Telangana

News September 2, 2024

కేఎంసీ కార్యాలయంలో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్

image

ఖమ్మం జిల్లాలో సోమవారం కూడా అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు కేఎంసీ కార్యాలయంలో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ కంట్రోల్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. నగరంలో వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే కాల్ సెంటర్ నంబర్లు 7901298265, 9866492029 ను సంప్రదించాలని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచినా వెంటనే ఈ నంబర్లకు సమాచారం అందించాలన్నారు.

News September 2, 2024

ఖమ్మం నుండి హైదరాబాద్ బస్సులు పునరుద్ధరణ

image

ఖమ్మం జిల్లా నుండి హైదరబాద్‌కు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు రీజనల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. జిల్లాలోని ఏడు డిపోల నుండి హైదరాబాదుకు బస్సులు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. నిన్న వర్షాల కారణంగా హైదరాబాద్ రూట్ ను రద్దు చేసిన అధికారులు తిరిగి ఈ రూట్లో బస్సులను పునరుద్ధరణ చేశారు.

News September 2, 2024

HYD: ట్రాఫిక్ అలర్ట్స్ చెప్పేందుకో FM RADIO

image

ట్రాఫిక్ జామ్ అయిందన్న వార్త తెలిస్తే ఈ వైపు వచ్చేవాళ్లం కాదుగా అని ట్రాఫిక్‌లో ఇరుక్కున్నప్పుడు సగటు వ్యక్తి అనుకునే ఉంటాడు. ఇక నుంచి ట్రాఫిక్ అలర్ట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు FM RADIO తరహాలో HYD పోలీసులు కమ్యూనిటీ రేడియోను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని సీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

News September 2, 2024

HYD: ప్రయాణాలు చేసేవారికి ALERT

image

భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ, ఖమ్మం ప్రాంతాలకు వెళ్లాలనుకునే నగర ప్రజలు ప్రయాణం వాయిదా వేసుకోవాలని HYD ట్రాఫిక్ అదనపు కమిషనర్ పి.విశ్వప్రసాద్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో విజయవాడ వెళ్లాలనుకుంటే చౌటుప్పల్, చిట్యాల, నార్కెట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా వెళ్లాలన్నారు. అత్యవసర పరిస్థితిలో సహాయానికి హైదరాబాద్ ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626 నంబర్ సంప్రదించాలన్నారు.

News September 2, 2024

HYD: 24 గంటల్లో కురిసిన వర్షపాత వివరాలు

image

HYD, RR, MDCL, VKB జిల్లాలలో కురిసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లో గచ్చిబౌలి-97, HCU-85.8, మాదాపూర్-68.5, మణికొండ-53.5, కూకట్‌పల్లి-81, ఉప్పల్-51, యూసఫ్ గూడ-69.5, షేక్ పేట-68.3, మోమిన్‌పేట-55.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News September 2, 2024

HYD: సమస్యలుంటే కాల్ చేయండి

image

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు సహాయం కోసం కింది నంబర్లకు కాల్ చేయాలని అధికారులు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు.
◆హైదరాబాద్ కలెక్టరేట్ 040-23202813, 9063423979.
◆హైదరాబాద్ ఆర్డీవో : 7416818610
◆జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్ 040-21111111
◆హైడ్రో కంట్రోల్ రూమ్ నంబర్ 9000113667
◆సికింద్రాబాద్ ఆర్డీఓ 9985117660, 8019747481

News September 2, 2024

విద్యుత్ ఉద్యోగుల సేవలు అమూల్యం: హరీష్ రావు

image

భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు ఫణంగా పెట్టి.. విధినిర్వహణలో నిమగ్నమైన విద్యుత్ ఉద్యోగుల సేవలు అమూల్యమైనవని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సోమవారం X వేదికగా హరీష్ రావు విద్యుత్ ఉద్యోగులు అందిస్తున్న సేవలు, పత్రికల్లో వచ్చిన వార్తలు పోస్ట్ చేశారు. క్లిష్టమైన పరిస్థితుల్లో వారు అందిస్తున్న సేవలను ఎంత పొగిడినా తక్కువే అని హరీష్ రావు కొనియాడారు.

News September 2, 2024

గ్రేటర్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గ్రేటర్ పరిధిలో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి అంధకారం నెలకొంది. క్షేత్ర స్థాయిలో మరమ్మతులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమీర్పేట, ఎర్రగడ్డ, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, సైబర్ సిటీ సర్కిల్, హబ్సిగూడ సరిళ్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్ధరించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

News September 2, 2024

రామగుండం: తగ్గిన రవాణా.. పెరిగిన కొత్తిమీర ధర

image

గత రెండు రోజుల నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రామగుండం తదితర ప్రధాన ప్రాంతాలలో కొత్తిమీర కిలో రూ.250 పెరిగింది. సాధారణ రోజుల్లో కిలో వంద రూపాయలు ఉండే కొత్తిమీర ధర ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుకుంది.

News September 2, 2024

HATS OFF.. మహబూబాబాద్ జిల్లా పోలీస్

image

భారీ వర్షం ధాటికి మహబూబాబాద్ జిల్లా అతలాకుతలం అయింది. వర్షం దంచి కొట్టడంతో ప్రజలు వణుకుతూ ఇళ్లలోనే తలదాచుకున్నారు. మహబూబాబాద్ జిల్లా పోలీసులు మాత్రం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వరద ప్రాంతాల్లో చిక్కుకుని ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో మహబూబాబాద్ రైల్వే స్టేషన్, బస్టాండ్‌లలో ప్రయాణికులకు ఆహారం, మంచినీటిని అందజేసి మానవత్వం చాటుకున్నారు.