India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇవాళ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు, సిబ్బంది పార్లమెంట్ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున రద్దు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.. ఈ విషయాన్ని గమనించి జిల్లా నుండి ప్రజలు ఫిర్యాదులు అందించడానికి కలెక్టర్ కార్యాలయానికి రావద్దని సూచించారు.
లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. ఆదివారం ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ పై జిల్లా ఎస్పీ చందనా దీప్తితో కలిసి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 14 లక్షల 90 వేల 431 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు.
చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా చర్యలు చేపట్టి విస్తృత తనిఖీలు నిర్వహించాలని, నగదు, మద్యం రవాణాను నియంత్రించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. కలెక్టర్, ఆదివారం పోలీసు కమిషనర్ సునీల్ దత్‌తో కలిసి ఇల్లందు రోడ్, ఎన్ఎస్పీ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది విధులు నిర్వహణ, ఎన్ని వాహనాలు తనిఖీ చేసింది అడిగి తెలుసుకున్నారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు తెలిపారు. తదుపరి ప్రజావాణి కార్యక్రమ తేదీల వివరాలను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వెల్లడించనున్నారు. జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
లోక్‌సభ ఎన్నికల ముంగిట HYD, రంగారెడ్డిలోని 3 స్థానాలపై కన్‌ఫ్యూజన్ నెలకొంది. ఇటీవల INC చేవెళ్ల అభ్యర్థిని తానే అంటూ పట్నం సునీత గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. కానీ, అనూహ్యంగా రంజిత్ రెడ్డి పేరు తెరమీదకొచ్చింది. సికింద్రాబాద్ టికెట్ బొంతు రామ్మోహన్‌దే అంటూ ఆయన అనుచరులు ప్రచారం చేస్తుండగా.. దానం నాగేందర్‌కు అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈ స్థానాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మీ కామెంట్..?
MBNR:గ్రూప్-1,DSC నోటిఫికేషన్ల నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా నిరుద్యోగులు హైదరాబాద్ కు క్యూ కట్టారు. అమీర్ పేట, అశోక్ నగర్, దిల్ సుఖ నగర్ కోచింగ్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. నిరుద్యోగులు రూ. 5 భోజనం తింటూ 8 నుంచి 10 గంటల సేపు చదువుతున్నారు.MBNR జిల్లా కేంద్రంలోని అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. వీరి కోసం మౌలిక వసతులతో పాటు అదనపు పుస్తకాలు అందుబాటులోకి తెస్తున్నట్లు లైబ్రేరియన్ తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో రహదారులు నిత్యం రోడ్డు ప్రమాదాలతో నిత్తురోడుతున్నాయి. రోజు ప్రమాదాలలో కొందరు గాయపడుతుండగా, మరికొందరు మరణిస్తున్నారు. శనివారం మెట్పల్లి వద్ద ముగ్గురు మహిళలను గుర్తు తెలియని వాహనం ఢీకొనగా గాయాలయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండలంలో ఓ వ్యక్తి మరణించారు. ఆదివారం ఉదయం జగిత్యాల కోరుట్ల ప్రధాన రహదారిపై ఆగిఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో కొండగట్టుకు చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు.
ఖమ్మం జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. 24గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటుండగా, 83318 51510 నంబర్ కు ఫోన్ చేసి సమస్యలు తెలపొచ్చని తెలిపారు. అయితే, సెంటర్లు ఏర్పాటుచేసిన కొన్ని పాఠశాలల పేర్లు ఒకే తరహాలో ఉన్నందున కేంద్రాలను ముందు రోజే చూసుకోవాలన్నారు.
లోక్‌సభ ఎన్నికల ముంగిట HYD, రంగారెడ్డిలోని 3 స్థానాలపై కన్‌ఫ్యూజన్ నెలకొంది. ఇటీవల INC చేవెళ్ల అభ్యర్థిని తానే అంటూ పట్నం సునీత గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. కానీ, అనూహ్యంగా రంజిత్ రెడ్డి పేరు తెరమీదకొచ్చింది. సికింద్రాబాద్ టికెట్ బొంతు రామ్మోహన్‌దే అంటూ ఆయన అనుచరులు ప్రచారం చేస్తుండగా.. దానం నాగేందర్‌కు అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈ స్థానాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మీ కామెంట్?
సత్తుపల్లిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఎండీ. సమీర్ (22) శనివారం ఎలుకల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
Sorry, no posts matched your criteria.