Telangana

News September 26, 2024

KNR: పశు బీమా అమలు అయ్యేదెప్పుడు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యవసాయం తరువాత రైతులు ఎక్కువగా పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అనివార్య కారణాలతో పశువులు మృతి చెందితే రైతులకు అందించే పశు బీమా పథకం ఆరేళ్లుగా అమలు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు, పిడుగు పాటుకు గురై పలు పశువులు మృత్యువాత పడ్డాయి. ప్రభుత్వం బీమా పథకాన్ని పునరుద్ధరించి ఆదుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.

News September 26, 2024

ఖమ్మం: గ్రామ పంచాయితీలకు స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ విడుదల

image

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ క్రింద రూ.162.13 కోట్ల నిధులు విడుదల చేసింది. అందులో ఖమ్మం జిల్లాకు రూ.8,50,45,281, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రూ.5,92,24,851 కేటాయించారు. ఈ మొత్తాన్ని మల్టి పర్పస్ వర్కర్స్ (MPW) పెండింగ్ జీతాలు, కరెంట్ చార్జీలు, గ్రామపంచాయతీ ట్రాక్టర్ మంత్లీ ఇన్‌స్టల్‌మెంట్, స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమానికి వినియోగించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.

News September 26, 2024

ములుగు: చిరుతపులి చర్మం స్వాధీనం

image

చిరుతపులి చర్మం విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్న ఘటన ములుగు జిల్లా వాజేడులో జరిగింది. ఓఎస్డీ గితే మహేశ్ బాబాసాహెబ్ వివరాలు.. ఛత్తీస్‌గఢ్ నుంచి జాడి మహేందర్ అనే వ్యక్తి చిరుతపులి చర్మం అమ్మకానికి వస్తున్నాడని పక్కా సమాచారం వచ్చింది. ఈ మేరకు ఏటూరునాగారం ఏఎస్పీ శివమ్ ఉపాధ్యాయ, ఫారెస్ట్ రేంజర్ చంద్రమౌళి, పోలీసు సిబ్బంది చంద్రుపట్ల క్రాస్ వద్ద అతడిని పట్టుకుని కేసు నమోదు చేశారు.

News September 26, 2024

దామరగిద్ద: చిరుత దాడిలో లేగ దూడ మృతి

image

చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన దామరగిద్ద తండాలో జరిగింది. రైతు గోన్యనాయక్ రోజువారీగానే ఆవులను మేపుకొని వచ్చి పొలం వద్ద కట్టేయగా రాత్రి లేగ దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. కాగా, వారం రోజులుగా చిరుత బాపన్‌పల్లి గ్రామ శివారులో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే అటవీ అధికారులు చిరుతను బంధించేందుకు బాపన్‌పల్లి శివారు అడవిలో బోన్ ఏర్పాటు చేశారు.

News September 26, 2024

పెంచికల్‌పేట: నాలుగు కాళ్లతో కోడిపిల్ల జననం

image

పెంచికల్‌పేట మండలంలోని కొండపల్లిలో నాలుగు కాళ్ల కోడి పిల్ల జన్మించింది. గ్రామానికి చెందిన చౌదరి గంగయ్య కొంతకాలంగా కోడిని పెంచుకుంటున్నారు. అది 9 పిల్లలకు జన్మనివ్వగా, ఇందులో ఒక దానికి నాలుగు కాళ్లు ఉన్నాయి. జన్యు లోపాలతో నాలుగు కాళ్లు ఉన్న కోడి పిల్లలు అరుదుగా జన్మిస్తుంటాయని పశు వైద్య నిపుణులు తెలిపారు.

News September 26, 2024

సాగర్ ఎడమ కాల్వలో పడి ఇద్దరు గల్లంతు

image

నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో పడి ఇద్దరు గల్లంతయ్యారు. స్థానికుల, పోలీసుల వివరాల ప్రకారం.. త్రిపురానానికి చెందిన సాయి (25), శైలజ(30) బట్టలు ఉతకడానికి సమీపంలోని ఎడమ కాల్వకు వెళ్లారు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు శైలజ, సాయి పడిపోయారు. గమనించిన వారు కాపాడే ప్రయత్నం చేసిన నీటీ ప్రవాహనికి కొట్టుకుపోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు

News September 26, 2024

శ్రీశైలం జలాశయానికి 1,02,286 క్యూసెక్కుల ఇన్ ప్లో

image

శ్రీశైలం జలాశయానికి ఎగువ ఉన్న జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి బుధవారం 1,02,286 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రస్తుతం 875.0 అడుగుల వద్ద 163.5820 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలవిద్యుత్ కేంద్రంలో 13.723 మి.యూ. కుడిగట్టు కేంద్రంలో 2.107 మి.యూ విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఎడమగట్టు, కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి 49,234 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

News September 26, 2024

హైదరాబాద్‌ వెరీ కూల్ (PHOTO)

image

గ్రేటర్‌ HYDలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. గురువారం హైదరాబాద్, రంగారెడ్డిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ కేంద్రం పేర్కొంది. తెల్లవారుజామున నగరంలో వర్షం కురిసింది. ప్రస్తుతం చల్లటి గాలులు వీస్తున్నాయి. KBR పార్క్, నెక్లెస్ రోడ్, గోల్కొండ తదితర ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం దర్శనమిస్తోంది. కూల్ వెదర్‌ను నగరవాసులు ఆస్వాదిస్తున్నారు.

News September 26, 2024

KMCలో కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ(KMC)లో వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వర్తించేందుకు 68 అసిస్టెంట్ ప్రొఫెసర్, 4 సీఏఎస్ ఆర్ఎంఓ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.రాంకుమార్ రెడ్డి తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షలు, సీఏఎస్ ఆర్ఎంఓకు రూ.52 వేలు వేతనం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 3 వరకు కాలేజీలో సంప్రదించాలని సూచించారు.

News September 26, 2024

హైదరాబాద్‌ వెరీ కూల్ (PHOTO)

image

గ్రేటర్‌ HYDలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. గురువారం హైదరాబాద్, రంగారెడ్డిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ కేంద్రం పేర్కొంది. తెల్లవారుజామున నగరంలో వర్షం కురిసింది. ప్రస్తుతం చల్లటి గాలులు వీస్తున్నాయి. KBR పార్క్, నెక్లెస్ రోడ్, గోల్కొండ తదితర ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం దర్శనమిస్తోంది. కూల్ వెదర్‌ను నగరవాసులు ఆస్వాదిస్తున్నారు.