: కారులో తర్జనభజన.. పోటీకి ముందుకు రాని అభ్యర్థులు!

image

ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ముందునుంచి టికెట్ ఆశించిన వారు.. ఇప్పుడు పోటీచేయబోమని చెప్పేయగా, మరొకరికి టికెట్ ఇద్దామని పార్టీ ఆలోచిస్తే.. ఆయన పార్టీ మారుతారన్న చర్చ జరుగుతోంది. భువనగిరి టికెట్ ను బీసీలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నప్పటికీ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా తర్జనభర్జన పడుతోంది.

News March 19, 2024

WGL: బలవంతంగా వ్యభిచారంలోకి..

image

యువతితో బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఘటన హసన్పర్తిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. గద్వాల జిల్లాకు చెందిన ఓ యువతి టెలీకాలర్ ఉద్యోగం కోసం ఈనెల 10న HYD వచ్చి MGBS బస్టాండ్‌లో వేచి చూస్తోంది. ఈక్రమంలో ఇద్దరు యువకులు ఆమెకు మాయమాటలు చెప్పి తమ ఇంటికి తీసుకెళ్లారు. తిరిగి వంగపహాడ్‌కు తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేయాలంటూ దాడికి పాల్పడ్డారు. ఆమె చాకచక్యంగా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

News March 19, 2024

RR: ‘సిబ్బందికి సెలవులు ఇవ్వకండి’

image

MP ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు వివిధ శాఖల సిబ్బందికి సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని జిల్లా కలెక్టర్‌ శశాంక అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిబ్బందికి సంబంధించిన ఇంటి చిరునామాలు, ఎపిక్‌ కార్డుల వివరాలు తప్పనిసరిగా అందించాలన్నారు. సిబ్బందికి సెలవులు ఇవ్వరాదని సూచించారు. ఈ మీటింగ్‌‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ఉన్నారు.

News March 19, 2024

ADB: అన్న చనిపోయాడని సమాచారం.. తమ్ముడికి గుండెపోటు

image

చావు గురించి తప్పుడు సమాచారం ఓ నిండు ప్రాణాన్ని తీసిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలో జరిగింది. బోథ్‌కు చెందిన నరసింహదాస్‌, బాపు ఇద్దరు అన్నదమ్ములు. అనారోగ్యంతో బాధపడుతున్న బాపు బతికే ఉన్నా, ఆయన చనిపోయాడంటూ బంధువులు ఫోన్‌ చేసి చెప్పడంతో తమ్ముడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అన్న ఇక లేడని రోదించిన దాస్ గంటల వ్యవధిలోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నింపింది.

News March 19, 2024

రాజంపేటలో కరెంటు షాక్ తగిలి యువకుడి మృతి

image

మండలంలోని తలమడ్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు ఎస్ఐ సంపత్ తెలిపారు. గ్రామానికి చెందిన ప్రవీణ్ తన ఇంటి వద్ద నల్ల నీటికి మోటార్ కనెక్షన్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలిందన్నారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News March 19, 2024

MDK: భారీ వర్షం.. చిన్నారి మృతి

image

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. గత రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన గాలులు వీయడంతో జాజి తండా గ్రామంలో ఓ ఇంటి పైకప్పు కూలిపోయి సంగీత(3)కు గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ పలు శాఖలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓రెండవ రోజు కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షలు
✓తల్లాడ మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓సత్తుపల్లి మండలం లో ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి పర్యటన
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓ఖమ్మం జిల్లాలో ఓటు నమోదు పై ప్రత్యేక కార్యక్రమం
✓పినపాక మండలంలో ఎమ్మెల్యే పాయం పర్యటన

News March 19, 2024

కొల్లాపూర్: మంచంపైనే పరీక్ష రాసిన విద్యార్థి

image

కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి సాంబశివుడికి నెల కిందట ప్రమాదంలో కాలు విరిగింది. సోమవారం కుమారుడు తెలుగు పరీక్ష రాసేందుకు తల్లిదండ్రులు బయ్యన్న, సుజాత మరో సహాయకుడితో మంచంతో సహా ఆటోలో కొల్లాపూర్ లోని పరీక్ష కేంద్రానికి తరలించారు. ముందస్తు అనుమతితో సాంబశివుడిని మంచంపైనే కూర్చొని పరీక్ష రాయించినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు.